11, జనవరి 2016, సోమవారం

పద్యరచన - 1144

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

42 కామెంట్‌లు:

  1. బొంగరములు గిల్లి దండలు
    చెంగున యాడెదరు గాన చిన్నత నానన్
    భంగము వాటిల్లు ముదిమిని
    రంగుల వలయమ్ము నందు రౌలుచు తిరుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు. ఒకటి, మూడవ పాదాలలో గణదోషం. 'చెంగున నాడెదరు' అనండి. మీ పద్యానికి నా సవరణ...
      బొంగరము గిల్లిదండలు
      చెంగున నాడెదరు.....
      భంగము వాటిలు ముదిమిని....

      తొలగించండి
  2. నేలను తిరిగెడు దానిని
    వీలుగ నరజేత బెట్టి వేడుక తోడన్
    మేలుగ నా బొంగరమును
    బాలకుడట దిప్పుచుండె ప్రావీణ్యముగన్!!!

    రిప్లయితొలగించండి
  3. శుభోదయం !

    అరచేయిన బొంగరమును
    అరమోడ్పు కనుల గనుచును అచ్చెరువుగ నా
    తిరుగుట తనచే మహిమగ
    నర యది వినువీధి తనదె నను ధైర్యమయే !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      కొన్ని లోపాలు... నా సవరణ పరిశీలించండి....
      అరచేతను బొంగరమును
      నరమోడుపు కనుల గనుచు నచ్చెరువుగ నా
      తిరుగుట తన చే మహిమ గ...

      తొలగించండి
  4. గిరిగా నున్నది గన గిం
    గిరములు తా దిరుగుచుండె కేలున నా బొం
    గరమే చూడుడు బాలకు
    గరమున్ గిలిగింత లిడగ గలగల నవ్వెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. చిత్రమందునబాలుడు చేతితోడ
    త్రిప్పుచుండెనుబొంగరమొప్పుగాను
    చిత్రమేమననరచేతచిందులాడ
    గిరగిరతిరుగుచుండెనుగరముకనుము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది అభినందనలు.

      తొలగించండి
  6. గిరగిరఁ దిరిగెడు బొంగర
    మరచేతన్నీకు నిచ్చె నానందమురా!
    మెఱసెడు సమర్థతఁ బడయ
    ధరణియె నీ చుట్టు తిరుగు తధ్యమ్మిదిరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. గిరగిరఁ దిరిగెడు బొంగర
    మరచేతన్నీకు నిచ్చె నానందమురా!
    మెఱసెడు సమర్థతఁ బడయ
    ధరణియె నీ చుట్టు తిరుగు తధ్యమ్మిదిరా!

    రిప్లయితొలగించండి
  8. ఆటకైన మరియు నంగడి కైనను
    కంప్యుటరునె వాడు కాలమందు
    బొంగరమును ద్రిప్పు సింగన్నకనగను
    మనసు పరవశించె మమత తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. గ్రుక్కపట్టునటుల చక్కగ కరమున
    బొంగరంబు ద్రిప్పు పుంగవుండు
    వడిగ వచ్చి తనదు తొడనటు కొట్టంగ
    సంతసింతు మిగుల పంతమొప్ప

    రిప్లయితొలగించండి
  10. గ్రుక్కపట్టునటుల చక్కగ కరమున
    బొంగరంబు ద్రిప్పు పుంగవుండు
    వడిగ వచ్చి తనదు తొడనటు కొట్టంగ
    సంతసింతు మిగుల పంతమొప్ప

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
      మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. బొంగర మరచేతినిఁ జ
    క్కంగ నమరి రివ్వున తిరుగంగ మనంబు
    ప్పొంగెఁ గనుడు బాలున కి
    భ్భంగిఁ జిరుముదమె ఘనంబు పసివారలకున్

    22Sep2015 నాటియంశము:
    శైశవంపు క్రీడ లొసగు సంతసంబు
    వర్ష త్రయమున రయమున పాప ననుప
    మూల ధనమిచ్చి బడులకు ముద్దు గూల్చ
    బొంగరపుటాటలు గనము పురము లనిక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      బొంగరము పద్య రచనాంశంగా గతంలో ఇచ్చానేమో అని సందేహించాను కూడా... గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  12. గురుదేవులకు ప్రణామములు. నిన్నటి పద్యరచనను పరిశీలించ ప్రార్ధన

    తరుణులందు, వివాహతరుణములందు,
    భరణి మానార్థాది ప్రాణ భంగముల,
    వెఱచు గోవులఁగాచ, ద్విజ రక్షణమున
    దురితమంట దు బొంకు దొరలిన నధిప!

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. కరముపై ద్రిప్పుచు తన బొంగరమును కడు
    చెంగలించుచు నుండెను చిన్ని బుడుత
    చింత లేలేని బాల్యపు జీవితమ్ము
    యెంత యింపైన దోగద యెంచిచూడ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు. 'జీవితమ్ము+ఎంత' అన్నప్పుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. జీవితమ్ము /
      లెంత యింపైన వోగద యెంచిచూడ అంటే సరిపోంతుందా సర్

      తొలగించండి
  15. * గు రు మూ ర్తి ఆ చా రి *
    .......................................................

    అ ౦ ద రి కి చ క్క ని స ౦ దే శ ము

    ని స్తు న్న బా లు డు
    ...........................................................

    " గిర్రు గిర్రున దిరిగెడు బొ౦గరము వోలె =
    కూలె దీవు తుదకు నేల పైన. >>
    నె౦త మిడిసి పడిన. నెప్పుడో యొకసారి "
    యనుచు తెలుపు చు౦డె నర్భకు౦డు

    రిప్లయితొలగించండి
  16. కాలమె బొంగరమగు మన
    జాలగ జీవితము తిరుగ” జాలియులేకన్
    ఫలితము సూన్యంబగులే|
    తెలిపెను బొంగరపు చేయి తెలివియు లేకన్|
    2.జాలియు మాను జీవితము,జాలియు లేకను బొంగరమ్మెగా|
    జాలియు జేరగా?తిరుగజాలును బొంగర మట్లు చేతిపై
    జాలియు జేయుమేలు జనజాగృతి,బొంగర మెంచు నాటలా|
    ఏలెడి వాడి యాట మనమెంచగ పంచెనుబాలుడిచ్చటన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  17. అరచేత బొంగ రమ్మును
    గిరగిర మనిద్రిప్పినంత కీర్తియె నంచున్
    మురిసిన బాలుని వదనము
    విరిసిన యానంద మదియు విధమును గనుమా

    రిప్లయితొలగించండి
  18. ఆంజనేయ శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. పాతకాలపాట బాలురాడెడియాట
    గిరగిరతిరిగేను నరుగుపైన
    మట్టిలోనగాని మహడిమీదైనను
    చాటి చుట్టి యాడు మేటి వీడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘కాలపు+ఆట=కాలపుటాట’ అని టుగాగమం వస్తుంది. ‘తిరిగేను’ అనడం వ్యావహారికం. ‘తిరిగేను+అరుగుపైన’ అన్నపుడు నుగాగమం రాదు. ‘మహడి’ అన్నది మాండలికం. మీ పద్యానికి నా సవరణ....
      పాతకాలమందు బాలు రాడెడి యాట
      గిరగిరమని తిరుగు నరుగుపైన
      మట్టిలోనగాని మరి మేడమీదను
      చాటి చుట్టి యాడు మేటి వీడు.

      తొలగించండి
  20. బొంగరమునర చేతిలో పూని త్రిప్పు
    బాలకుని యాత్మ విశ్వాస బలము చూడ
    భావి కాలములో నెదిగి ప్రజలనెల్ల
    నేతయై త్రిప్పు తనచుట్టు నిజము నమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. గురుదేవులకు ప్రణామములు. నిన్నటి పద్యరచనను పరిశీలించ ప్రార్ధన

    తరుణులందు, వివాహతరుణములందు,
    భరణి మానార్థాది ప్రాణ భంగముల,
    వెఱచు గోవులఁగాచ, ద్విజ రక్షణమున
    దురితమంట దు బొంకు దొరలిన నధిప!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ ద్విపద బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి