15, నవంబర్ 2015, ఆదివారం

పద్యరచన - 1064

కవిమిత్రులారా!
“వరవీణా మృదుపాణీ...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

43 కామెంట్‌లు:

  1. వరవీ ణామృదు పాణీ
    కరములు జోడించితి నమ్మ కరుణిం చగనన్
    పరుసము లాడక నిరతము
    సరసము గానుంచు మంటి సాహస మందున్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘జోడించితి నమ/ జోడించితి నిక...’ అనండి. పద్యం చివర ‘సహవాసమునన్’ అంటే బాగుంటుందేమో!

    రిప్లయితొలగించండి
  3. వరవీ ణామృదు పాణీ
    కరములు జోడించితి నిక కరుణిం చగనన్
    పరుసము లాడక నిరతము
    సరసము గానుంచు మంటి సహవాస మునన్
    ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    వరవీణా మృదుపాణీ!
    సురుచిర మధురోక్త వాణి! సుందర వేణీ!
    ధర వేదాగ్రణి! తరుణీ
    వర రమణీ! గుణి! కవీశ వరనిశ్శ్రేణీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      జన్మదిన శుభాకాంక్షలు!
      అంత్యానుప్రాసతో మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి

  5. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ..................................

    వరవీణా మృదుపాణీ !
    సరసీరుహభవుని రాణి ! చదువుల రాణీ !
    వర బ౦భర చయ వేణీ !
    సరసిజ పుస్తక శుకాక్ష స౦స్థిత పాణీ !

    [ బ౦భర చయము : తుమ్మెదల సమూహ౦.
    అక్ష :అక్షమాల. స౦స్థిత :చక్కగాను౦డిన ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      అంత్యానుప్రాసతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. వరవీణా మృదుపాణీ
    కరకమ లాలంకృతాబ్జ కందర్పరధ
    న్నరవిందాసన సుందరి
    సురుచిం గొలుతును విధాత సుమనోహారిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. వరవీణామృదుపాణీ
    సరసిజములబోలునయన చదువుతల్లీ
    మరినానాలుకమీదన
    నిరతము వసియించుమమ్శ నెయ్యము దనరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. వరవీణా మృదుపాణీ
    సరసిజ భవురాణిమాకు శరణమొసగుమో
    సరసిజనేత్రి కొలుతు నిను
    వరము లొసగి బ్రోవుమమ్మ వదలకు మమ్మున్

    రిప్లయితొలగించండి
  9. వర వీణా! మృదుపాణీ!
    భారతీ! బ్రాహ్మీ ! భగవతి! పలుకుల రాణీ !
    శారద ! శాబ్డీ ! రాజ్ఞీ !
    వరగుణ ! శ్వేతాంబరధరి ! భాషా యోషా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర్ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘భారతి’ టైపాటు వల్ల దీర్ఘాంతమైనట్టుంది. దీర్ఘాంతమైతే గణదోషం.

      తొలగించండి
  10. కంది శంకరయ్య గురువు గార్కి పాద నమస్కారాలు.
    ఈ మధ్య నేను జల్లెడ బ్లాగులను జల్లించి చాలా దినాలయినది. క్షన్తవ్యోహం.
    కుశలమే కదా! ఉంటాను గురువుగారు.

    రిప్లయితొలగించండి
  11. ఈ సమస్య ను చూడండి గురువుగారు: '' నా నీ పత్నికి కోర్కె దీర్ప మనెహన్మంతుండు కౌంతేయతో !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్య బాగుంది. కానీ శార్దూల వృత్తాన్ని ఎందరు పూరిస్తారో? చూద్దాం... అవకాశాన్ని బట్టి బ్లాగులో ప్రకటిస్తాను.

      తొలగించండి
  12. వరవీణా మృధుపాణీ|
    కరుణయు లేకున్న?బ్రతుకు,కదలదు కలమే
    అరుదగుననురాగంబును
    వరముగ హృదయాన బంచ?వందనమమ్మా.

    రిప్లయితొలగించండి
  13. గురువు గారికి నమస్కారములు గ్రామాంతరము వలన ఆలస్యమైనది...

    వరవీణామృదు పాణీ
    మరాళ వాహిని విధాత మానస రాణీ
    సురగణ పూజిత జననీ
    కరుణను కురిపించి జగతి గావగ రమ్మా!

    రిప్లయితొలగించండి

  14. గు రు మూ ర్తి ఆ చా రి
    .............. . .........

    శ్రీ గు౦డు మదు సూదన్ గారికి
    జ న్మ ది న శు భా కా ౦ క్ష లు

    గు౦డు మదు సూద నార్యా !
    ని౦డుగ నూరే౦డ్లు బ్రతికి , నీమము తోడన్
    మె౦డుగ పద్యము లల్లుచు ---
    ను౦డుము ; సాహిత్య గరిమ ఉ ధ్బాసిల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      గుండు వారిపై మీ ఆశీఃపద్యం బాగుంది. ధన్యవాదాలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు...!!!

      గురుమూర్త్యాచార్యా! వి
      స్తరపూర్వక మంగళాప్త సద్వచనమ్ముల్
      కర మాదర మందించెను!
      మరువను మీ వచన మెపుడు మాన్య! నమస్తే!!


      తొలగించండి
  15. వరవీణా మృదుపాణీ
    సరసిజభవు ముద్దుపత్ని చదువుల తల్లీ
    నిరతము నిన్ను భజింతును
    వరమిమ్ము కవితలు వ్రాయ బాషా లక్ష్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. వరవీణా మృదుపాణీ
    చరణములేమాకురక్ష శాంతిని నిలుపన్
    నిరతము నిత్యసుఖంబున
    వరలగ సద్బుద్ధినొసగు వాక్ శుద్ధిడుమా.

    రిప్లయితొలగించండి
  17. గుండు మధుసూధన కవికిమెండుగాను
    జన్మదిన శుభా కాంక్షలుజరుపుకొనగ
    ఆయురారోగ్య భాగ్యమ్ము లందునట్లు
    శక్తి,వాణి,యు,లక్ష్మి నాసక్తినొసగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జన్మదిన శుభాకాంక్ష లొసంగినట్టి
      యీశ్వరప్పకవీశ్వర! హితకరముగ
      స్వస్తి వచనమ్ముఁ దెలిపితి! వందనములు!
      ధన్యవాదమ్ములందింతు ధన్యచరిత!!

      తొలగించండి
  18. వరవీణా మృదు పాణీ!
    హరిసుతు మురిపాల రాణి! యందవె వాణీ!
    వరమై! కవిత్వ బోణీ
    దొరలగ నానోట మదిని దోచెడు బాణీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. కవివర్యులు శ్రీ గుండు మధుసూదన్ గార్కి శంకరాభరణం బ్లాగు వేదికగా మరో మారు జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  20. వరవీణామృదు పాణీ
    పరమేష్టుని పత్ని హంస వాహిని రాణీ
    వరదాయిని వేదాగ్రణి
    సరసిజ నేత్రీ భగవతి శరణము వాణీ!!!

    రిప్లయితొలగించండి
  21. వరవీణా మృదుపాణీ!
    కరములు జోడింతు నన్ను కరుణన్ గనుమా!
    పరిపరి మ్రొక్కెద జడుడను...
    స్వరమును తగ్గించి నాకు శాంతిన్నిడుమా!

    రిప్లయితొలగించండి
  22. వరవీణా మృదుపాణీ
    కరములు జోడింతునమ్మ కాసేపటికై
    వరవీణను చాలింపుము
    పరుపున పడుకొచు పోయె పాపడు నిదురన్

    రిప్లయితొలగించండి