25, జులై 2012, బుధవారం

రవీంద్రుని గీతాంజలి - 84

IT is the pang of separation that spreads
throughout the world and gives birth
to shapes innumerable in the infinite sky.
It is this sorrow of separation that
gazes in silence all night from star to
star and becomes lyric among rustling
leaves in rainy darkness of July.

It is this overspreading pain that
deepens into loves and desires, into
sufferings and joys in human homes ;
and this it is that ever melts and flows
in songs through my poet's heart.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

అణువణువులో జగమ్మెల్ల నలముకొన్న
తావకీన వియోగవ్యథాభరంబె
*యడవులై, కొండలై, నింగియై, సముద్ర
మై, వివిధరూపముల నభివ్యక్తమయ్యె;
ఇది విరహబాధ మౌనమై యెల్ల రేయి
సూచు రెప్పవ్రాల్చ కొక్కొక్క చుక్కవైపు,
వాన చీఁకటి వేళ శ్రావణఁపు రేల
నాకు లల్లాడు గలగల లాటలోన
మొరయు నీ విరహవ్యథాభరితగీతి ||

నీ గభీరవియోగార్తి నిఖిలజనుల
విషయవాంఛలై, ప్రేమలై, వేదనలయి,
సుఖములై పలురూపుల చొప్పు దాల్చి
తెప్పతెప్పలై యిల్లిల్లు కప్పివేయు;
ఇదియు విరహార్తియే సుమా యీ మదీయ
కవి హృదంతర మందుండి కరఁగి కరఁగి
పాటలై పొంగి పొరలుచుఁ బరుగు లెత్తు ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి