6, జులై 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 65

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

65

WHAT divine drink wouldst thou have,
my God, from this overflowing cup of
my life ?

My poet, is it thy delight to see thy
creation through my eyes and to stand
at the portals of my ears silently to
listen to thine own eternal harmony ?

Thy world is weaving words in my
mind and thy joy is adding music to
them. Thou givest thyself to me in
love and then feelest thine own entire
sweetness in me. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....


దేవ! నీ వెట్టి యమృతము ద్రావఁ దలఁచి
నింపినావోయి నా జీవితంపుగిన్నె? ||

ఓకవీ! నా కనుంగవనుండి నీదు
సృష్టికళ నీవె కాంచ వాంఛింతువొక్కొ?
నాదు వీనులలోన మౌనముగ నిల్చి
శ్రావ్యభవదీయగీతనిస్వనము నీవె
యాలకింపఁగ వేఁడుక యయ్యెనొక్కొ?

దేవ! భవదీయసృష్టి నా భావమందు
నల్లుచున్నది తీయతీయని పదాల,
స్వరము లమరించి నీదు సంబరము తానె
వానిలో నింపుచున్నది గానరసము,
ప్రేమలో నీవు మగ్నమై స్వామి! నాకు
స్వీయసర్వస్వదానము జేతువొక్కొ?
తావకీనము సర్వసౌందర్య మప్పు
డనుభవించెద వొక్కొ నా మనసునుండి?
దేవ! నీవెట్టి యమృతము ద్రావఁదలఁచి
నింపినావోయి నా జీవితంపు గిన్నె? ||

2 కామెంట్‌లు:

  1. విశ్వవినుత కవీంద్ర! రవీంద్రనాథ!
    అమృతసార ప్రవాహమై యలరుచుండు
    నట్టి గీతాంజలీ కృతి నద్భుతముగ
    వ్రాసితీవు మహోదయా! వందనములు

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    రవీంద్రుని గురించి చాలామంచి పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
    దీనిని మొన్నటి రవీంద్రుని చిత్రంపై ‘పద్యరచన’ శీర్షికలో ప్రకటిస్తాను.

    రిప్లయితొలగించండి