22, జనవరి 2016, శుక్రవారం

సమస్య – 1922 (గడ్డిపూవు విలువ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గడ్డిపూవు విలువ కడుఁ బ్రియమ్ము.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

35 కామెంట్‌లు:

  1. గురువు గారికి కవి కవయిత్రి మిత్రులకు నమస్కారములు

    వన్నె లెన్ని యున్న వాడిపొకున్నను
    కాగితంబు పూల కన్న జూడ
    భ్రమర ములను పిలుచు సుమములై విరిసెడు
    గడ్డిపూల విలువ కడు బ్రియమ్ము.

    రిప్లయితొలగించండి
  2. భృంగ ములకు విందు పుష్కలం బుగనిచ్చు
    సొగసు లీను విరుల చొక్కు కంటె
    తనదు లోక మందు తనరుచు పెరిగెడి
    గడ్డిపూవు విలువ కడుఁ బ్రియమ్ము

    రిప్లయితొలగించండి
  3. శుభోదయం ->

    గనుడు నేటి కాలమున కనిబెట్టి నా
    రు మరి గడ్డి పూవు రుచిగ నుండు
    శుచిగ దాని నూనె శుద్ధ ఔషధముగ
    గడ్డిపూవు విలువ కడుఁ బ్రియమ్ము

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘కనుడు’ అని ప్రారంభించండి. వాక్యప్రారంభంలో సరళాదేశానికి కాని, గసడదవాదేశానికి కాని అవకాశం లేదు. ‘శుద్ధ ఔషధము’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ వృద్ధిసంధి తప్పక జరగాలి కదా! ‘శుద్దౌషధము గాగ’ అనండి.

      తొలగించండి
  4. ఊనికని బట్టి కడుప్రియము లో డు గురువు అవుతుంది కదా! వివరించమని మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారూ,
      అవకాశం లేదు. ‘కడు’ తెలుగుపదం. ప్రియము సంస్కృతం. అక్కడ ఊనికకు తావే లేదు.

      తొలగించండి
  5. పలు రకముల పూల పండుగ బతుకమ్మ
    తెలుగు నాట జరుగు దివ్యముగను
    భక్తి తోడ బేర్చు బతుకమ్మ వేడ్కకు
    గడ్డిపూవు విలువ కడుఁ బ్రియమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. సృష్టి లోన ప్రతిది సింగార మైతోచు
    చూచు దృష్టి తోడఁ జూచినంత
    సుమము లన్నిటందు సొగసుండునని నమ్మ
    గడ్డి పూవు విలువ కడుఁ బ్రియమ్ము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. అమ్మబోగ నవియె నడవిగా "దోచును "
    రైతుకేమి ఫలము చేత బడదు
    కొనగ బోగ నవియె కొరివిగా గనబడె
    గడ్డి, పూవు విలువ కడుఁ బ్రియమ్ము.

    రిప్లయితొలగించండి
  8. చూడబోకు దేని చులకనగానీవు
    ప్రకృతిలోని వన్ని పరమ హితము
    ను కలిగించు నిజము నూనెనొసగు చున్న
    గడ్డి పూవు విలువ కడుఁబ్రియము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నదిక్. అభినందనలు.

      తొలగించండి
  9. దొడ్డి లోన నున్న దొడ్డపూవుల నడ్డు
    జడ్డు లేక గోసి గడ్డి పూలు
    కొండచూలి బిడ్డ నండకై కొలువగ
    గడ్డిపూవు విలువ కడుఁ బ్రియమ్ము.
    (గడ్డిపూవు విలువ దొడ్డ సుమ్ము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. బంతి మొదలు గాగ బరగుపూవు లులభి
    యించు ,దొరకవెచట యీయ లరులు
    అంద చంద ములను నందించు పూవగు
    గడ్డి పూవు విలువ కడుప్రి యమ్ము

    రిప్లయితొలగించండి
  11. పూవు లెన్నొగలవు పూజలొనర్చంగ
    వేల్పు లెందరున్న విఘ్నములకు
    గణపతి యొకడతని ఘనముగా పూజించ
    గడ్డిపూవు విలువ కడు ప్రియమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. సౌరభములు జల్లి చంచరీకములకు
    విందు జేయు చుండు విరులకన్న
    పుడమిని వెలిగింప పొలుపుగావిరబూయు
    గడ్డిపూల విలువ కడు బ్రియమ్ము!!!

    రిప్లయితొలగించండి
  13. పట్టణ పడతు లంత బతుకమ్మ కొరకంచు
    గునుగు పూల నేమొ కొనగ దలచి
    నగరమందు దిరుగ నారికోరినయట్టి
    గడ్డి పూవు విలువ కడు బ్రియమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. ‘పట్టణపు పడతులు...’ అనండి.

      తొలగించండి
  14. మా అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ తన తొలిప్రయత్నంగా గడ్డి పూవు అనే పేరుతో ఒక కవితా సంకలనాన్ని ప్రచురించింది. దాని వెల 20 రూపాయలు. ఒక విమర్శకుడు ఆ ధర ఎక్కువ అని అభిప్రాయపడ్డాడు. ఆ నేపథ్యంలో ఈ సమస్యకు నా పూరణ:

    గడ్డిపూవు యనెడి కవితల పొత్తము
    సరసమైన ధరకు దొరుకుచుండ
    పలుకనగునె యిట్లు పాడియే? ఎక్కడి
    గడ్డిపూవు విలువ కడు బ్రియమ్ము?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొడిహళ్ళి మురళీమోహన్ గారూ,
      పూరణకు మీ నేపథ్యం చక్కగా సరిపోయింది. సమయోచితమైన పూరణ. నిజం చెప్పాలంటే ఈనాటి పూరణలలో మీది ఉత్తమంగా ఉంది. అభినందనలు.
      (ఈ సమస్యను సూచించిన పోచిరాజు వారికి మీ సంకలనం, దాని ధర తెలియదనే నా నమ్మకం).

      తొలగించండి
  15. సమస్య శరణమన్న విఘ్నరాజు శాంతమందజేయగా
    పురములందు పండుగనుచు పువ్వులన్ని ధరలతో
    మెరియుచున్న?భక్తజనులు మిమ్ము గొల్వ కుందురా?
    గరిక,గడ్డిపూవువిలువ కడు బ్రియమ్ముజూడగా|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ ఛందోవైవిధ్యంతో చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  16. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    శ్రీ ఈశ్వరప్ప గారికి ధన్య వాదములు !

    మనోఙ్ఞ మైన పూరణ మ౦ది౦చారు ! !

    రిప్లయితొలగించండి
  17. కఱవు పీడనమున , గాధల వింటమి,
    కాయ గూర లేక గరిక వండి
    యతివ యొసగి దీర్చె నతిధికి క్షుద్బాధ
    గడ్డిపూవు విలువ కడుఁ బ్రియమ్ము.

    రిప్లయితొలగించండి
  18. ఆ.వె. కాగితంపు పూల కలదా సువాసన?
    రంగు లెన్ని యున్న హంగు లున్న
    ప్రకృతి యొసగు పూలె పరిమళించునుగదా!
    గడ్డి పూవు విలువ కడు ప్రియమ్ము.

    రిప్లయితొలగించండి