23, జులై 2012, సోమవారం

రవీంద్రుని గీతాంజలి - 82

TIME is endless in thy hands, my lord.
There is none to count thy minutes.

Days and nights pass and ages bloom
and fade like flowers. Thou knowest
how to wait.

Thy centuries follow each other
perfecting a small wild flower.

We have no time to lose, and having
no time we must scramble for our
chances. We are too poor to be late.

And thus it is that time goes by
while I give it to every querulous man
who claims it, and thine altar is empty
of all offerings to the last.

At the end of the day I hasten in
fear lest thy gate be shut ; but I find
that yet there is time.

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....


కరతలము నీ కనంతమౌ కాల మధిప!
నిముసముల్ సేసి దాని గణించు నెవఁడు?
వచ్చుచుం బోవుచుండుఁ బవళ్లు రేలు
పువ్వులట్లు యుగాలు విప్పుచును రాలు,
*ఎదురుచూ పన నేమిటో యెఱుఁగు దీవె,
తడయ వెపుడేని తొందరపడ వొకింత,
ఒక యడవిపువ్వు సంపూర్ణవికసితంబు
సలుపు పనిలోనె బహుశతాబ్దులుగ నైనఁ
గడపివేయఁగఁ జాలెదు కాల మీవు ||

రిత్తపుచ్చగ క్షణమేని లేదు మాకు,
పనుల యొత్తిడి గజిబిజిపాటులోనఁ
గాలమే లేదు మాకడఁ జాలినంత,
యొక రవంత విలంబము నోర్వలేము ||


ఉన్న నా కొద్ది సమయమో యొక్కరీతి
“నాది, నాది” యఁటంచు పెన్‌వాదులాడు
పరుల పోరాటపడలేక భాగములుగఁ
బంచి యిచ్చుటలోనె గతించిపోవుఁ,
గాన్క యొకటియు నీ పూజగద్దెపైన
నుంచఁ బడ కది వట్టిగ నుండుఁ దుదకు ||

పగలు ముగిసెడు ననఁగనే భయము గ్రమ్ము,
“మూయఁ బడదు గదా భవదీయదివ్య
మందిరద్వార” మని మదిఁ గుందుచుందు,
పరుగు పరుగున నీదరి కరుగుఁదెంతుఁ,
గాని యచ్చోట నెప్పుడు గాంచనైన
సమయముండు నీ పూజకుఁ జాలినంత ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి