5, జనవరి 2016, మంగళవారం

పద్యరచన - 1139

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

40 కామెంట్‌లు:

  1. పచ్చడైన నేమి పప్పుచారైనను
    రుచిని పంచు నవియు రోగి కైన
    ఆవిరిపయి నుడుకు ఆరోగ్య దాయిని
    ఇడ్డెనలను పేర ఇలను వెలసె.

    రిప్లయితొలగించండి

  2. ఇడురిక తట్టా పెట్టే చూడూ
    కడుకడు వేగా కాగా జోడీ
    ఇడుయిడు మళ్ళీ జోరూ బేగా
    నడునడు కొందాం హాటూ వేగా

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మాత్రాగణబద్ధమైన మీ గేయం బాగుంది. కాకుంటే కొన్ని వ్యావహారిక పదాలను ప్రయోగించారు.

      తొలగించండి
  3. కూలి నాలి జేసి కూడబెట్టుట కంటె
    మనకు తోచి నట్టి మంచి పనిని
    ఇంటి లోను జేయు నిల్లాలి శ్రమకంటె
    వేడి వేడి యిడ్లి వేగ తినగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘మంచి పనుల|నింటిలోను...’ అనండి.

      తొలగించండి
    2. కూలి నాలి జేసి కూడబెట్టుట కంటె
      మనకు తోచి నట్టి మంచి పనుల
      నింటి లోను జేయు నిల్లాలి శ్రమకంటె
      వేడి వేడి యిడ్లి వేగ తినగ

      తొలగించండి
  4. -సావేజిత !


    చంద మైన ఇడ్లి చట్టున తట్టల
    అండ తోడ వేడి గాడి మీద
    డెంద మైన మోము డేగిస తోడుగ
    అంద జేయు పాక శాస్త్ర శాలి !

    శుభోదయం
    జిలేబి
    (సావేజిత)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ ఆటవెలది బాగుంది. అభినందనలు.
      రెండవ నాల్గవ పాదాలలో యతి తప్పింది. ‘అండతోడ వేడియైన గాడి’... ‘అందజేయు పాకమందు మేటి’ అందామా?

      తొలగించండి
  5. ఆవిరందె యుడుకు నారోగ్యము నొసగు
    యిడ్డెనలనుదినగ హితము కలుగు
    పులుసు తోడ నైన పొడులతో నైనను
    రోజు తినుచు నున్న రుజలు దొలగు.

    రిప్లయితొలగించండి
  6. అమ్ము కొనుట కొరకు హారతి యచ్చట
    వేయు చుండె నిడ్లి వేగముగను
    రమ్ము పోయి తిందమిమ్ముగా వాటిని
    వేడివేడివిపుడు పేరిశాస్ర్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. కష్టేఫలి యనుసూత్రము
    నిష్టంబుగ నమ్మినట్టి నీరజ కెపుడున్
    నష్టంబురాదు జగతిని
    స్పష్టంబిది యేరికైన సఖుడా! వినుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్వేత కౌముదిన్ ముద్దగా సేసినట్లు
      ఇలకు శశి బింబ ములు జారి చేరినట్లు
      సుప్రభాతాన జనులకే శుభము లనుచు
      ఇంపు గాను పలకరించు నిడ్డెనలుయె.

      తొలగించండి
    2. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    3. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండవ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  8. చలన క్రియాధ్యయ నమ్ముల
    నలఘూత్సాహమున నొప్పె నారీ మణియే
    విలసత్శశిప్ర భానన
    సలలిత పరిపాక నిపుణ చందము గనరే

    [చలన క్రియాధ్యయనములు = Motion and Work study, “Production Management” లో ముఖ్యాంశము. పని చేసేటప్పుడు పరికరాలను, వస్తువులనమర్చు విధానము కూడ ముఖ్యము.]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  9. ఇడ్డెనముల తోడ నింపుగ సాంబారు
    తినెడు వారికెల్ల తృప్తినీయ
    నేమి మంత్రమెరిగె? మాతృహృదయముతో
    నుప్పు కారములిడె నొప్పునటుల!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. పనులుచేయక పెనిమిటి పస్తులుంచ
    తనకుటుంబము పోషించు తలపుతోడ
    కన్న బిడ్డల చదివించు కాంక్షతోడ
    ఇడ్డె నలు చేయు చుండె నో యింతి కనుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పద్యంలో ‘మనస్సనందుడికి’...?

      తొలగించండి
  12. ఇడ్లి సాంబారు రుచ్యము నెరుగుమడిగి
    దక్షిణాది జనంబుల, తప్పకుండు
    రోజు తిందురు, రోడుపై మోజుతోడ
    చేయుచుండె నిడ్లీల నీ చెలియ గనుము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  13. ఆడపడుచులకు నీతి:

    పుట్టింట నున్న యెడలం
    దిట్టకుమా మెట్టినిల్లుఁ దృటి మెట్టింటన్
    పుట్టింటిని పొగడకుమా
    దట్టంబుగఁ బోచిరాజతనయా వినుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ నీతి పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. కం:వేడి గ ఇడ్లీవాయకు
    తోడుగ సాంబారు చెట్ని-తోయదములతో
    పోడిమి కారప్పొడియును
    వాడని నవ్వుల నొసగెడు- వనితకు శుభమౌ..

    రిప్లయితొలగించండి
  15. ఇడ్డెనలు నాల్గు వేసద
    గడ్డ పెరుగు కలిపిన రుచికరమగు చట్నీ
    వడ్డన జేసెద తినగను
    బడ్డీకొట్టునకు జేరు వడిగను నరుడా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘వేసెద’కు టైపాటు...

      తొలగించండి
    2. ఇడ్డెనలు నాల్గు వేసెద
      గడ్డ పెరుగు కలిపిన రుచికరమగు చట్నీ
      వడ్డన జేసెద తినగను
      బడ్డీకొట్టునకు జేరు వడిగను నరుడా

      తొలగించండి
  16. అమ్మమనస్సు లానుడికి-ఆకలి-ఆవిరి నగ్నికీలకున్
    కమ్మనియిడ్లిగాగ?మనకమ్మగ నుంచెను –అమ్మకానికై
    సమ్మతి సంబరాన-కనుసన్నల వోలెను నవ్వు రువ్వుచున్
    “నెమ్మది సాకగా బ్రతుకు నేర్పెను భారము గాని బాధ్యతల్”.
    2.ఆకలి దీర్చ నెంచుటకు –ఆవిరియందున యిడ్లి మగ్గగా
    రూకలకంద జేయుచు-విరోదుల కైనను పంచబూనులే
    చాకిరిజేయు జాణ మనజాలగ నెంచియు బీద సాదుకున్
    లోకుల కందజేసి తనలోగల నవ్వునురువ్వు యిడ్లిలా.
    3.జీవన సారమంతటిని చిత్రము నందున జూపునట్లుగా
    భావన నింపుచున్ పడతి భావితరాలకు మార్గదర్శిగా
    “కావగ నిష్ట,పుష్టియను కామిత సిద్ధికిరూపు రేఖలే
    ఆవిరి యిడ్లి-సాంబరులె ఆకలి దీర్చెడి నౌషదంబులే
    4.ఆవిరియందున యిద్లీ
    జివనసారంబు బంచుచిత్రము లందున్
    భావన బాధ్యత లెరిగిన
    పావనిగా వనితనవ్వు పరికించుమిటన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      సవరించిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  17. నడిబజారు నందు నారీమణి యొకతె

    జీవనంబు సేయ పావనముగ

    ఇడ్లి దోసె పూరి ఇష్టమ్ముగాచేసి

    బ్రదుకు చుండె తాను భద్రముగను;

    డాక్టర్ మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూరు వై.యెస్.అర్. జిల్లా 7396564549

    రిప్లయితొలగించండి
  18. హాడ్లీని మించు బౌలరు
    వడ్లకు సరి ధాన్యము మఱి వజ్రపు సరియున్
    యెడ్లకు సమ శ్రమ జీవులు
    నిడ్లీలకు సాటి టిఫిను లిలలో గలవే ?

    రిప్లయితొలగించండి