2, నవంబర్ 2015, సోమవారం

సమస్య - 1843 (ధనమే మోక్షమును...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధనమే మోక్షము గడించు దారినిఁ జూపున్. 

33 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు
    అలహాబాద్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించారను కుంటాను కాశీ చేరారాండి

    1.

    ఘనమగు కానుక లిచ్చెడు
    జనులనె యా దై వమంట చల్లగ కాపా
    డుననుట సత్యం బైనను
    ధనమే మోక్షము గడించు దారిని జూపున్

    2.
    ఘనముగ యాత్రలు జేయుచు
    కనులారగ విగ్రహాల గాంచిన మోక్ష
    మ్మని తల చువారి కిక యా
    ధనమే మోక్షము గడించు దారిని జూపున్

    3.
    జనులను వంచించుచు చెడు
    పనులను చేయుచు ధనమును బడిసిన వాడే
    మనసున తలచెడి దొకటే
    ధనమే మోక్షము గడించు దారిని జూపున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిమిత్రులకు నమస్కృతులు.
      నిన్న అలహాబాద్ చేరుకున్నాము. త్రివేణీ సంగమంలో స్నానం చేసి, హనుమాన్ దేవాలయం, మాహేశ్వరీ శక్తి పీఠం, నవగ్రహ దేవాలయం దర్శించుకున్నాము. ప్రస్తుతం కాశీకి వెళ్లే బస్సులో ఉన్నాం. మరో గంటలో చేరుకుంటాం.

      తొలగించండి
    2. ఆంజనేయ శర్మ గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. మిత్రులందఱకు నమస్సులు!

    తన వారలు తన యాస్తులు
    తన సంసారమ్ము తనదు ధనమను తలఁపుల్
    మనమును విడిచెడి ఘన "బం

    ధనమే", మోక్షము గడింౘు దారినిఁ ౙూపున్!

    రిప్లయితొలగించండి
  3. అనయము సద్భావనతో
    తనపర భేదములు లేక తగిన రీతిన్
    చనగా ,సౌశీల్యంబను
    ధనమే మోక్షము గడించు దారిని జూపున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తగిన రీతిన్ ' అన్నప్పుడు గణదోషం.' తగిన విధమునన్ ' అనండి.

      తొలగించండి
  4. వినయము జూపుచు జనులకు
    మనమున కుంచితపు బుద్ధి మాయల యందున్
    కనుమాయ జేసి దోచెడి
    ధనమే మోక్షము గడించు దారినిఁ జూపున్

    రిప్లయితొలగించండి
  5. ధనమే జగతికి మూలము
    ధనమే దైన్యమ్ము బాపి ధర్మము బెంచున్
    ధనమే దైవమ్ము గనుక
    ధనమే మోక్షము గడించు దారిని జూపున్!!!

    రిప్లయితొలగించండి
  6. కనుమా చెడుకున్మూ లము
    ధనమే, మోక్షము గడించు దారిని జూపు
    న్ననయము శంభుని ధ్యానము
    విను మఱి యీ నాదు మాట వేంకట రమణా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. సనకసనందాదు లవని
    ఘనహరి భక్తులు బడసిరి కైవల్యమునున్
    కనగ నచంచల భక్తియు
    ధనమే, మోక్షము గడించు దారినిఁ జూపున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. జనులకు మేలొనరించుచు
    వినయమ్మును వీడకెపుడు వేడుక మీర
    న్ననవరతము హరి యారా
    ధనమే మోక్షము గడించు దారిని జూపున్!!!

    రిప్లయితొలగించండి
  9. ఘనమీ మానవ జీవన
    మనఘా! నిష్ఠంగలిగిన యద్భుతమౌ జీ
    వనగతి కలిగించుతపో
    ధనమే మోక్షముగడించు మార్గము జూపున్.
    .

    రిప్లయితొలగించండి
  10. వనజాక్షునిపై ధ్యానమె,
    మననమె, యర్చనము, దాస్యమాలాపనమే,
    యనుగుఁదనమె, శరణను సా
    ధనమే మోక్షము గడించు దారినిఁ జూపున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారూ,
      నవవిధ భక్తులపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. మిత్రులు శంకరయ్య గారు నా సమస్యా పూరణమునుం బరిశీలింపలేదు కాఁబోలును.

    రిప్లయితొలగించండి
  12. మ నమునను నిలిపి సతతము
    సనాతనుండౌ కలుముల జవరాలి పతిన్
    వినయము తోడ హృ దయ శో
    ధనమే మోక్షము గడించు దారిని జూపున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. రిప్లయిలు
    1. అణగారగ కోరికలవె
      యొనగూడిన దైవభక్తి యోగ్యతనీయన్
      ప్రణవమ్ముగూర్చి పరిశో
      ధనమే మోక్షము గడించు దారిని జూపున్

      తొలగించండి
    2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. ధనమెంత నున్న వ్యర్థము
    తన వెంటను రాదు నేల దా విడినపుడున్
    తను పొందిన ఆధ్యాత్మిక
    ధనమే మోక్షము గడించు దారినిఁ జూపున్.

    రిప్లయితొలగించండి
  15. అనవరతము సద్భక్తియు
    మనుగడలో మానవతయు మరువక నెపుడున్
    పనియే పరమాత్మను సా
    ధనమే మోక్షము గడించు-దారియు జూపున్
    2.తనలో దైవము గలడని
    మనసను మందిరము నందు మాధవు డుడుగన్
    అనువుగ భక్తియు గల సా
    ధనమే మోక్షము గడించు దారిని జూపున్

    రిప్లయితొలగించండి
  16. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    తన పర భేదము నెంచక
    మనమున నమృతము జిలుకుచు మాధవు స్మరణం
    బనయము జేసెడి ఘన సా
    ధనమే మోక్షము గడించ దారిని జూపున్

    రిప్లయితొలగించండి
  17. ధనమార్జించిన మోక్షము
    ఘనముగ చేకూరగలదె? కప్పము యముడౌ
    వినుముర సుజనుడ! నల్లని
    ధనమే మోక్షము గడించు దారినిఁ జూపున్!

    రిప్లయితొలగించండి
  18. దినదినము పన్నులనుచును
    ధనమును కాజేయురయ్య దండుగ ప్రభుతే!
    కనుగొన నల్లని రంగుది
    ధనమే మోక్షము గడించు దారినిఁ జూపున్

    రిప్లయితొలగించండి