3, జులై 2012, మంగళవారం

పద్య రచన - 39

వేదవ్యాస గురుదేవులు

గురుపూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు

౧. పండిత నేమాని
    ఏ మహర్షివరేణ్యు డెల్ల వేదమ్ముల
              నంచితమ్ముగ విభజించినాడొ
    ఏ కవిశేఖరుం డెల్ల పురాణాల
              చిత్ప్రభల్ నింపి రచించినాడొ
    ఏ పండితోత్తముం డిల బ్రహ్మసూత్రాల
              తేజమున్ జగతి కందించినాడొ
    ఏ మహాత్ముడు కురు భూమీశ వంశాభి
              వృద్ధికి బీజ మందించినాడొ
    ఆ మహామనీషి వ్యాసు నపరవిష్ణు
    గురు మహాపీఠ భూషణవరు గృపాళు
    దలచి వాక్ప్రసూనాళితో తత్పదముల
    గొలుతు భక్తితో వందనముల నొనర్తు.

*     *     *     *     *     *
౨. సుబ్బారావు
    సంస్కృతంబును జక్కగ సంస్కరించి
    వివిధ కావ్యముల్ విరచించి యవని లోన
    పేరు ప్రఖ్యాతు లొందిన మేరుశిఖర !
    వంద వందనంబులు నీకు వ్యాసమౌని!.
*     *     *     *     *     *
౩. ఏల్చూరి మురళీధరరావు
    శ్రీకళ్యాణపరంపరల్ గురిసి వాసిం గాంచి వర్ధిల్ల నా
    కౌకాశీర్మహితంబుగాఁ గరుణమైఁ గాంతుల్ వెలింగ్రక్కు, మాం
    ధ్రీకైవల్యనిధానమై నిరతసధ్రీచీనమార్గంబు లో
    కైకాదర్శముగా వెలింగెడిని నీ కైకోలునన్ సద్గురూ!

    భారతజాతి తీఱని యభాగ్యపరంపర గ్రమ్ము చీఁకటిన్
    దారి యెఱుంగమిన్ సతమతం బగుచుండఁగ నీ వొకండ వా
    శారమణీయ భావ విలసన్మధురస్మరణక్షణప్రభో
    దారుఁడవై కనంబడితి; వాత్మకృతార్థత కేమి కావలెన్!

    జవము సత్త్వంబు గడివోవు జాతి బ్రదుకు
    పుస్తకపుఁ గ్రొత్త కూర్పుకై పొంచియున్న
    జనుల కే నవ్యవరదానసాధుమతినిఁ
    దపము ధారవోసెదవొ విద్యానిధాన!

    నందనమును గూర్పుము; వి
    న్నందన మార్పు మొక వంద నందనముల ని
    న్నుం దలఁచువారలం గ
    న్నుం దుదలఁ గని దయతోడ నోమ మహాత్మా!

    నీవు మహానుభావుఁడవు నిర్మలధర్మగుణానురాగసం
    భావితపావనాత్ముఁడవు మా భృశదుఃఖదురంతవేదనా
    ప్లావితజీవితంబు నొక ప్రక్కకుఁ ద్రోచెడి తెప్ప నీవె యీ
    వే! వినవే! మమున్ మనుపవే! కనవే! యిఁక దేశికోత్తమా!

    ఒక యధమర్ణజీవితము నుజ్జ్వలమై వెలుఁగొందఁజేసి, నె
    మ్మిక దరిజేరఁదీసి, పరమేశకటాక్షవిభూతి యున్కి న
    మ్మకముగఁ దోఁపఁజేయుటకు మా కమృతస్థితి స్వస్తిమార్గదే
    శికమణివై విభాసిలిన శ్రీ గురుదేవ! పరాశరాత్మజా!

    వేదార్థప్రతిపాదనైకపరమై విఖ్యాతసత్సంప్రదా
    యాదిత్యోదయసానుమచ్ఛిఖరమై యార్తావళీసంతతా
    హ్లాదాపాదకమైన భారతకృతివ్యాహారనిర్మాతవౌ
    నో దైవీపురుషాకృతీ! కొనుమివే యుద్యన్మదీయస్తుతుల్.
*     *     *     *     *     *     *
౪. డా. విష్ణు నందన్
    వ్యాసుడు , కమ్ర కవిత్వ వి
    భాసుడు , శతకోటి సూర్య భాస్వరుడు , శుభా
    వాసుడు , సంతత హరిపద
    దాసుడు ప్రత్యక్షమయ్యె దరహాసముతో.

    కమనీయ సితవర్ణ కబరీ భరమ్ముతో
              ధూర్జటి బోలు నస్తోక సుగుణు ;
    నిగమాగమోక్తి స్వనించు నెమ్మోముతో
              జతురాస్యు బోలు సంసార తరణు ;
    మాయా నికృంతన మహిత తేజముతో హృ
              షీకేశు బోలు వాశిష్ఠ రమణు ;
    జ్ఞాన వీచీయుత మానసార్ణవముతో
              దేవర్షి బోలు నాస్తిక్య హరణు ;
    విష్ణు సేవా ప్రవణు ; భక్తి విధి విహరణు ;
    భాగవత కథాకథన విభ్రాజమాను ;
    తత భవలతా నిశిత లవిత్రాయమాను ;
    బాదరాయణు తాపసాభరణు గొలుతు !!!
    ( త్రిమూర్తులకూ , దేవర్షి యైన నారదునికి - వ్యాసునితో పోలిక గల్పించుట ....
    "కబరీభరమును" పోల్చాలి కాబట్టి - శివుడు 'ధూర్జటి' యైనాడు , 'నెమ్మోము' ను వర్ణించాలి కాబట్టి బ్రహ్మ 'చతురాస్యుడై' నాడు , 'మాయా విచ్చేదకమైన' ఇంద్రియేశ్వరత్వము ఉపమేయము కాబట్టి విష్ణువు 'హృషీకేశు' డైనాడు . 'నారదుడు 'వ్యాసుడు' ఇరువురూ "జ్ఞాన" వీచీయుత మానసులే నని సామ్యము . )

*     *     *     *     *     *     *
౫. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    వేదవ్యాసమునీంద్రసత్తమునకున్, విద్యాసముద్రుండుగా
    వేదంబుల్ విభజించి చూపి క్రమతన్ విశ్వప్రజానీకముల్
    మోదంబంద పురాణసంచయమిలన్ మున్నెవ్వడందించెనో
    ఆ దివ్యాత్ముని కంజలింతు సతమున్ హర్షాతిరేకంబునన్.

    సురుచిరశబ్దసంయుతము, సుందరభావగుణాన్వితంబు, స
    త్వరపురుషార్థసిద్ధిదము, భాగ్యవివర్ధనకారకంబుగా
    కురుచరితంబు కావ్యముగఁ గూరిచినట్టి మహామహుండికన్
    సురసముడైన వ్యాసునకు శుద్ధమనస్కున కంజలించెదన్.

    పంచమవేదమై నిలిచె భారతకావ్యము జ్ఞానసంపదన్
    బెంచెడిదై కవీంద్రులకు విజ్ఞత గూర్చెడిదౌచు నన్నిటన్
    మించినదై వెలింగినది మేటిగ దాని సృజించువాని నే
    నంచితమైన భక్తి తనివారగ వ్యాసుని ప్రస్తుతించెదన్.

*     *     *     *     *     *     *
౬. గుండు మధుసూదన్
    సీ.
    విభజించె నెవ్వాఁడు వేదమ్ములను శ్రుత
              రూప మిళితమౌ విరూప మెఱిఁగి;
    విరచించె నెవ్వాఁడు ధర భారతమ్మును
              జన మనమ్ముల నీతి సరణిఁ దెలిసి;
    లిఖియించె నెవ్వాఁడు లీలఁ బురాణాల
              గురు జన సుగతిఁ జేకూర్చ నెంచి;
    సూత్రించె నెవ్వాఁడు శ్రుత్యంత దర్శనం
              బపునరావృత్తి నేర్పఱుపఁ గోరి;
    గీ.
    యతఁడె వ్యాసమునీంద్రుండు, నతఁడె కృష్ణుఁ,
    డతఁడె సాత్యవతేయుఁడు, నతఁడె గురుఁడు,
    నతఁడె బాదరాయణ ముని, యతఁడె యోగి,
    యతని పాదాబ్ఘములకు నే నంజలింతు!!

18 కామెంట్‌లు:

 1. ఏ మహర్షివరేణ్యు డెల్ల వేదమ్ముల
  నంచితమ్ముగ విభజించినాడొ
  ఏ కవిశేఖరుం డెల్ల పురాణాల
  చిత్ప్రభల్ నింపి రచించినాడొ
  ఏ పండితోత్తముం డిల బ్రహ్మసూత్రాల
  తేజమున్ జగతి కందించినాడొ
  ఏ మహాత్ముడు కురు భూమీశ వంశాభి
  వృద్ధికి బీజ మందించినాడొ
  ఆ మహామనీషి వ్యాసు నపరవిష్ణు
  గురు మహాపీఠ భూషణవరు గృపాళు
  దలచి వాక్ప్రసూనాళితో తత్పదముల
  గొలుతు భక్తితో వందనముల నొనర్తు

  రిప్లయితొలగించండి
 2. పండిత నేమాని వారూ,
  వ్యాస మహర్షి గురించి సర్వం వివరిస్తూ అద్భుతమైన సీసపద్యాన్ని అందించారు. ఇక చెప్పడానికి కవిమిత్రులకు ఏం మిగిలింది అన్న సందేహం కలుగుతున్నది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 3. సంస్కృతం బును జక్కగ సంస్క రించి
  వివిధ కావ్యముల్ విర చించి యవని లోన
  పేరు ప్రఖ్యాతు లొం దిన మేరు శిఖర !
  వంద నంబులు మునివర ! వంద లాది .

  రిప్లయితొలగించండి
 4. శ్రీ గురువందనము
  డా. ఏల్చూరి మురళీధరరావు

  శ్రీకళ్యాణపరంపరల్ గురిసి వాసిం గాంచి వర్ధిల్ల నా
  కౌకాశీర్మహితంబుగాఁ గరుణమైఁ గాంతుల్ వెలింగ్రక్కు, మాం
  ధ్రీకైవల్యనిధానమై నిరతసధ్రీచీనమార్గంబు లో
  కైకాదర్శముగా వెలింగెడిని నీ కైకోలునన్ సద్గురూ!

  భారతజాతి తీఱని యభాగ్యపరంపర గ్రమ్ము చీఁకటిన్
  దారి యెఱుంగమిన్ సతమతం బగుచుండఁగ నీ వొకండ వా
  శారమణీయ భావ విలసన్మధురస్మరణక్షణప్రభో
  దారుఁడవై కనంబడితి; వాత్మకృతార్థత కేమి కావలెన్!

  జవము సత్త్వంబు గడివోవు జాతి బ్రదుకు
  పుస్తకపుఁ గ్రొత్త కూర్పుకై పొంచియున్న
  జనుల కే నవ్యవరదానసాధుమతినిఁ
  దపము ధారవోసెదవొ విద్యానిధాన!

  నందనమును గూర్పుము; వి
  న్నందన మార్పు మొక వంద నందనముల ని
  న్నుం దలఁచువారలం గ
  న్నుం దుదలఁ గని దయతోడ నోమ మహాత్మా!

  నీవు మహానుభావుఁడవు వినిర్మలధర్మగుణానురాగసం
  భావితపావనాత్ముఁడవు మా భృశదుఃఖదురంతవేదనా
  ప్లావితజీవితంబు నొక ప్రక్కకుఁ ద్రోచెడి తెప్ప నీవె యీ
  వే! వినవే! మమున్ మనుపవే! కనవే! యిఁక దేశికోత్తమా!

  ఒక యధమర్ణజీవితము నుజ్జ్వలమై వెలుఁగొందఁజేసి, నె
  మ్మిక దరిజేరఁదీసి, పరమేశకటాక్షవిభూతి యున్కి న
  మ్మకముగఁ దోఁపఁజేయుటకు మా కమృతస్థితి స్వస్తిమార్గదే
  శికమణివై విభాసిలిన శ్రీ గురుదేవ! పరాశరాత్మజా!

  వేదార్థప్రతిపాదనైకపరమై విఖ్యాతసత్సంప్రదా
  యాదిత్యోదయసానుమచ్ఛిఖరమై యార్తావళీసంతతా
  హ్లాదాపాదకమైన భారతకృతివ్యాహారనిర్మాతవౌ
  నో దైవీపురుషాకృతీ! కొనుమివే యుద్యన్మదీయస్తుతుల్.

  రిప్లయితొలగించండి
 5. అయ్యా శ్రీ శంకరయ్య గారూ! నమస్కారములు.
  చూసారా డా. ఏల్చూరి వారు ఇంకా ఎన్నో విషయాలు వ్రాయ వచ్చును అని తెలియజేస్తూ మంచి పద్యములను వ్రాసేరు. మీకు ధన్యవాదములు, శ్రీ ఏల్చూరి వారికి శుభాశీస్సులు. ఇంకా శ్రీ హరివారూ మిగిలిన మిత్రశేఖరులు ఉన్నారు కదా. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. వ్యాసుడు , కమ్ర కవిత్వ వి
  భాసుడు , శతకోటి సూర్య భాస్వరుడు , శుభా
  వాసుడు , సంతత హరిపద
  దాసుడు ప్రత్యక్షమయ్యె దరహాసముతో

  కమనీయ సితవర్ణ కబరీ భరమ్ముతో
  ధూర్జటి బోలు నస్తోక సుగుణు ;
  నిగమాగమోక్తి స్వనించు నెమ్మోముతో
  జతురాస్యు బోలు సంసార తరణు ;
  మాయా నికృంతన మహిత తేజముతో హృ
  షీకేశు బోలు వాశిష్ఠ రమణు ;
  జ్ఞాన వీచీయుత మానసార్ణవముతో
  దేవర్షి బోలు నాస్తిక్య హరణు ;

  విష్ణు సేవా ప్రవణు ; భక్తి విధి విహరణు ;
  భాగవత కథాకథన విభ్రాజమాను ;
  తత భవలతా నిశిత లవిత్రాయమాను ;
  బాదరాయణు తాపసాభరణు గొలుతు !!!

  ( త్రిమూర్తులకూ , దేవర్షి యైన నారదునికి - వ్యాసునితో పోలిక గల్పించుట
  "కబరీభరమును" పోల్చాలి కాబట్టి - శివుడు 'ధూర్జటి ' యైనాడు , 'నెమ్మోము ' ను వర్ణించాలి కాబట్టి బ్రహ్మ 'చతురాస్యుడై ' నాడు , 'మాయా విచ్చేదకమైన ' ఇంద్రియేశ్వరత్వము ఉపమేయము కాబట్టి విష్ణువు 'హృషీకేశు ' డైనాడు . 'నారదుడు ' వ్యాసుడు ' ఇరువురూ ' "జ్ఞాన" వీచీయుత మానసులే నని సామ్యము . )

  రిప్లయితొలగించండి
 7. శ్రీ గురుపూర్ణిమా శుభదినాన శ్రీ సద్గురువులకు సాష్టాంగప్రణామములు. శ్రీ గురువుల అఖండాశీర్వాదకృపావృష్టికి నోచుకొన్నందుకు కృతజ్ఞుణ్ణి.

  శ్రీ శంకరార్యులకు నమస్కారములు. సరస్వతీమూర్తులైన సత్కవివరేణ్యావరేణ్యు లందరికీ సాధువాదపూర్వకప్రణామములు.

  శ్రీ గురువుల నేటి ఆశీస్సులకు పౌనఃపున్యధన్యవాదాలు.

  విద్వాంసు లందరికీ శ్రీ గురుపూర్ణిమా సర్వ శుభాకాంక్షలతో,

  విధేయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 8. శ్రీ గురువుల కవిత మాన్యులు శ్రీ శంకరయ్య గారు అన్నట్లు సర్వాంగీణశోభామయమై సాలంకారమై సరస రూపచిత్రణకౌశలంతో దివ్యంగా ఉన్నది.

  డా. విష్ణు నందన్ గారి పద్యశిల్పం సుభగశ్లేషానుప్రాణితమై ఆర్షకవిత్వశోభతో అమోఘంగా ఉన్నది.

  శ్రీయుతులు సుబ్బారావు గారి పద్యనిర్మితికీ శుభాభినందనలు.
  “కబరీ” - “ధమ్మి”ల్లాది శబ్దాలు వ్యుత్పత్తి రీత్యా కేశవేశానికి (కేశములతో తలను చుట్టుకొని ఉన్నందువల్ల కబరి) అనువర్తించేవే అయినా “కబరీభరాన్ని” స్త్రీమూర్తులకు గాక పురుషవేషానికి కవులెవరైనా వర్ణించారా? అని సందేహం కలిగింది. ఇది దోషోద్ఘాటనకు కాదని; సంశయనిరాసానికి మాత్రమే అని విన్నవించుకొంటున్నాను.

  “నాకు తలంపు లేదు లలనాజనతాకబరీభరైకభూషాకలనన్” అని వేదుల వారి “దీపావళి”. పురుషానువర్తనీయ కల్పన తోడి ప్రయోగరత్నావళిని మిత్రులు ఉదాహరింపగలరని అభ్యర్థన. నేనూ వెతుకుతాను.

  రిప్లయితొలగించండి
 9. వేదవ్యాసమునీంద్రసత్తమునకున్, విద్యాసముద్రుండుగా
  వేదంబుల్ విభజించి చూపి క్రమతన్ విశ్వప్రజానీకముల్
  మోదంబంద పురాణసంచయమిలన్ మున్నెవ్వడందించెనో
  ఆ దివ్యాత్ముని కంజలింతు సతమున్ హర్షాతిరేకంబునన్.

  సురుచిరశబ్దసంయుతము, సుందరభావగుణాన్వితంబు, స
  త్వరపురుషార్థసిద్ధిదము, భాగ్యవివర్ధనకారకంబుగా
  కురుచరితంబు కావ్యముగఁ గూరిచినట్టి మహామహుండికన్
  సురసముడైన వ్యాసునకు శుద్ధమనస్కున కంజలించెదన్.

  పంచమవేదమై నిలిచె భారతకావ్యము జ్ఞానసంపదన్
  బెంచెడిదై కవీంద్రులకు విజ్ఞత గూర్చెడిదౌచు నన్నిటన్
  మించినదై వెలింగినది మేటిగ దాని సృజించువాని నే
  నంచితమైన భక్తి తనివారగ వ్యాసుని ప్రస్తుతించెదన్.

  రిప్లయితొలగించండి
 10. ఆర్యా!
  నమస్కారములు.
  ఈరోజు ముగ్గురు మహోన్నత మూర్తుల(గురువర్యులు శ్రీ నేమానివారు, శ్రీ విష్ణునందన్ గారు, శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారు) అత్యద్భుత కవితామృతాన్ని ఆస్వాదించే అదృష్టం కలిగింది.
  ధన్యవాదాలు.
  వినమ్రతాంజలులు.

  రిప్లయితొలగించండి
 11. గుండు మధుసూదన్ గారి పూరణ.....
  సీ.
  విభజించె నెవ్వాఁడు వేదమ్ములను శ్రుత
  రూప మిళితమౌ విరూప మెఱిఁగి;
  విరచించె నెవ్వాఁడు ధర భారతమ్మును
  జన మనమ్ముల నీతి సరణిఁ దెలిసి;
  లిఖియించె నెవ్వాఁడు లీలఁ బురాణాల
  గురు జన సుగతిఁ జేకూర్చ నెంచి;
  సూత్రించె నెవ్వాఁడు శ్రుత్యంత దర్శనం
  బపునరావృత్తి నేర్పఱుపఁ గోరి;

  గీ.
  యాతఁడే వేద వ్యాసుండు, నతఁడె కృష్ణుఁ,
  డతఁడె సాత్యవతేయుఁడు, నతఁడె గురుఁడు,
  నతఁడె బాదరాయణ ముని, యతఁడె యోగి,
  యతని పాదాబ్ఘముల కేను నంజలింతు!!

  రిప్లయితొలగించండి
 12. గుండు మధుసూదన్ గారూ,
  ఎత్తుగీతి మొదటి పాదంలో ‘వేదవ్యాసుడు’ అన్నప్పుడు గణదోషం. సవరించండి.

  రిప్లయితొలగించండి
 13. మధుసూదన్ గారూ,
  మీరు ఫోన్ ద్వారా తెలియజేసిన విధంగా సవరిస్తాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. ఈనాడు ‘శంకరాభరణం’ బ్లాగులో పద్యరచన శీర్షికలో వాగ్దేవి గజ్జె కట్టి ఆడింది. ఎవరి కవిత్వం ఎలా ఉందో విశ్లేషించగల పదభావసంపద లేనివాణ్ణి!
  శ్రీయుతులు పండిత నేమాని వారు, ఏల్చూరి మురళీధర రావు గారు, డా. విష్ణునందన్ గారు, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారు, గుండు మధుసూదన్ గారలు పంచరత్నాలై కవితాకాంతులను వెదజల్లారు. అందరికీ వినయంతో శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 15. వేదములను విభ జించిన
  వేద వ్యాసుడ వగు నీకు వేవేల నుతుల్ !
  క్రోధము జెందకు నాయెడ
  నీదగు యశమును పొగడగ నేనల్పిని గాదే !

  గాదే ? = [ కదా ] అవును

  రిప్లయితొలగించండి
 16. ఈరోజు సత్కవుల కవితావిజృంభణము మనసునకాహ్లాదము కలిగించినది. గురువులకూ, గురుతుల్యులకు నా వందన సమర్పణ:
  మాతృమూర్తికి పితృపితామహుల కాది
  శంకర సదాశివ వరేణ్య సద్గురులకు
  వ్యాస వాల్మీకి ఋషిముని వర్గమునకు
  అక్షరాభ్యాస మొనరించి యక్షయమగు
  భిక్ష నిడిన యధ్యాపక లక్షణులకు
  నంజలి ఘటింతు నామది ననవరతము!

  రిప్లయితొలగించండి
 17. ఆహా ఎంతటి మహా భాగ్యమండీ!
  గురు స్వరూపుడైన పరమేశ్వరుడు పులకించిపోయుంటాడు.

  రిప్లయితొలగించండి