15, జులై 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 74

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

74

THE day is no more, the shadow is upon
the earth. It is time that I go to the
stream to fill my pitcher.

The evening air is eager with the sad
music of the water. Ah, it calls me out
into the dusk. In the lonely lane there
is no passer by, the wind is up, the
ripples are rampant in the river.

I know not if I shall come back
home. I know not whom I shall
chance to meet. There at the fording
in the little boat the unknown man
plays upon his lute. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

పగలు దిగజారె, ధారుణిపైకి డిగ్గి
పుంజుకొనె సంజ, కుండ నింపుకొను కొఱకు
నింక నే నేటి రేవున కేగవలయు ||

వానచినుకుల కళవళపాటు పాట
నందుకొని మింట విసరెను సందెగాలి,
కనుమసకలోని కవ్వలి కడలనుండి
యహహ! నన్ బిల్చుచున్నది యా స్వరంబె,
*పోవలయుఁ గుండ నింపఁగ రేవుపైకి ||

ఈ రహోమార్గమందు లేఁ డెవఁడు నేడు,
కడు హడావిడి సేయుచు గాలి యెగసె,
ప్రేమనదిలోని తడలు పింపిళ్లుగూసె,
మఱలి వత్తునొ లేదొ నే డెఱుఁగ నింత,
యెవరితో నాకు, గలయిక యవు టెఱుంగ,
నెవ్వఁడో క్రొత్తవాఁడు తా నీ స్రవంతిఁ
జేరి, రేవునఁ బడియున్న చిన్నినావ
నెక్కి, కూర్చుండి, వీణ వాయించుచుండె
*పోవలయుఁ గుండ నింపుకో రేవుపైకి ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి