13, జులై 2012, శుక్రవారం

సమస్యాపూరణం -761 (పెండ్లికాని పిల్ల)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

పెండ్లికాని పిల్ల బిడ్డను గనె.

(కర్ణజనన వృత్తాంతము నిషిద్ధము)

ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. తమ్ము కొడుకు పెండ్లి తానుగా పిలిచెను
    పుత్రి కేమొ వచ్చె పురిటి కిటకు
    మనసు లాగు చుండె మరి నేటి రాత్రియె
    పెండ్లి, కాని పిల్ల బిడ్డను గనె.

    రిప్లయితొలగించండి
  2. తమ్ము కొడుకు పెండ్లి తానుగా పిలిచెను
    పురిటి కిటకు వచ్చె పుత్రి, నాదు
    మనసు లాగు చుండె మరి నేటి రాత్రియె
    పెండ్లి, కాని పిల్ల బిడ్డను గనె.

    రిప్లయితొలగించండి
  3. చిట్టితల్లి, నాకు చిన్న కొమరితయె
    పెండ్లికాని పిల్ల; బిడ్డను గనె
    పెద్ద కూతురిపుడు; పెన్నిధి దొరికిన
    యట్లు సంబరమ్ము లమరె నాకు.

    రిప్లయితొలగించండి
  4. మత్స్య గంధి కన్య మహిత పరాశరు
    నావలోనెజేరి భావమంద
    వ్యాసు జన్మ మొంది భాసిల్లె నారీతి
    పెండ్లి కాని పిల్ల బిడ్డనుగనె

    రిప్లయితొలగించండి
  5. గోలివారు మంచి విరుపుతో కుమ్మారుగా!

    రిప్లయితొలగించండి
  6. అతివ యొకతె భువిని అరువదేండ్లకుగూడ
    పెండ్లి కాని పిల్ల, బిడ్డను గనె
    నరయ చెల్లెలేమొ పరిణయంబాడుచు
    యుక్తవయసులోన యోగ్యయనగ.

    రిప్లయితొలగించండి
  7. కన్న వారి నెదిరి మొన్నటి వరకామె
    పెండ్లికాని పిల్ల;; బిడ్డను గనె
    నేడు వాణినోరు నేమూసెదననుచు
    సారిక కమలు శృతిఁ జక్కజేసి

    రిప్లయితొలగించండి
  8. పెండ్లి కాని పిల్ల బిడ్డను క నె నట
    చూచి రండు మీరు చోద్య మదియ
    యౌవ్వ నంబు క త న యవ్వార మటు లుండు
    తూచి తూచి యడుగు చాచ వలయ

    రిప్లయితొలగించండి
  9. గురువు గారికి, శ్రీ పండిత నేమాని గారికి ధన్యవాదములు,
    పాదాభివందనము జేయుచూ

    వార్త : పసికందును చెత్త కుండీలో పారవేసిరి
    ----
    పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె త్రోవ
    యందు నడచి బోవ, ముందు వెనుక
    జూడ, లేదు పరుల జాడ, వాడకు దెచ్చి
    దెలిపె నా విషయము తెగువ తోడ .

    రిప్లయితొలగించండి
  10. పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె నంచు
    తలచి రచటి వారు తప్పు తప్పు
    ఆమె పరమ సాధ్వి యాదర్శ గృహిణియు
    వారి కాపురంబు బాగు బాగు

    రిప్లయితొలగించండి
  11. పెంద్లి కాని పిల్ల బిడ్డను కనుటెంత
    యేని సహజమే సుమా నవీన
    పద్ధతులవె చూడ పాశ్చాత్య దేశాల
    కాపురములు ప్రేమ గోపురములు

    రిప్లయితొలగించండి
  12. పిండాల బావి గూర్చిన కవిత నొక పుస్తకావిష్కరణ సభలోవిన్నట్టు గుర్తు. పెండ్లి కాని గర్భిణితో కడుపులో పండపు ఆవేదన:

    పిండపుదశలోనెపిండాలబావిలో
    చేరిపోదునేమొచిదిమివేయ
    జాలి జూపు మనగ లాలించ గానెంచి
    పెండ్లి కాని పిల్ల బిడ్డనుగనె

    రిప్లయితొలగించండి
  13. గుండు మధుసూదన్ గారి పూరణ....

    ముని పరాశరుండు మోహియై సత్యవ
    తినటఁ గన్నెతనపు స్థితికిఁ జెడని
    గర్భవతిని జేయఁ గనె వ్యాసు; నక్కటా!
    పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె!!

    రిప్లయితొలగించండి
  14. పెండ్లి యైన గాని ప్రీతి లేకుండిన
    కలసి యిరువు రుండ కలత పడుతు
    మనసు కలసి ముదము మనసైన జంటగ
    పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె !

    రిప్లయితొలగించండి
  15. హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    సమస్య పాదాన్ని సమర్థవంతంగా విరిచి చక్కని అర్థాన్ని సాధించారు. బాగుంది. అభినందనలు.
    కూతురుకు కొడుకు పుట్టినప్పుడు తాత పొందే ఆనందం నాకు అనుభవైక వేద్యమే. ధన్యవాదాలు.
    *
    చంద్రమౌళి గారూ,
    వ్యాసజనన వృత్తాంతాన్ని సమర్థంగా పూరించారు. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    నిజం చెప్పనా? ఐదు నిమిషాలు మీరేం చెప్పదలచుకున్నారో అర్థం కాలేదు. ఆ విషయమె వ్యాఖానించాలనుకున్నాను. తీరా టైపు చేయబోయే ముందు వెలిగింది ‘ట్యూట్‌లైట్’... :-) ఎంతైనా నా ఇప్పటి సినిమా పరిజ్ఞానం అత్యల్పం.
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    పిండాల బావి ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మధుసూదన్ గారూ,
    సత్యవతి ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. మాస్టారూ, నేను కూడా పోస్టు చేసేటప్పుడో వాక్యం వ్రాద్దమనుకొన్నాను. "వాణి" అనే మాట "వాణి గణపతి(హాసన్)" అని. మీరు కాకబోయినా ఎవరోఒకరు పట్టుకొంటారులే చూద్దాం అని వదిలేశాను. మీలాటి పెద్దలు అంత ఆలోచించ దగిననంత మహాత్ములు కారులెండి వారు. తట్టకపోయినా పరవాలేదు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. 'పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె '
    ------------------
    వింత కాదు చూడ వేదకాలము నుండి
    అటుల చేసినారు అప్సరసలు
    పరిణయమ్ము సృష్టి కొరకది యేలనో
    పెండ్లి కాని పిల్ల బిడ్డను గనె .

    రిప్లయితొలగించండి
  18. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి