18, జులై 2012, బుధవారం

పద్య రచన - 54


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

32 కామెంట్‌లు:

  1. ఆకలి గొన్న సింహము రయమ్మున మీదకు దూకినట్టులీ
    భీకరమైన రూపు కనిపించె , వడంకెను కాలు సేతుల
    య్యా ! కడు దైన్యమూనినది - హాయిగ నిద్దుర లేచినంతనే
    వేకువ జాములో నిటుల భీతిలజేయుట న్యాయమా సఖా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత గారూ,
      మంచి పద్యానికి ఆకలి గొన్న నాకు ఉదయాన్నే చమత్కారభరితమైన చక్కని పద్యాన్ని అల్పాహారంగా అందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
      అజ్ఞాతగా పద్యాన్ని పంపినా ఆ శైలిని గమనిస్తే మీరు ఈ బ్లాగుకు చిరపరిచితులే అన్న సందేహం కలుగుతున్నది.

      తొలగించండి
  2. సింగమునాధునాతనపు చేతల నేర్చిన యట్టులన్ కదా
    రంగముపైన జేరి బలు రంగుల జూపుచు నాట్యమాడెనే!
    హంగుల పద్యముల్ బలికి హాయిగ వేడుక జూడరాదొకో!
    మ్రింగగ రాదు మిత్రులను, మ్రింగగ వచ్చిన నూరకుందుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘సింగమునాధునాతనపు’ అన్నచోట సంధి సందెహాస్పదం.

      తొలగించండి
    2. గురువు గారు,
      ధన్యవాదములండి. ఇలా సవరించానండి.
      సింగము నేటి నర్తకుల చెంతన నేర్చిన యట్టులన్ కదా,

      తొలగించండి
  3. గురువు గారు,
    నిన్న నేను విద్యుచ్ఛక్తి సమస్య వల్ల ఇటు రాలేదు. నా వందనములు స్వీకరించండి. నిన్న మీ పుట్టిన రోజని ఇప్పుడే తెలిసింది.మీకు శుభాకాంక్షలు.
    వరమయె నాకిది, నిచ్చట
    గురువర్యులుగ లభియించి గొప్పగ నాతో
    చిరురచనలు జేయించిరి
    మఱువను మేలు గురువర్య! మఱి యీ జన్మన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభిమానానికి సౌహార్దానికి ధన్యవాదాలు.

      తొలగించండి
    2. గౌరవనీయులు శ్రీ శంకరయ్యగారికి నమస్సులు.

      మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. (ఆలస్యంగా తెలుపుతున్నందుకు క్షంతవ్యుడను).

      సత్యనారాయణ పిస్క.

      తొలగించండి
  4. చిత్ర మయ్యది సింహంబు చిత్ర మందు
    కదులు చున్నది చేతన కలిగి నట్లు
    మీ ద కురుకు నేమొ ? భయము నొందు చుండె
    కావ ,రారయ్య! వేగమె కద లి రండు .

    రిప్లయితొలగించండి
  5. శ్రీరాజరాజేశ్వరీ దేవి సేవలో
    వాహనంబవు నీవు వనచరేంద్ర!
    నీ గర్జనంబుతో నిఖిల జంతుచయమ్ము
    నమిత భయమ్మొంది యణగియుండు
    పంచాస్య నామమ్ము పరమేశుతో బాటు
    నీకె చెల్లును కదా నీతిమంత!
    అంగనామణులకు నందాలు వర్ణింతు
    రల సింహమధ్య యంచభినుతించి
    సింహ మనుపేరు మిక్కిలి శ్రేష్ఠము కద
    ఠీవిలో నిన్ను బోలిన జీవి కలదె?
    వెరపు నెరుగని యట్టి జీవితము నీది
    ప్రథిత మృగరాజ పదము సార్థకము నీకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పండిత నేమాని వారూ,
      మృగరాజును గురించిన సమగ్ర పద్యచిత్రాన్ని మాకందిచారు.‘పంచాస్య నామమ్ము పరమేశుతో బాటు
      నీకె చెల్లును కదా’ ఎంత మనోహరమైన భావన! అద్భుతం... అభినందనలు, ధన్యవాదాలు.

      తొలగించండి
  6. ఈ సింహాన్ని చూస్తుంటే అది ఇలా అంటున్నట్లుగా భావన కలుగుతున్నది.

    భూజనులారా! నావలె
    నే జంకును లేక మీర లిమ్మహిలోనన్
    రాజిల్లుడు సద్యశ మ
    వ్యాజానందమును పొంది యనవరతంబున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పద్యం, పద్యంలో మీ భావౌన్నత్యం ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.

      తొలగించండి
  7. అటునిటు కదలుచు భీతిగ
    నెటు దిరిగిన దయను జూప నీకగు మేలౌ !
    నిటలాక్షుని సతి వాహ్యము
    పటుతరముగ కొలు తుమమ్మ పాలించ గదే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      ఈ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    2. మీ పద్యం చాలా బాగుంది రాజేశ్వరిగారూ! అభినందనలు.

      సత్యనారాయణ పిస్క.

      తొలగించండి
    3. ధన్య వాదములు సత్యనారాయణ గారూ ! మరి బాగుం డనిది మరోటి ఉంది అది కుడా చూడండి .

      తొలగించండి
  8. హరిణము కనబడెనేమో!
    హరి కదలుచు నుండె దూక నాకటికేమో!
    హరి! హరి! రక్షణ జేయుము
    భరియించగ లేను నేను ప్రాణుల హింసన్!

    రిప్లయితొలగించండి
  9. హరిణము కనబడెనేమో!
    హరి కదలుచు నుండె దూక నాకటికేమో!
    హరి! హరి! రక్షణ జేయుము
    హరియింపక లేడి యుసురు నచ్యుత! స్వామీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మొదటిదీ, దాని సవరణ రెండూ బాగున్నాయి. అభినందనలు.

      తొలగించండి
    2. శంకరార్యా! ధన్యవాదములు.
      మార్పు చేసిన టెంప్లేట్ చాలా బాగున్నది.

      తొలగించండి
  10. శాస్త్రిగారూ సరదాకి చిన్నమాట ఒకవేళ హరి ఆ హరి బారి నుండి హరిణాన్ని రక్ష చేస్తే పాపం అప్పుడా హరి ఆకలిబాధ తో కృంగి కృశించి నశిస్తుంది అటువంటి ప్రాణిబాధనూ మీరు చూడలేరు మళ్లీ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత గారూ! నమస్కారములు. మీరన్నది నిజమే. కాని హరిణాన్ని రక్షించిన పుణ్యం నాకిచ్చి నాకు కనబడకుండా హరికి ఆకలి తీర్చే యేర్పాటు చేస్తాడు లెండి ఆ హరి.

      తొలగించండి
  11. శరణంబనెద నేను శబ్దార్థములనెల్ల
    సరసమ్ముగను దెల్పు సభను గనుచు
    పండిత వర్యుల పలుకుల వెల్లర
    మనసుల దోచెడు మాయ గనుచు
    కొసరివెట్టుచు కీర్తి, కోరి వచ్చునిచట
    నానందమొసగున, టంచు మురిసి
    శంకరాభరణము శారదా దేవికి
    పీఠంబుగ నలరె, పిలిచె వినుడు

    చక్కనైన భావసంపద గలిగియు,
    భాష కొఱకు పాటు పడెడువారు
    కదలి రండు మిత్ర గణముగ, నెల్లర
    కిచట చోటు గలదనియెద నేను.

    గురువు గారు,
    టెంప్లేట్ బాగుంది. ఒక్కచోట శ్రీ డా.విష్ణునందన్ గారు వ్రాసిన పద్యమును చూసి స్వేచ్ఛాను వాదముగా సీసంలో ఆ భావాన్ని వ్రాసేందుకు ప్రయత్నించాను. నా సాహసానికి మన్నించండి. ఈ వ్యాఖ్య మీరు తొలగించినా నాకు పూర్ణ సమ్మతము.

    రిప్లయితొలగించండి
  12. ఆరవ పాదము సవరణ (పునరుక్తి దోషము గమనించి)
    నానందమును మెండ,టంచు మురిసి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీదేవి గారూ,
      నిజంగానే ఇప్పుడు నాకు శుభోదయం. లేవగానే నాకు సంతోషాన్ని కల్గించే పద్యాన్ని చదువుకున్నాను. ధన్యవాదాలు.
      ‘కదలి రండు మిత్ర గణముగ, నెల్లర కిచట చోటు గలదు’ అనడం చాలా బాగుంది.

      తొలగించండి
    2. గురువు గారు,
      సీసంలో "నా మాట" మీకు సంతోషము కలిగించినందుకు ధన్యురాలనయితిని.

      తొలగించండి
  13. బ్లాగునందు జిత్రపటమున సిం హమ్ము
    'మెట్రొ ' చలన చిత్ర మృగము వోలె
    కదలుచుండ జూడ బెదురు వుట్టుచు నుండ
    నింక వ్రాయబూన నేమి కలదు?

    ద్వి. సిం హ గర్జన కూడ చేరిచి చెన్ను
    మీర గ్రాఫిక్సుతో మీరు మమ్మడుగ
    పద్యరచన యింక పాకాన బడును
    సాంకేతికత తో నసాధ్యమ్మె లేదు.

    రిప్లయితొలగించండి
  14. సత్యనారాయణ గారూ,
    ధన్యవాదాలు.
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నది.
    *
    కమనీయం గారూ,
    ఇంక వ్రాయగ బూన నేమి కలదంచు
    శంకించుచునె కడు సామర్థ్య మొప్ప
    నందమ్ముగా పద్య మందించు మీకు
    నందింతును కమనీయం గారు నుతులు.

    రిప్లయితొలగించండి