22, నవంబర్ 2015, ఆదివారం

“గయా యాత్ర” తెలుగు అనువాదం




కాశీయాత్రలో భాగంగా గయాక్షేత్రానికి వెళ్ళాం. అక్కడ విష్ణుపాద దేవాలయం, మంగళగౌరీ మందిరం, కామాఖ్య గుడి, గదాధరుని దేవాలయం తదితర దర్శనీయ స్థలాలను చూసి ఆ నగరంలో ఉన్న ‘గీతా ప్రెస్’ వారి పుస్తకాల దుకాణానికి వెళ్ళాం. అందులో కొన్ని హిందీ, కొన్ని తెలుగు పుస్తకాలు కొన్నాను. ఆ షాపువాడికి నన్ను చూస్తే ఏమనిపించిందో ఏమో “మీరు హిందీలో ఉన్న పుస్తకాన్ని తెలుగులో వ్రాస్తారా?” అని అడిగాడు. నేను వ్రాస్తా నన్నాను. అతడు ‘గయాయాత్ర’ అనే హిందీ పుస్తకాన్ని ఇచ్చి “ఇక్కడికి తెలుగు యాత్రికులు ఎక్కువగా వస్తున్నారు. గయకు సంబంధించిన తెలుగు పుస్తకం కోసం అడుగుతున్నారు. మీరీ పుస్తకాన్ని తెలుగులో అనువదించి, టైప్ చేయించి సి.డి.లో మాకు పంపండి. ఎంత డబ్బు ఇవ్వాలో తెలియజేస్తే మీకు ఆ డబ్బు పంపిస్తాను” అన్నాడు. నేను అది దైవసంకల్పంగా భావించి డబ్బు అక్కరలేదని, చేసి పంపిస్తానని అన్నాను. ఇల్లు చేరాక ముందుగా ఆ పుస్తకాన్ని తెలుగులో అనువదించాను. గయలో వాళ్ళ దగ్గర తెలుగు ఫాంట్స్ లేని కారణంగా ఇక్కడే ఫోటోషాపులో కంపోజ్ చేయించి, దాని సి.డి.ని కొరియర్‌లో గయకు పంపించాను. ఒక పుణ్యకార్యం చేసిన సంతృప్తి మిగిలింది. ఈ అనుభవాన్ని మీతో పంచుకోవాలని బ్లాగులో తెలియజేస్తూ, అందులోని మూడు పుటలను ప్రకటిస్తున్నాను. 

17 కామెంట్‌లు:

  1. గురువులకు ప్రణామములు
    కాశీ యాత్ర , గయా విశిష్టత లను చక్కగా చిత్రీక రించి నందులకు చాలా సంతోషముగా నునంది . ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  2. ప్రణామములు గురువుగారు...గయా యాత్ర చాలా బాగా వివరించారు..నిజంగా దైవసంకల్పమే..మిగతా వివరములు కూడా తెలుసుకోవాలనివుంది...ధన్యవాదములు ..

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గారికి .మీరు ఇచ్చిన గయా యాత్ర రెండు పుటలు వాచవి చూశాక మొత్తం పుస్తకాన్ని ఆస్వాదించాలని ఆత్రుత గా ఉంది.ఎక్కడా అనువాదం లాగ లేదు .అభినందనలు .చక్కటి పరమార్థం తో కూడిన కార్యం చేసే అదృష్టం మీకు లభించింది.సంతోషం. --------------డా.సుమన్ లత

    రిప్లయితొలగించండి
  4. మిత్రులు శంకరయ్యగారు, మీరు చాలా మంచిపని చేసారు. చాలా ఆనందం కలిగింది.

    రిప్లయితొలగించండి
  5. మీకా కార్యభారాన్ని కాశీ విశ్వనాథుడే అందజేసాడనడంలో ఇంచుక సందేహము లేదు. మీకు లభించిన ఈ మన్ననకు నాకు చాలా సంతోషాన్ని కలిగించిందండీ...

    రిప్లయితొలగించండి
  6. అందిననవకాశంబును
    పొందిన| కే.శంకరయ్య పుణ్యాత్ముండే
    వందలమందికి దక్కని
    దందునమీరచనజేర ?నాశీస్సులవే ..

    రిప్లయితొలగించండి
  7. మాష్టారు గారూ, దయచేసి పబ్లిషర్ని సంప్రతించి మొత్తం కాపీ ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందో మాకు ఈ బ్లాగు ద్వారా తెలియజేయండి. మీ మెసేజ్ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లనిపించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రశేఖర్ గారూ,
      ధన్యవాదాలు. మీ మెయిల్ చిరునామా పంపండి. వర్డ్ ఫైలు పంపుతాను.

      తొలగించండి
  8. వాణిసేవలో తరించే వారికి అవకాశాలు అలా కలుగుతూనే ఉంటాయి. మంచి పని చేసారు గురువుగారు.

    రిప్లయితొలగించండి
  9. వాణిసేవలో తరించే వారికి అవకాశాలు అలా కలుగుతూనే ఉంటాయి. మంచి పని చేసారు గురువుగారు.

    రిప్లయితొలగించండి