12, జులై 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 71

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

71

THAT I should make much of myself
and turn it on all sides, thus casting
coloured shadows on thy radiance
such is thy maya.

Thou settest a barrier in thine own
being and then callest thy severed self
in myriad notes. This thy self-separa-
tion has taken body in me.

The poignant song is echoed through
all the sky in many-coloured tears and
smiles, alarms and hopes ; waves rise up
and sink again, dreams break and form.
In me is thy own defeat of self.

This screen that thou hast raised is
painted with innumerable figures with
the brush of the night and the day.
Behind it thy seat is woven in wondrous
mysteries of curves, casting away all
barren lines of straightness.

The great pageant of thee and me
has overspread the sky. With the
tune of thee and me all the air is
vibrant, and all ages pass with the hiding
and seeking of thee and me. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

స్వయముగా నన్ను నే గొప్ప సల్పుకొందు,
గొప్పతన మది నల్దెసల్ ద్రిప్పుకొందు,
పోతవన్నెల నానీడ నీ తళుకుల
కద్దుకొనుచుందు, నీమాయ యిద్ది స్వామి! ||

నిన్ను విభజించి పలుతీర్ల నిల్పి నీవె
భిన్న భిన్న స్వరమ్ములఁ బిల్చుకొనెదు,
ప్రభువ! యీ నీ వియోగకల్పనము తాను
నీలిమే నయి నాపయి నిల్చునోయి ||

విశ్వగగనము నిండ నీవిరహతీవ్ర
గీతి మార్మ్రోగు నెన్నెన్ని రీతులందొ,
అదియె దుఃఖాశ్రులై, దరహాసము లయి,
భయములై, యాశలై కనుపట్టుచుండు,
తడలుగా రూపుకట్టుచుఁ గరఁగుచుండు,
అరసి చూడ స్వయమ్ముగా నందుకొన్న
నీ యపజయంబు నాలోన నిల్పినావు ||

నాథ! యీ నీ జగన్మయనాట్యశాల
తెరపయిన్ వేనవేల చిత్తరువు లీవు
దించెదవు రేఁబవళ్లను కుంచెతోడ,
వంపుదీరిన యడ్డ దిడ్డంపు చాళ్ల
యతి రహస్యఁపుటల్లిక నద్భుతమయి
చెలఁగు నద్దాని వెన్క నీ సింహపీఠి,
యొక్క రేఖయు సూటిగ నుండ దచట ||

ఉప్పరం బెల్ల నీ, నా, మహోత్సవప్ర
దర్శనమ్ములతోన వ్యాప్తమయిపోయె,
గాలి యిది యెల్ల నీ, నా స్వరాళిదేలి
మ్రోత లీనె వనీకుంజపుంజములను,
కాని దాగురుమూతలలోనె మనకు
యుగయుగమ్ములు కడచనుచుండె నోయి! ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి