రాజేశ్వరి అక్కయ్యా, ధన్యవాదాలు. * ఫణి ప్రసన్న కుమార్ గారూ, నిజానికి మీ పద్యాన్ని చూసేదాకా ఈరోజు నా పుట్టిన దినమని గుర్తు లేదు. గుర్తుచేసి చక్కని పద్యం చెప్పినందుకు ధన్యవాదాలు. * శ్రీపతి శాస్త్రి గారూ, ధన్యవాదాలు. * పండిత నేమాని వారూ, మీ ఆశీస్సులకు ధన్యవాదాలు. * గుండు మధుసూదన్ గారూ, ధన్యవాదాలు. * వరప్రసాద్ గారూ, ధన్యవాదాలు. * సుబ్బారావు గారూ, ధన్యవాదాలు. * డా. విష్ణు నందన్ గారూ, ఆహా! ధన్యుడ నయ్యాను. నా యీ పుట్టిన దినమున అమూల్యమైన మీ పద్యరత్నాల కానుక లభించింది. ధన్యవాదాలు.
గురువుగారూ సరస్వతీ కటాక్షం వల్ల మీరు చిరాయులై ఇలాగే పండిత పామరుల్ని శంకరాభరణపు వెల్గులతో మురిపిస్తూ ఉండాలని నా కోరిక. శుభాకాంక్షలు. నాకు క్రింది పద్యం గురుతు కొస్తూంది:
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహమ్ము నాడు పొందుర సుమతీ.
ఛాలా ఆనందంగా ఉంది. ముందుగా [ పూజ్య గురువులకు ] " శుభా భి వందనములు "
రిప్లయితొలగించండిఇక తమ్మునికి + మరదలికి , జన్మ దిన సందర్భ ముగా హృదయ పూర్వక శుభా కాంక్షలు .[ దీర్ఘా యుష్మాన్ భవ ]
ఫణి ప్రసన్న కుమార్ గారి పద్యము....
రిప్లయితొలగించండివిద్దెలతల్లికి నిత్యము
పద్దెమ్ముల పూజసేయు భక్తుడవయ్యా!
పెద్దవు! పుట్టిన దినమీ
పొద్దున నిదె యందుకొనుము పొలుపుగ ప్రణతుల్!
Sree gurubhyOnamaha
రిప్లయితొలగించండిguruvugaariki namassulu. janmadina SubhaakaaMxalu.
Sreepathi Sastry.
అరుసము మీర జీవితమునందు గతించెను శంకరయ్య! మీ
రిప్లయితొలగించండికరువది మూడు వత్సరము లచ్చపు వృత్తిని బూని వాణికిన్
నెరపుచు నిత్యసేవలను నేర్పుచు విద్యలు శిష్యకోటికిన్
సరసమతీ! శతాయువయి శాంతి సుఖమ్ములతో జెలంగుమా!
గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య......
రిప్లయితొలగించండిసుకవిమిత్రులు శ్రీ కంది శంకరయ్య గారికి హృదయపూర్వక జన్మదిన
శుభాకాంక్షలు! ఈ శుభ సందర్భమునఁ దమకు భగవంతుఁ డాయురారోగ్యైశ్వర్య
సుఖసంతోషశాంతులను సత్వరకార్యసాఫల్యతల నందఁజేయుఁ గాక యని
ప్రార్థించుచున్నాను. స్వస్తి.
గురుతుల్యులు శ్రీ కందిశంకరయ్యగారికి జన్మదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిపుట్టిన రోజును మీరిటు
పట్టిన రోజనుటది టయిపాటో? కవితా
పట్టిని పట్టితి నేడిటు
జట్టుగనేనంచు తెలుపు సరసపు మాటో?
మురళీ మోహన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ఇంకా పూర్తిగా అలవాటు కాని సురవర తెలుగు కీబోర్డు వల్ల జరిగిన టైపాటు అది. సవరించాను.
Sree gurubhyOnamaha,
రిప్లయితొలగించండిguruvugaariki namaskaramulu. janmadina SubhaakaaMkshalu. padi kaalala paaTu mi shankaraabharanamu saagaalila ani bhagavaMthuni praarthistu
varaprasad
శ్రీ శంకరయ్య గారికి పుట్టిన రోజు
రిప్లయితొలగించండిశు భా కాంక్షలతో ...
సకల శుభములు గలిగించు శంక రుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .
ఇతడేనా సకలాంధ్ర పండితకవిశ్రీ బృంద సంజ్ఞాత వి
రిప్లయితొలగించండిస్తృత విద్యా ఫలదాయకమ్మగు కళాశ్లిష్ట స్వరూప ప్రభా
దృతి - ధన్యాకృతి - ' శంకరాభరణ ' వాగ్దేవీ కటాక్ష ప్రచో
దిత శోభామయ వేదికా కలిత చాంద్రీ పేశల ఖ్యాతుడౌ
నితడేనా ? యితడా ? యితండ? యితడా? యీతండ యీతండటే ?!
కరమరుదైన జీవిత వికాస విలాసము గాంచి మించి మేల్
గురుతర బాధ్యతల్ గొని యకుంఠిత దీక్ష పరిశ్రమించి సం
బరమున నేడు జన్మదిన పర్వమునన్ ముదమొందు కంది శం
కర బుధు డాయురున్నత సుఖమ్ముల నొందగ వాణి మ్రొక్కెదన్ !!!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
ఫణి ప్రసన్న కుమార్ గారూ,
నిజానికి మీ పద్యాన్ని చూసేదాకా ఈరోజు నా పుట్టిన దినమని గుర్తు లేదు. గుర్తుచేసి చక్కని పద్యం చెప్పినందుకు ధన్యవాదాలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
*
పండిత నేమాని వారూ,
మీ ఆశీస్సులకు ధన్యవాదాలు.
*
గుండు మధుసూదన్ గారూ,
ధన్యవాదాలు.
*
వరప్రసాద్ గారూ,
ధన్యవాదాలు.
*
సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు.
*
డా. విష్ణు నందన్ గారూ,
ఆహా! ధన్యుడ నయ్యాను. నా యీ పుట్టిన దినమున అమూల్యమైన మీ పద్యరత్నాల కానుక లభించింది. ధన్యవాదాలు.
శంకరయ్య గారూ
రిప్లయితొలగించండికం. అరువదిమూ డనిపించక
నిరువదిమూ డన్న రీతి నెగయుదు రయ్యా
పరిపరివిధముల కవనాం
బరవీధీవిహరణంబు బట్టున మీరల్
జన్మదిన శుభాకాంక్షలు!
గుండు మధుసూదన్ గారి పదములు....
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారికి త్రిషష్టి జన్మదిన శుభాకాంక్షలతో...
చం.
సకల గుణాన్వితోన్నతుఁడు, చారు సుకీర్తిత ధన్య జీవుఁడున్,
వికసిత బుద్ధివైభవుఁడు, విజ్ఞుఁడు, శాంతుఁడు, జ్ఞానమూర్తి, స
త్ప్రకటిత పండితోత్తముఁడు, ప్రజ్ఞ విరాజిలు కావ్యకర్తలం
దొకరుఁడు కంది శంకర బుధోత్తమ, జన్మదినోత్సవాంజలుల్!
కం.
హృద్యములగు పద్యమ్ముల
నాద్యంత సువేద్యముగ నిరాటంకముగన్
శ్రీద్యుతి చెన్నలరారన్
సద్యః ప్రభలొలుక రచన సాగించితయా!
ఆ.వె.
ఎంత కాంతిమంత! మెంత వింతగు పుంత!
సుంతయేని విసువు వంత నిడదు!
ఇంత భావదీప్తి నెంతు నుతింతును
సాంతముగను జదివి సంతసింతు!
సీ.
బాల్యమ్మునుండియు బాగుగా విద్యలో
రాణించి యెదిగిన రత్న మీవు;
శ్రమియించియును విద్య సక్రమమ్ముగ నేర్చి,
విజ్ఞాన ఖనియైన విజ్ఞుఁ డీవు;
బోధకవృత్తి సుభూషణమ్మని యెంచి,
తలఁదాల్చి వెలిఁగిన ధన్యుఁ డీవు;
విద్యార్థులందఱన్ బిడ్డలుగా నెంచి,
దయను బ్రేమను జూపు తండ్రి వీవు;
వృత్తిధర్మముఁ దక్క వేఱొక్క ధర్మమ్ము
ముందుగాఁ దలఁపని మునివి నీవు;
వారు వీరను భేదభావ మెఱుంగక
హితముఁ గల్గించు స్నేహితుఁడ వీవు;
కోప మింతయు లేక కోమలమ్మగు వాక్కు
చిఱునవ్వు తళుకొత్తు శ్రేష్ఠుఁ డీవు;
శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్
రస రమ్యముగఁ దీర్చు రసికుఁ డీవు;
గీ.
మంచి వీవు! సుగుణ గణ మణివి నీవు!
బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు!
కవుల కందఱ కాదర్శ కవివి నీవు!!
తే.గీ.
పర ధనమును మృత్పిండమ్ము పగిది నెంచి,
పర సతీ మణులను దల్లి వలెఁ దలంచి,
యెపుడు శాంత్యహింసాక్షమాకృపలు, దాన
ధర్మసద్గుణశౌచసత్యములు గలిగి,
యొజ్జబంతివై మెలఁగిన యొజ్జవైన
నీకుఁ బరమాత్ముఁ డెంతయు నీవి తోడ
నాయురారోగ్యభోగభాగ్యైహికమ్ము
లీప్సితార్థమ్ము లనిశమ్ము నిచ్చుఁ గాక!
***శుభం భూయాత్***
శ్యామలీయం గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
మధుసూదన్ గారూ,
మిత్రపక్షపాతంతో అల్పుడనైన నన్ను చాలా ఎక్కువగా పొగిడారు. సంతోషం. మీ పద్యాలు అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
ధవళాంగు శివు సరస్వతి
రిప్లయితొలగించండిఛవిగాదే శంకరార్య కవితాలోకం
రవితేజమువలె నిరతము
నవభావము లొసగుగాక కవనోత్సాహం
శ్రీ కందిశంకరయ్య గారికి నమస్కారం మీకు జన్మదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండివిరిసిన కళలకు నిల్లగు
పురమువరంగల్లునందు పుట్టిన కవిశం
కర కందివంశ యశ,నీ
పరమాయెను తెలుగుపలుకు! ప్రణతుల్ గొనుమా !!!
చంద్రమౌళి గారూ,
రిప్లయితొలగించండిమంద పీతాంబర్ గారూ,
............ ధన్యవాదాలు.
సాహితీవ్యవసాయాన చక్కనైన
రిప్లయితొలగించండికావ్యసస్యముల్ పండించి భవ్యజీవ
నమ్ము సాగించు కవిచంద్ర, నాశుభాభి
నందనలు కొమ్ము శంకర నామ విబుధ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారూ సరస్వతీ కటాక్షం వల్ల మీరు చిరాయులై
రిప్లయితొలగించండిఇలాగే పండిత పామరుల్ని శంకరాభరణపు వెల్గులతో
మురిపిస్తూ ఉండాలని నా కోరిక. శుభాకాంక్షలు.
నాకు క్రింది పద్యం గురుతు కొస్తూంది:
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహమ్ము నాడు పొందుర సుమతీ.
మీ పెద్దలు ధన్యులు.
శంకరార్యా!మీకు జన్మ దిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండికంది వరాన్వయ సరి మా
కందిన వరమయ్య నీవు కష్టము లెదురై
కందిన గానీ వదలక
నందింతువు పాఠములను నతులన్ గొనుమా!
గురువులు పూజ్యులు మనకన
రిప్లయితొలగించండిబరువగు పద్యముల నెపుడు పరమ ప్రీతిన్ !
నెరపుచు నేర్పుగ నోర్పున
పరమా నందమ్మునిడగ పాండిత్య మునన్ !
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రాజేశ్వరి అక్కయ్యా,
.......... ధన్యవాదాలు.