8, జులై 2012, ఆదివారం

సమస్యాపూరణం -757 (వంట జేయ లేని వాడు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

వంట జేయలేనివాఁడు మగఁడ.

ఈ సమస్యను సూచించిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

(అయ్యా, వసంత కిశోరా! ఏమయ్యారు?)

కవిమిత్రుల పూరణలు

౧. సుబ్బారావు
    నెలతి యుండ డెచట పలుమారు వెతకిన
    వంట చేయలేని, వాడు మగడ?
    కట్టు కొనిన భార్య కడగండ్లు దీర్చని
    నలుడు చేయు వంట సులువు గాను.
*     *     *     *     *
౨. పండిత నేమాని
    పాకశాసను డధిపతి సభను వలల
    నల ముఖాది సభ్యు లలరుచుండె
    చర్చ చేయబోవు సంగతి యేమన
    వంట జేయ లేని వాడు మగడ?
*     *     *     *     *
౩. సంపత్ కుమార్ శాస్త్రి
    కోట్లకొలది జనుల క్షుద్భాధ నరికట్టు,
    బడుగు ప్రజకు దానమిడనివాడు,
    జాణ, సతిని గాంచి సరసమాడనివాడు
    వంటజేయ, లేనివాడు, మగడ?
*     *     *     *     *
౪. కంది శంకరయ్య
    పుట్టినింటి కేఁగెఁ బొలఁతి, మూన్నాళ్ళయ్యె
    వంట జేయలేనివాఁడు మగఁ, డ
    తండు తిండిలేక తల్లడిల్లునొ యేమొ
    యనుచు వేగిరమున నరుగుదెంచె.
*     *     *     *     *
౫. సహదేవుడు
    కట్టుకున్న సతికి కన్నవారల కెల్ల
    కూడు,గుడ్డ,గూడు గూర్చు మగడు!
    బాధ్యతలను మఱువ పనులేవి చేతగా
    వంట! చేయలేని వాడు మగడ?
*     *     *     *     *
౬. గుండు మధుసూదన్
    (ఇంద్రునితో మన్మథుడు పలికిన మాటలు)
    చివురు లెత్తఁ బ్రేమ శివపార్వతులలోన
    నాటఁగానుఁ జేయు నాదు బాణ
    మిదియ పూవుటమ్ము నిది వేసి యా తను
    వంటఁ జేయలేనివాఁడు మగఁడె?

*     *     *     *     *
౭. మిస్సన్న
(1)

    విందు వేళ మించె నందరు వచ్చిరి
    వంట జేయలేనివాఁడు, మగఁడ !
    వంట పనికి వచ్చె, వంటింటికిం బోయి
    చేయి వేసి పూర్తి జేయి వంట.

(2)
    సాఫ్టు వేరు జాబు చక్కని రూపమ్ము
    ఆస్తి పాస్తులెన్న జాస్తి తల్లి !
    వంట జేయలేనివాఁడు మగఁడ వద్ద
    నంగ బెండ్లి జేయ నాకు వశమె
(3)
    మగని తోడ కలసి మనసైన సినిమాను
    చూచి వచ్చుచుండ వేచి కాచి
    వెర్రి చేష్టలూను వెకిలిని తన్ని నొ-
    వ్వంట జేయలేనివాఁడు, మగఁడ ?

(4)
    నిండుకున్న వింట తండులమ్ములు నయ్యొ
    వంట జేయ, లేని వాడు మగడ-
    శక్తు డాయె, కనుము సాధ్వి యా యిల్లాలు
    పనికి నేగె నామె దినము గడుప.
(5)
    వంట జేసి నీకు వడ్డించినాను లే!
    వెనుకటింటిలోని వెంగళప్ప
    వంట జేయ లేనివా డుమ! గడప దా-
    టెరుగ దతని భార్య కేమి సుఖమొ?

*     *     *     *     *
౮. చంద్రమౌళి
    భార్య సుతుల మిత్ర బంధుల నితరుల
    యుప్పు తీపు పులుపు రుచులు సమమై
    వండి శాంతి యనెడి వైశిష్ట్య భక్ష్యాల
    వంట జేయ లేని వాడు మగడ?
*     *     *     *     *
౯. గోలి హనుమచ్ఛాస్త్రి
    కార్య భార మనుచు భార్య మాట వినక
    శెలవు నాడు బాసు పిలువ వెడలె
    భక్ష్య భోజ్య ములను బహు బహు విధముల
    వంటజేయ - లేనివాడు మగడ?

*     *     *     *     *
౧౦. డా. విష్ణు నందన్
    పోయివత్తు నేను పుట్టింటికిక కళా
    శాల జదివెడి తమ శ్యాలకుడిట
    నుండు జూడుమతని తిండి తిప్పలు-వాడు
    వంట జేయలేనివాడు ! మగడ !

*     *     *     *     *
౧౧. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    క్రొత్తవంటవాని గూర్చి యిట్లనె భార్య
    పనికి రాడు వీడు పరమశుంఠ,
    తరగలేడు కూర, తాలింపులా రావు,
    వంటఁ జేయలేనివాడు మగడ!
*     *     *     *     *
౧౨. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
(1)
    అధునాతన ‘సాఫ్టువేరిణి’ గోడు:
    బట్టలుతక డంట్లు నెట్టనతోమడు
    కాఫిచాయ ‘జూసు’ కలప లేడు
    ‘బ్రెడ్డు జాము సాండు విచ్చి’ చేయఁగలేడు
    వంట జేయలేనివాఁడు మగఁడ?
(2)
    నాయనమ్మ తాతఁ దూయబట్టగ విన
    రండు! మాసమంత వండి పెట్ట
    ముష్టి మూడు నాళ్ళు ముచ్చటపడి యింట
    వంట జేయలేనివాఁడు మగఁడ?
*     *     *     *     *
౧౩. రాజేశ్వరి నేదునూరి
    అలసి వచ్చి యుంటి నాలస్యముగ నేను
    లేశ మాత్ర మైన లేక రుషయు
    కొలువు జేయకున్న కోపించ లేదన
    వంట జేయ లేని వాడు మగడ !

*     *     *     *     *
౧౪. ఊకదంపుడు
    ఊహకలుగనైన, నుర్వి, స్వప్నములోన
    గాని కట్టెదుటనుగాని తెలుప
    ప్రియసతికిని దోప పెదవిపైనిచిరున
    వ్వంట జేయలేనివాఁడు మగఁడ?
*     *     *     *     *
౧౫. కమనీయం
    కలిగె మార్పులెన్నొ కాలప్రభావాన
    ఇంట సతికి సాయమీయవలెను
    స్త్రీ పురుషుల విధులు తిరకాసులయ్యెను
    వంట జేయలేని వాడు మగడ
*     *     *     *     *
౧౬. గన్నవరపు నరసింహ మూర్తి
    కల్ల బొల్లె లాఁడి యల్లుఁడయ్యెను నాఁడు
    వంట జేయ లేని వాఁడు ! మగఁడ !
    కూతు రింట గడిపి కూడు గఱప రాదె
    అల్లుఁడునకు, కావు మాడు బిడ్డ !
 

37 కామెంట్‌లు:

  1. నె ల తి యుండ డెచట పలు మారు వెతకిన
    వంట చేయ లేని, వాడు మగ డ ?
    కట్టు కొనిన భార్య కడ గండ్లు దీ ర్చని
    నలుడు చేయు వంట సులువు గాను

    రిప్లయితొలగించండి
  2. పాకశాసను డధిపతి సభను వలల
    నల ముఖాది సభ్యు లలరుచుండె
    చర్చ చేయబోవు సంగతి యేమన
    వంట జేయ లేని వాడు మగడ?

    రిప్లయితొలగించండి
  3. క్రమాలంకార పూరణము :

    కోట్లకొలది జనుల క్షుద్భాధ నరికట్టు,
    బడుగు ప్రజకు దానమిడనివాడు,
    జాణ, సతిని గాంచి సరసమాడనివాడు
    వంటజేయ, లేనివాడు, మగడ?

    రిప్లయితొలగించండి
  4. అధునాతన ‘సాఫ్టువేరిణి’ గోడు:
    బట్ట లుతక డంట్లు నెట్టనతోమడు
    కాఫిచాయ ‘జూసు’ కలప లేడు
    ‘బ్రెడ్డు జాము సాండు విచ్చి’ చేయఁగలేడు
    వంట జేయలేనివాఁడు మగఁడ?
    పనికి రాడు రేయి పగలు పండు కొనెడి
    వీనిఁ గట్టుకొంటి ‘వేస్టు’ గాడు

    రిప్లయితొలగించండి
  5. నేమాని పండితార్యా మీ పూరణలోని చమత్కారం అద్భుతం.

    రిప్లయితొలగించండి
  6. పుట్టినింటి కేఁగెఁ బొలఁతి, మూన్నాళ్ళయ్యె
    వంట జేయలేనివాఁడు మగఁ, డ
    తండు తిండిలేక తల్లడిల్లునొ యేమొ
    యనుచు వేగిరమున నరుగుదెంచె.

    రిప్లయితొలగించండి
  7. సుబ్బారావు గారూ,
    మంచి భావనతో పూరణ చేసారు. అభినందనలు.
    కాని పైనున్న నెలత, క్రింది ‘వంటచేయలేని’తో అన్వయించడమె కాస్త ఇబ్బందిగా ఉంది.
    *
    పండిత నేమాని వారూ,
    మిస్సన్న గారు చెప్పినట్లు మీ పూరణ చమత్కారశోభితమై అలరిస్తున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ఆటవెలదిని మాలిక వలే వ్రాయరాదు. దానిని నాలుగు పాదాలకు కుదించండి.
    *
    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. కట్టు కున్న సతికి కన్న వారలకెల్ల

    కూడు,గుడ్డ,గూడు గూర్చు మగడు!

    బాధ్యతలను మఱువ పనులేమి చేతగా

    వంట,చేయలేని వాడు మగడ?

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారి పూరణ....

    (ఇంద్రునితో మన్మథుడు పలికిన మాటలు)
    చివురు లెత్తఁ బ్రేమ శివపార్వతులలోన
    నాపఁగానుఁ జేయు నాదు బాణ
    మిదియ పూవుటమ్ము నిది వేసి యా తను
    వంటఁ జేయలేనివాఁడు మగఁడె?

    రిప్లయితొలగించండి
  10. విందు వేళ మించె నందరు వచ్చిరి
    వంట జేయలేనివాఁడు, మగఁడ !
    వంట పనికి వచ్చె, వంటింటికిం బోయి
    చేయి వేసి పూర్తి జేయి వంట.

    రిప్లయితొలగించండి
  11. సాఫ్టు వేరు జాబు చక్కని రూపమ్ము
    ఆస్తి పాస్తులెన్న జాస్తి తల్లి !
    వంట జేయలేనివాఁడు మగఁడ వద్ద
    నంగ బెండ్లి జేయ నాకు వశమె

    రిప్లయితొలగించండి
  12. భార్య సుతుల మిత్ర బంధుల నితరుల
    యుప్పు తీపు పులుపు రుచులు సమమై
    వండి శాంతి యను వైశిష్ట్య భక్ష్యాల
    వంట జేయ లేని వాడు మగడ?

    రిప్లయితొలగించండి
  13. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. కార్య భార మనుచు భార్య మాట వినక
    శెలవు నాడు బాసు పిలువ వెడలె
    భక్ష్య భోజ్య ములను బహు బహు విధముల
    వంటజేయ - లేనివాడు మగడ?

    రిప్లయితొలగించండి
  15. మగని తోడ కలసి మనసైన సినిమాను
    చూచి వచ్చుచుండ వేచి కాచి
    వెర్రి చేష్టలూను వెకిలిని తన్ని నొ-
    వ్వంట జేయలేనివాఁడు, మగఁడ ?

    రిప్లయితొలగించండి
  16. అవును వసంత మహోదయా క్షేమమేనా?

    శ్యామలీయంగారి జాడ కనపట్లేదు.

    గన్నవరపు వారు పద్య సుబోధకం మీద కన్నేసి
    శంకరాభరణం మీద శీతకన్నేశారు.

    రిప్లయితొలగించండి
  17. పోయివత్తు నేను పుట్టింటికిక కళా
    శాల జదివెడి తమ శ్యాలకుడిట
    నుండు జూడుమతని తిండి తిప్పలు-వాడు
    వంట జేయలేనివాడు ! మగడ !

    రిప్లయితొలగించండి
  18. శ్యామలీయము వారు వసంత గారు
    జిగురు వారును వేసిరి శీత కన్ను
    మూర్తి గారును తక్కిన మువ్వురూను
    లక్క రాజార్య మీరంత రండు రండు.

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నిజమే! అంత కష్టపడి చేసిన వంటకాలను తినడానికి రా/లేని మొగుడి మీద కోపం రావడం సహజమే.
    *
    మిస్సన్న గారూ,
    మీ మూడవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    *
    డా. విష్ణు నందన్ గారూ,
    మీ పూరణలోని హాస్యధోరణి చాలా బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. అవును కదా జిగురువారు కూడా చిక్కకుండా పోయారు.

    నిండుకున్న వింట తండులమ్ములు నయ్యొ
    వంట జేయ, లేని వాడు మగడ-
    శక్తు డాయె, కనుము సాధ్వి యా యిల్లాలు
    పనికి నేగె నామె దినము గడుప.

    *********

    వంట జేసి నీకు వడ్డించినాను లే!
    వెనుకటింటిలోని వెంగళప్ప
    వంట జేయ లేనివా డుమ! గడప దా-
    టెరుగ దతని భార్య కేమి సుఖమొ?

    రిప్లయితొలగించండి
  21. క్రొత్తవంటవాని గూర్చి యిట్లనె భార్య
    పనికి రాడు వీడు పరమశుంఠ,
    తరగలేడు కూర, తాలింపులా రావు,
    వంటఁ జేయలేనివాడు మగడ!

    రిప్లయితొలగించండి
  22. మాస్టారూ, మొదటి నాలుగు పాదాలే తీసుకొందాం:
    అధునాతన ‘సాఫ్టువేరిణి’ గోడు:
    బట్టలుతక డంట్లు నెట్టనతోమడు
    కాఫిచాయ ‘జూసు’ కలప లేడు
    ‘బ్రెడ్డు జాము సాండు విచ్చి’ చేయఁగలేడు
    వంట జేయలేనివాఁడు మగఁడ?

    ఇంకొక పూరణ-నవ్వుకోండి:
    నాయనమ్మ తాతఁ దూయబట్టగ వింటి
    ఓయి! మాసమంత ఉడకేసి పడవేస్తి
    ముష్టి మూడు నాళ్ళు ముచ్చటపడి యింట
    వంట జేయలేనివాఁడు మగఁడ?

    రిప్లయితొలగించండి
  23. ఈరోజు కవిమిత్రులు విజృంభించారు. చూశారా, ఎంతమంది మగధీరులకి వంట మీద ఇంటరెస్టు? అప్పటి నలుడూ, భీముడే కాదు, ఇప్పటికీ విశ్వ వ్యాప్తంగా ఫైవ్ స్టార్ హోటళ్ళలో చెఫ్ లు నూటికి తొంభై మంది మగవాళ్ళేట.

    రిప్లయితొలగించండి
  24. తెలుగు-కన్నడ కవిమిత్రులు చంద్రమౌళి గారూ, ఈరోజు సమస్య పరమేశిప్రేమ ప్రసంగ సినిమాలోని "ఏన్మాడలీ నాను యేన్మాడలీ, ఉప్పిల్ల మెణసిల్ల, తరకారి సొప్పిల్ల, ఎన్మాడలీ..." పాట గుర్తుకు తెస్తున్నది.

    రిప్లయితొలగించండి
  25. అలసి సొలసి వచ్చె నాలస్యముగ నేను
    లేశ మాత్ర మైన రోస పడక
    కొలువు జేయ కున్న కోపించ లేదన
    వంట జేయ లేని వాడు మగడ !

    రిప్లయితొలగించండి
  26. సంపత్ కుమార్ శాస్త్రి గారు మీ పూరణలో నాకు నచ్చిన పద్య పాదాలు.

    జాణ, సతిని గాంచి సరసమాడనివాడు
    వంటజేయ, లేనివాడు, మగడ?

    రిప్లయితొలగించండి
  27. మిస్సన్న గారూ,
    మీ లేటెస్ట్ రెండు పూరణలు కూడా బాగున్నవి. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మగణ్ణి వదిలి వంటవాణ్ణి ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    సవరించిన పూరణా, సరదాగా చెప్పిన రెండవ పూరణా బాగున్నవి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. మన తెలుగు గారు చాలా రియలిస్టిక్ పూరణ. బాగుంది.

    బట్టలుతక డంట్లు నెట్టనతోమడు
    కాఫిచాయ ‘జూసు’ కలప లేడు
    ‘బ్రెడ్డు జాము సాండు విచ్చి’ చేయఁగలేడు
    వంట జేయలేనివాఁడు మగఁడ?

    రిప్లయితొలగించండి
  29. శ్రీ లక్కరాజు గారికి ధన్యవాదాలు.

    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  30. ఊహకలుగనైన, నుర్వి, స్వప్నములోన
    గాని కట్టెదుటనుగాని తెలుప
    ప్రియసతికిని దోప పెదవిపైనిచిరున
    వ్వంట జేయలేనివాఁడు మగఁడ?

    రిప్లయితొలగించండి
  31. కలిగె మార్పులెన్నొ కాలప్రభావాన
    ఇంట సతికి సాయమీయవలెను
    స్త్రీ పురుషుల విధులు తిరకాసులయ్యెను
    వంట జేయలేని వాడు మగడ

    రిప్లయితొలగించండి
  32. మిత్రులకు ధన్యవాదములు. కొంచెము పని వత్తి డెక్కువయింది.తీరిక చూసుకొని మీ అందఱి పూరణలు చదివి ఆనందిస్తూనే ఉన్నాను. చాలా దినా లయింది సొంత పద్యము వండి ! ప్రయత్నిస్తాను .

    కల్ల బొల్లె లాఁడి యల్లుఁడయ్యెను నాఁడు
    వంట జేయ లేని వాఁడు ! మగఁడ !
    కూతు రింట గడిపి కూడు గఱప రాదె
    అల్లుఁడునకు, కావు మాడు బిడ్డ !

    రిప్లయితొలగించండి
  33. ఊకదంపుడు గారూ,
    ‘చిరున వ్వంటించిన’ మీ పూరణ వైవిధ్యంగా అలరిస్తున్నది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చమత్కారభరితమై ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి