10, జనవరి 2016, ఆదివారం

పద్యరచన - 1143

కవిమిత్రులారా,
“వారిజాక్షులందు వైవాహికములందు 
ప్రాణవిత్తమానభంగమందు 
చకితగోకులాగ్రజన్మరక్షణమందు 
బొంకవచ్చు నఘము వొంద దధిప!”
పై పద్యభావాన్ని మీకు నచ్చిన మరొక ఛందంలో చెప్పండి.

47 కామెంట్‌లు:

  1. ఆడవారియెదుట, జోడు పెళ్ళికిజూడ
    బ్రతుకు పరువు ధనము బాయ నగుచొ
    ప్రాణభీతిబొందువారి కాచుటయందు
    కల్లలాడ నఘము కలుగదనిరి

    రిప్లయితొలగించండి
  2. సఫలమవ గకొన్ని సౌఖ్యంబు కొఱకని
    రచియించె పెద్దలు రమ్య ముగను
    తరుణుల యందున పరిణయమ్ము లయందు
    ప్రాణహాని కలుగ త్రాణ కొఱకు
    మానభంగము నందు మహిషియై నర్తింప
    విత్తమందు మిగుల యుక్తి తోన
    చకితమగు హృదయమ్ము జన్మను రక్షింప
    బొంకి నంత నఘము బొంద లేరు
    ఆట వెలది .
    శుక్ర నీతి బలికె శుభము గాదటంచు
    మూడు యడుగు లన్న మోస మనుచు
    విష్ణు కోరె నంత వేడ్కతో దీర్చంగ
    దాన వేంద్రు డపుడు ధార వోసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘మూడు+అడుగులు’ అన్నపుడు యడాగమం రాదు. ‘మూడడుగు లటన్న’ అనండి.

      తొలగించండి
    2. సఫలమవ గకొన్ని సౌఖ్యంబు కొఱకని
      రచియించె పెద్దలు రమ్య ముగను
      తరుణుల యందున పరిణయమ్ము లయందు
      ప్రాణహాని కలుగ త్రాణ కొఱకు
      మానభంగము నందు మహిషియై నర్తింప
      విత్తమందు మిగుల యుక్తి తోన
      చకితమగు హృదయమ్ము జన్మను రక్షింప
      బొంకి నంత నఘము బొంద లేరు
      ఆట వెలది .
      శుక్ర నీతి బలికె శుభము గాదటంచు
      మూడ డుగుల టన్నమోస మనుచు
      విష్ణు కోరె నంత వేడ్కతో దీర్చంగ
      దాన వేంద్రు డపుడు ధార వోసె

      తొలగించండి
  3. వారి జాక్షుల యందున ప్రాణవిత్త
    మాన భంగమం దునికను మాననీయ!
    గోకులాగ్రజన్మ రక్షణ కొరకుగాను
    బొంకు పలుకవచ్చునుగద బుధ్ధియుతము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. ఆడువారియందు నావివాహములందు
    ప్రాణ, మాన, ధనము భంగమపుడు
    సజ్జనాళి గోవు సంరక్షణములందు
    పాపమంటబో దబద్ధ మాడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. వారిజ నేత్రలందున వివాహములన్ ధన మానప్రాణముల్
    జారెడు వేళ భూసురుల సత్య విచారుల లోక శ్రేయమున్
    గోరెడు వారలన్ కృపన గోవుల రక్షణ జేయుటందునన్
    నేరముగాదు బొంకు ధరణిన్ నృప మానుము దాన మీయుటన్ !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంద పీతాంబర్ గారూ,
      మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. మానప్రాణ ధనాదుల
    మానిని విషయమ్ము లందు మాంగల్యములన్
    గోనృసు రార్తత్రాణము
    నైన నసత్య వచన మఘ మనరాదు సుమీ
    నా శతక పద్యము:

    సత్యము నిలుపును జనులను
    నిత్యము ధర్మపథమందు నిర్ద్వంద్వముగన్
    గత్యంతర కల్లయిన స
    దా త్యజితము పోచిరాజతనయా వినుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. కామేశ్వరరావు గారూ,
      మీ శతక పద్యంలో `గత్యంతర కల్ల' అనడం దుష్ట సమాసం. `గత్యంతానృత మయిన స ...' అనండి.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణకు ధన్యవాదములు. పొరపాటున సమాసము గమనించ లేదు. “ గత్యంతరంపు కల్ల స” అన్నను సరిపోయేదనుకుంటాను.

      సత్యము నిలుపును జనులను
      నిత్యము ధర్మపథమందు నిర్ద్వంద్వముగన్
      గత్యంతానృతమైన స
      దా త్యజితము పోచిరాజతనయా వినుమా

      తొలగించండి
  7. మగువలందు మరియు మనుగడలందును
    ఆయు రర్థ శీల హరణమందు
    కపిల భూసురేంద్రు కాపాడు తరుణాన
    కల్ల లాడ నఘము కలుగ దండ్రు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      `కపిల భూసురులను' అనండి.

      తొలగించండి
  8. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    వారిజ నేత్ర ల౦దున. వివాహము ల౦దున.నేరి కేనియున్
    గౌరవ భ౦గ మైన. ధన నష్టము కల్గిన.ప్రాణ హాని యౌ
    ఘోర పరిస్థితిన్. మరియు కూరిమి బ్రోవగ నాలమ౦దలన్
    మీరలు బొ౦క వచ్చును సుమీ!యఘ మ౦టదు జ౦క నేటికిన్ ?

    రిప్లయితొలగించండి
  9. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    వారిజ నేత్ర ల౦దున. వివాహము ల౦దున.నేరి కేనియున్
    గౌరవ భ౦గ మైన. ధన నష్టము కల్గిన.ప్రాణ హాని యౌ
    ఘోర పరిస్థితిన్. మరియు కూరిమి బ్రోవగ నాలమ౦దలన్
    మీరలు బొ౦క వచ్చును సుమీ!యఘ మ౦టదు జ౦క నేటికిన్ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి గారూ రెండవ పాదము లో యతి నొకసారి పరిశీలించండి.

      తొలగించండి
    3. కామేశ్వరరావు గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
    4. గురుమూర్తి ఆచారి గారూ,
      'గౌరవ భంగమున్ ధన విఘాతము గల్గిన... ' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    5. గౌరవ నీయులు శ౦కరయ్య గారికి

      పోచి రాజు గారికి ... నమస్సులు

      పై పాదము లోని చివరి అక్షరము
      ద్రుతా౦తముగ నున్నది ( న్ ) ఉన్నది
      కావున నేను " న " కు యతి చేశాను .
      దోసము లేదు అనుకు౦టను

      తొలగించండి
    6. నిజమే సుమా.... నేను గమనించలేదు. మన్నించండి.

      తొలగించండి
    7. గురుమూర్తి ఆచారి గారూ మీరు చెప్పినది సత్యమే. సంశ్లేష గమనించలేదు. చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  10. శుభోదయం ->

    అంగన తోడనూ సరసి మానము విత్తము కాపు కాయుచూ
    జంగము కావు వేళయును చట్టున గోవు లపాయమూ గనీ
    చెంగన ఆపదా పథన చిక్క నసత్యము జెప్పగా గనూ
    అంగర క్షాకరీ యగును ఆత నసత్యము జెప్పినా సుమీ


    జిలేబి
    (సావేజిత!)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ వృత్త రచనా ప్రయత్నం ప్రశంసనీయం.
      మొదటి పాదంలో యతి తప్పింది. నాల్గవ పాదంలో అంగరక్షాకరీ అన్నచోట గణదోషం. తోడనూ, కాయుచూ, అపాయమూ గనీ, ఆపదా, చెప్పగాగనూ అని వ్యావహారికం ప్రయోగించారు. మీ పద్యానికి నా సవరణ.....
      అంగనతోడు తా నరసి యామెకు మానము గాచు నప్పుడున్
      జంగము గాచునట్టిటి యెడ చట్టున గోవు లపాయమున్ గనన్
      చెంగున నాపదల్ పొడమి చిక్క నసత్యము జెప్పగా నగున్
      సాంగము రక్షకారిి యగు నాత డసత్యము జెప్పినన్ సుమీ.

      తొలగించండి
  11. ఇంతులతోడనైన, కుదిరింపగ గోరి వివాహ బంధమే
    చింతలు లేకయున్, ధనము, జీవము, మానము పోవునప్పు,డ
    త్యంత భయమ్ముతో వణకెడావుల విప్రుల గాయువేళలో
    నింతయు తప్పులేదఘము నేమియు బొందవసత్యమాడినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'వణుకు నావుల' అనండి

      తొలగించండి
  12. పద్యరచన మత్తకోకిల
    వారిజాక్షుల ముందు,కార్య,వివాహమెంచగ,దీక్షగా
    కోరివిత్తపు కోర్కెలందున గోకులాగ్రపు రక్షకై
    దారిలేకను ప్రాణబిక్షకు దాగుముప్పును మాన్పగా
    చేరిముందుగ బొంకవచ్చును చేటు రాకను ఓ ప్రభో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు
      'చేటు రాదయ యో ప్రభూ' అనండి.

      తొలగించండి
  13. డా"రాధశ్రీ గారిపూరణ
    మహిళల,బ్రాహ్మణు లనని
    మ్మహిన వివాహ వేళ మానధనములన్
    రహియింపగ ప్రాణమ్మును
    దహియించదు బొంకువిద్య తరచుగ జూడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. రాధశ్రీ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. '... మ్మహిని వివాహంపు వేళ మాన ధనములన్' అనండి.

      తొలగించండి
  14. పంకజాక్షు లందు పాణి బంధములందు
    ప్రాణమానవిత్త త్రాణమునకు
    పగులు హవ్య విప్ర పరిరక్షణమునకై
    కల్ల మాట లాడ కసటు గాదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. పడతులను గూర్చి పలికెడు పలు సమయము
    లందు మాన ధనమ్ములు నంతమగుచు
    నుండ బుద్ధివంతుల నోటి నుండి వచ్చు
    బొంకు వలన యఘము రాదు భువిని నిజము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      వలన నఘము'అనండి.

      తొలగించండి
  16. నీరజాక్షులందు దారకర్మములందు
    సత్త్వ మాన విత్త చౌర్యమందు
    సత్తములను మరియు సౌరభేయిలగావ
    పొందవచ్చు నఘము పొల్లులాడ!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు. 'పొందరాదు' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
    2. నిజమే గురువుగారు...ధన్యవాదములు

      నీరజాక్షులందు దారకర్మములందు
      సత్త్వ మాన విత్త చౌర్యమందు
      సత్తములను మరియు సౌరభేయిలగావ
      పొందరాదు నఘము పొల్లులాడ!!!

      తొలగించండి
  17. అఘము కలుగ నేర దనృతమ్ము పల్కిన
    అబల లందు పరిణయమ్మునందు
    ప్రాణ మాన ధనము భంగ మైన వేళ
    ఆల నగ్ర కులజు నాదుకొనగ

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. తరుణులందు, వివాహతరుణములందు,
    భరణి మానార్థాది ప్రాణ భంగముల,
    వెఱచు గోవులఁగాచ, ద్విజ రక్షణమున
    దురితమంట దు బొంకు దొరలిన నధిప!

    రిప్లయితొలగించండి
  22. పరువున్ రక్షణ జేయుటన్ వడివడిన్ భారీగ నర్ధాంగితో...
    వరకట్నమ్మును గైకొనుంచు మురియన్ వైవాహికాలందునన్...
    మరియున్ జైలుకు పోవకుండ ధనమున్ మానమ్ము ప్రాణమ్మునున్
    సరియౌ రీతిని బ్రోచుకొంచు తఱినిన్ సంత్రాస గోబ్రాహ్మలన్...
    వరమౌ బొంకులు పల్కవచ్చునయరో పాపమ్ము లేదందునన్

    రిప్లయితొలగించండి