7, జులై 2012, శనివారం

సమస్యాపూరణం - 756 (చిన్న సవరణ కలిగించె)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!

ఈ సమస్యను పంపిన ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

కవిమిత్రుల పూరణలు

౧. గోలి హనుమచ్ఛాస్త్రి
    పద్య మొక్కటి చేర్చితి బ్లాగునందు
    దోసములనట చూచి ప్రయాస లేక
    శంకరార్యులు చేసిన సరస మైన
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!
*     *     *     *     *     *
౨. పండిత నేమాని
(1)
    రాయలు వచింప గగన ధునీ యటంచు
    పద్యమును విని సవరించె భావమెసగ
    నచట నాక ధునీ యంచు నా తెనాలి
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ
(2)
    అద్య ధారా నిరాధార యనియు పిదప
    అజ్య ధారా సదాధార యంచు మార్చ
    భోజు డలరారె వాణియు మోదమొందె
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ
*     *     *     *     *     *
౩. మన తెలుగు
(1)

    మట్టి ముద్దను మంచి బొమ్మలుగమలచు
    వాడె ఘనుడు శంకర గురువర్యులౌర
    “చిన్న సవరణ తెచ్చెను వన్నె లెన్నొ”
    అన్నమాటకు చేసిరి చిన్న మార్పు
    అదియె నేటి పూరణ పాదమయ్యెనిటుల
    “చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ”
(2)


    మా కాలేజీ రోజుల్లో శ్రీదేవి ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నదని పుకారుండేది:
    చిత్రసీమ వార్తలతి విచిత్రమేమొ
    నక్కఁ దొక్కిన శ్రీదేవి ముక్కుఁ బట్టి
    చిదిమి ప్లాస్టికు సర్జను చేసినట్టి
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!

(3)
    “స్వల్పకార్యమిదం శేషం” అనే శ్రీ రామాయణ వాక్య(సుందరకాండలోనిది) స్ఫూర్తితో:
    అమ్మఁగనుగొని తిమ్మడు నెమ్మిగ నటు
    పోక మదినెంచె నొకపని పూర్తి జేయ
    గ్రక్కున వనవిధ్వంసము గరిపెద నను
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!

*     *     *     *     *    *
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    శ్రద్ధ బూనుచు విద్యార్థి సంరచించు
    చిత్రమును జూచి కుంచెను చేతబూని
    గురువు రంగును సరిచేసె నరయ నతని
    చిన్న సవరణ కలిగించె వన్నెలెన్నొ.

*     *     *     *     *     *
౫. ఊకదంపుడు
    అలక లెట్టులో విడివడి యబ్జనయన
    నెన్నుదురుఁ నాసికాగ్రముఁ గన్నునొకటిఁ
    గప్ప, మలయమారుతవీచి కని సలిపిన
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ.
*     *     *     *     *     *
౬. సుబ్బారావు
    శంకరా భరణమునకు జటిలమైన
    పద్య మొక్కటి పంపగ పదము మార్చి
    శంకరార్యులు బద్దెము సరియు జేయ
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ.

*     *     *     *     *     *
౭. గుండా సహదేవుడు
    రంగు రంగుల మాధ్యమ హంగుఁ బెంచ
    కక్ష్య జేరి యుపగ్రహ లక్ష్య మంద
    దివికి భువికి సంధానపు తీగ తొలగ
    చిన్న సవరణ కలిగించె వెన్నె లెన్నొ!

*     *     *     *     *     *
౮. మిస్సన్న
    కస్తురి తిలకమ్ము కమ్రముగా దిద్దె
              గోపిక యొకరిత గోముగాను
    పట్టుదట్టిని కట్టె పడతి యొకర్తుక
              బంగరు మొలనూలు భామ కట్టె
    సందెట తాయెత్తు, సరిమువ్వ గజ్జెలు
              తల్లి యశోదమ్మ తాను బెట్టె
    ముద్దులొలుకు బాలమోహన కృష్ణుని
              ముద్దులాడగ వారు, ముగ్ధ రాధ
    నెమిలి యీకను గొనితెచ్చె నెమ్మితోడ
    గుచ్చె చక్కగా దానిని కురుల నడుమ
    ద్విగుణ మాయెను కన్నయ్య సొగసు లంత
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!

*     *     *     *     *     *
౧౦. లక్ష్మీదేవి
    ధర్మపత్నిని మితిమీఱి దాను వలచు
    తులసిదాసును మార్చిన దొక్కమాట.
    మోహము నశించె; నాతఁడు ముక్తిఁ బొందె.
    చిన్న సవరణ కలిగించె వన్నెలెన్నొ.

28 కామెంట్‌లు:

  1. పద్య మొక్కటి చేర్చితి బ్లాగునందు
    దోసములనట చూచి ప్రయాస లేక
    శంకరార్యులు చేసిన సరస మైన
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!

    రిప్లయితొలగించండి
  2. రాయలు వచింప గగన ధునీ యటంచు
    పద్యమును విని సవరించె భావమెసగ
    నచట నాక ధునీ యంచు నా తెనాలి
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ

    రిప్లయితొలగించండి
  3. మాస్టారూ, ధన్యోస్మి.
    మట్టి ముద్దను మంచి బొమ్మలుగమలచు
    వాడె ఘనుడు శంకర గురువర్యులౌర
    “చిన్న సవరణ తెచ్చెను వన్నె లెన్నొ”
    అన్నమాటకు చేసిరి చిన్న మార్పు
    అదియె నేటి పూరణ పాదమయ్యెనిటుల
    “చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ”

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘మాకొలది జానపదులకు
    నీ కవనపు ఠీవి యబ్బునే...’ చాటువును ప్రస్తావించిన మీ పూరణానైపుణ్యం మాకు అబ్బుతుందా? ప్రశస్తమైన పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    అది నేను కావాలని చేసిన మార్పు కాదు. నిన్న మీరు పంపిన మెయిల్ దొరకలేదు. ‘చిన్న సవరణ... వన్నెలెన్నొ’ మాత్రం గుర్తున్నాయి. తీరా పోస్ట్ ప్రకటించాక మీ మెయిల్ కనబడింది. మార్చాలంటే కాలాతీతం అయింది. అప్పటికే నలుగురు మిత్రులు ఆ సమస్యను చూచినట్లు గణాంకాల వల్ల తెలిసింది. వాస్తవానికి ‘తెచ్చెను’ అంటేనే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  5. శ్రద్ధ బూనుచు విద్యార్థి సంరచించు
    చిత్రమును జూచి కుంచెను చేతబూని
    గురువు రంగును సరిచేసె నరయ నతని
    చిన్న సవరణ కలిగించె వన్నెలెన్నొ.

    రిప్లయితొలగించండి
  6. అజ్య ధారా నిరాధార యనియు పిదప
    అజ్య ధారా సదాధార యంచు మార్చ
    భోజు డలరారె వాణియు మోదమొందె
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ

    రిప్లయితొలగించండి
  7. సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ కవితాచిత్రము చాలా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమని వారూ,
    ఆ కథను వివరిస్తూ వ్రాస్తే మన బ్లాగులో ‘చమత్కారపద్యాలు’ శీర్శికలో ప్రకటింపవచ్చు కదా!
    మంచి కథను ప్రస్తావిస్తూ చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అద్య ధారా నిరాధారా నిరాలంబా సరస్వతీ
    పండితాః ఖండితాశ్చైవ భోజ రాజే దివంగతే !


    అద్య ధారా సదాధారా సదాలంబా సరస్వతీ
    పండితాః మండితాశ్చైవ భోజ రాజే భువంగతే !




    పండిత నేమాని గారూ , అజ్య ను అద్య గా మార్చండి , ' ఇప్పుడు ' అనే అర్థం లో !

    రిప్లయితొలగించండి
  9. అలకలెట్టులోవిడివడి యబ్జనయన
    నెన్నుదురుఁ నాసికాగ్రముఁ గన్నునొకటిఁ
    గప్ప, మలయమారుతవీచి కని సలిపిన
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ.

    రిప్లయితొలగించండి
  10. శంకరా భ ర ణ మునకు జటి ల మైన
    పద్య మొక్కటి పంపగ పదము మార్చి
    శంక రార్యులు బ ద్దె ము సరియు జేయ
    చిన్న సవరణ కలిగిం చె వన్నె లె న్నొ .

    రిప్లయితొలగించండి
  11. మా కాలేజీ రోజుల్లో శ్రీదేవి ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నదని పుకారుండేది:
    చిత్రసీమ వార్తలతి విచిత్రమేమొ
    నక్కఁ దొక్కిన శ్రీదేవి ముక్కుఁ బట్టి
    చిదిమి ప్లాస్టికు సర్జను చేసినట్టి
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!

    రిప్లయితొలగించండి
  12. డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు. ఆ శ్లోకానికి సంబంధించిన కథను రేపు బ్లాగులో ప్రకటించనున్నాను.

    రిప్లయితొలగించండి
  13. గుండా సహదేవుడు గారి పూరణ....

    రంగు రంగుల మాధ్యమ హంగుఁ బెంచ
    కక్ష్య జేరి యుపగ్రహ లక్ష్య మంద
    దివికి భువికి సంధానపు తీగ తొలగ
    చిన్న సవరణ కలిగించె వెన్నె లెన్నొ!

    రిప్లయితొలగించండి
  14. ఊకదంపుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    కానీ నాకు తెలిసినంత వరకు అది నిజమే, పుకారు కాదు!
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. అందమైన పూరణలు అలరారుతున్నాయి.

    చిన్న సవరణ కోసమై చిన్ని యూహ:

    కస్తురి తిలకమ్ము కమ్రముగా దిద్దె
    ................గోపిక యొకరిత గోముగాను
    పట్టుదట్టిని కట్టె పడతి యొకర్తుక
    ................బంగరు మొలనూలు భామ కట్టె
    సందెట తాయెత్తు, సరిమువ్వ గజ్జెలు
    ................తల్లి యశోదమ్మ తాను బెట్టె
    ముద్దులొలుకు బాలమోహన కృష్ణుని
    ................ముద్దులాడగ వారు, ముగ్ధ రాధ

    నెమిలి యీకను గొనితెచ్చె నెమ్మితోడ
    గుచ్చె చక్కగా దానిని కురుల నడుమ
    ద్విగుణ మాయెను కన్నయ్య సొగసు లంత
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ,
    చిన్న సవరణపై పెద్ద పద్యం వ్రాసారు. అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ శంకరయ్య గారూ & డా. విష్ణు నందన్ గారూ! శుభాభినందనలు.
    మనస్సులో అద్య అనే ఉంది గాని ఏమిటో టైపు అలా చేసాను. ఆజ్ అనే హిందీ పదము ఒకటి ఉంది కదా దాని వలన కొంత మతిమరపు. సవరణకు ధన్యవాదాలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. ధర్మపత్నిని మితిమీఱి దాను వలచు
    తులసిదాసును మార్చినదొక్కమాట.
    మోహము నశించె; నాతఁడు ముక్తిఁ బొందె.
    చిన్న సవరణ కలిగించె వన్నెలెన్నొ.

    రిప్లయితొలగించండి
  19. “స్వల్పకార్యమిదం శేషం” అనే శ్రీ రామాయణ వాక్య(సుందరకాండలోనిది) స్ఫూర్తితో:
    అమ్మఁగనుగొ ని తిమ్మడు నెమ్మిగనటు
    పోక మదినెంచె నొకపని పూర్తి జేయ
    గ్రక్కున వనవిధ్వంసము గరిపెదనను
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!

    రిప్లయితొలగించండి
  20. కవిమిత్రుల పూరణలు చాలా వైవిధ్యంగా అందంగా అమిరినవి. ఈ సమస్య మీద పీ.వీ.నరసింహారావుగారు చేసిన చిన్నిచిన్ని ఆర్ధిక సవరణలు, సైన్సు రంగంలో చిన్న సవరణలతో సాధించిన విజయాలెన్నో గుర్తుకొస్తున్నాయి.
    లక్ష్మీదేవిగారూ, నేను తులసీదాను వృత్తాంతం మీద వేద్దామనుకొన్న పూరణ మీరు పూర్తి చేశారు. ధన్యవాదాలు. ఇక చింతామణి మీద ఎవరైనాగాని వేస్తారేమో చూద్దాం.
    సహదేవుడుగారూ,మీకు అంతరిక్ష పరిశోధనా కేంద్రంతో అనుబంధమా? చక్కటి మాట పద్య రూపంలో.

    రిప్లయితొలగించండి
  21. పద్య రచనను నేర్పుట తధ్య మనుచు
    హృద్యముగ నుండు కొఱకని యధ్బుతముగ
    విద్య మేలిమి పండిత విద్యా చణుడు
    చిన్ని సవరణ కలిగించె వన్నె లెన్నొ !

    రిప్లయితొలగించండి
  22. నమస్కారములు . సవరించిన నిన్నటి పద్యం

    మూడు లోకము లేలుచు ముక్తి నిడగ
    కాచి రక్షించు భవుడన కరుణ తోను
    కాల మందున దిరిగెడు కాల యముని
    పట్టు నాజాను బాహువే ప్రభువు మాకు !

    రిప్లయితొలగించండి
  23. లక్ష్మీదేవి గారూ,
    తులసీదాసును ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ మూడవ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణలో భావం మంచిదే. కాని మొదటిపాదంలో ప్రాసయతి, రెండవ పాదంలో యతి, మూడవ పాదంలో గణదోషం సవరించవలసి ఉంది.

    రిప్లయితొలగించండి
  24. కవి మిత్రులు చంద్రశేఖర్ గారికి,
    ధన్యావాదములు.
    అలాంటి అనుబంధమేమి లేదు,
    భూనభోంతరాల్లో మనం స్పృశించలేనిదుంటుందా?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రులందఱకు నమస్సులు!

    (నేనీ పూరణమును దివి: 07-07-2012 నాఁడే యొనర్చితిని. కాని, యెందువలననో ప్రకటింపలేదు. దాని నిప్పుడు ప్రకటించుచుంటిని)

    ["చంద్రహాసుని కథ"నిట ననుసంధానించుకొనునది]

    చంద్రహాసునిం దుర్బుద్ధి చంపనెంచి,
    "విషము ని"మ్మనె లేఖలో; "విషయ ని"మ్మ
    నియును మార్చెను విషయయే రయముగాను!
    చిన్న సవరణ కలిగించె వన్నె లెన్నొ!!

    రిప్లయితొలగించండి