పండిత నేమాని వారూ, సుభద్రాపరిణయాన్నో, శశిరేఖా పరిణయాన్నో దృష్టిలో పెట్టుకొని మీరు చేసిన పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. ‘ధార్తరాష్ట్రుల’ను ‘ధార్తరాష్ట్రులు’ అంటే బాగుంటుందేమో? * శ్రీపతి శాస్త్రి గారూ, చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, క్రమాలంకారంలో మీ పూరణ బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, కృష్ణుని కౌరవులకు వైరిగా మార్చిన మీ విరుపు చాలా బాగంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, అబద్ధంగా చెప్పిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * చంద్రమౌళి గారూ, గయోపాఖ్యాన ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * మిస్సన్న గారూ, కృష్ణుని లొంగదీసుకోవాలన్న కౌరవుల ఆలోచనతో మీ పూరణ బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. * కమనీయం గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ధార్తరాష్ట్రుల కుటిల తంత్రమ్ములందు
రిప్లయితొలగించండిదలచి రీరీతి వియ్యమ్ము కలుపుకొనిన
ముసలితో నంత మనతోడ మసలును హరి
పాండవులకు శ్రీకృష్ణుండు వైరి యగును
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఆప్తమిత్రుడు బాంధవుడాది గురువు
పాండవులకు శ్రీకృష్ణుడు, వైరి యగును
కంస చాణూర శిశుపాల కౌరవులకు
విశ్వమంతట వ్యాపించు విష్ణుదేవ
పాదయుగళికి నర్పింతు ప్రణతులెపుడు
గుండు మధుసూదన్ గారి పూరణ.....
రిప్లయితొలగించండికౌరవులు కీడు సేసి రేవారలకును?
పాండుపుత్రులఁ బ్రోచిన వాఁడెవండు?
పాము, ముంగిసకునుఁ జూడ నేమి యగును?
పాండవులకు; శ్రీకృష్ణుఁడు; వైరియగును!
ధర్మసంరక్షణంబునఁదాను నిలచి
రిప్లయితొలగించండిపాండవులపక్షపాతిగ పరగు చుండ
కౌరవులు కీడుఁదలపెట్ట క్రూరముగను
పాండవులకు, శ్రీకృష్ణుడు వైరి యగును
"కుండలవి పగులవెపుడు; కొమ్మలెపుడు
రిప్లయితొలగించండిపత్రములను రాల్చగలేవు; పలుక గలవె
యీ పలుకుల కన్నననృతమిప్పుడిటను?"
"పాండవులకు శ్రీకృష్ణుఁడు వైరియగును."
కవుల వైచిత్ర్యమేమందు కావ్య మందు
రిప్లయితొలగించండిగయుని వృత్తాంతమునుజేర్చి కథను జేసి
కానిదైనట్టు జూడగ కల్పనలను
పాండవులకు శ్రీకృష్ణుండు వైరి యగును
రాయ బారిగా వచ్చెను మాయ వాడు
రిప్లయితొలగించండివిందు వైభోగముల ముంచి వేడ్కపరచు
మల్లుడా వాని దెబ్బకు చల్లబడును
పాండవులకు శ్రీకృష్ణుండు వైరి యగును
హరి ధర్మ పక్షపాతి గాని కేవలము పాండవ పక్ష పాతి కాదు. ధర్మము వారి వద్ద లేక పొతే వారితో కూడా ఉండడు..అని నాభావం.
రిప్లయితొలగించండిధర్మ పక్షంబు నిలబడు దైవ మతడు
కోరి చూపడు ప్రేమయు కోపములను
ధర్మ పథమును వీడిన తక్షణమున
పాండవులకు శ్రీకృష్ణుండు వైరి యగును.
కుటిలుడైనట్టి శకుని వాకొనియె నిట్లు
రిప్లయితొలగించండి' మనము యదువంశ వీరసమ్మాన్యు డౌచు
నలరు బలదేవు మెప్పించి యాప్తమైత్రి
బాంధవము గూర్చుకొన ,నన్న బాట లోనె
పాండవులకు శ్రీ కృష్ణుడు వైరి యగును.'
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిసుభద్రాపరిణయాన్నో, శశిరేఖా పరిణయాన్నో దృష్టిలో పెట్టుకొని మీరు చేసిన పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
‘ధార్తరాష్ట్రుల’ను ‘ధార్తరాష్ట్రులు’ అంటే బాగుంటుందేమో?
*
శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
కృష్ణుని కౌరవులకు వైరిగా మార్చిన మీ విరుపు చాలా బాగంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
అబద్ధంగా చెప్పిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
చంద్రమౌళి గారూ,
గయోపాఖ్యాన ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
కృష్ణుని లొంగదీసుకోవాలన్న కౌరవుల ఆలోచనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
కమనీయం గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.