31, జులై 2012, మంగళవారం

సమస్యాపూరణం - 779 (వీరక్కకు చిన్నచేయి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
వీరక్కకు చిన్నచేయి విస్తరి ఘనమౌ.
ఈ సమస్యను పంపిన నేదునూరి రాజేశ్వరి గారికి ధన్యవాదములు.

12 కామెంట్‌లు:

 1. గౌరి యదెవరికి చెల్లెలు?
  తీరుగ వ్రాసినదెవరిదిదీ, ; విందులకున్
  బూరెలు కంచమున వలదు,
  వీరక్కకు; చిన్నచేయి?; విస్తరి ఘనమౌ.

  రిప్లయితొలగించండి
 2. ఆరయ పుట్టుక తోడనె
  వీ రక్కకు చిన్న చేయి, విస్తరి ఘనమౌ
  పేరం టాం డ్ర కు బెట్టిన
  గారవమున బలుక రిం చి కై దండ లిడున్ .

  రిప్లయితొలగించండి
 3. బీరాలు పలుకు చక్కగ
  పోరాడుచునుండు నిరుగుపొరుగుల తోడన్ ,
  నోరేప్పుడూరకుండని
  వీరక్కకు చిన్నచేయి విస్తరి ఘనమౌ!!!

  రిప్లయితొలగించండి
 4. పేరుకు విందుకు బిలుచెడు
  వీరక్కకు చిన్నచేయి, విస్తరి ఘనమౌ
  తీరికగా తినవచ్చుచు
  వేరొకరింటను భుజించు, విందుకు బిలువన్.

  రిప్లయితొలగించండి
 5. రా!రా! చంటీ! కుంభా
  కారకటకమునఁజూడకనిపించనివే
  భారీపరిమాణంబౌ
  వీరక్కకుచిన్నచేయివిస్తరిఘనమౌ!

  రిప్లయితొలగించండి
 6. మారాము జేసి కోర్కెల
  కోరునుమరి, పిట్టకొంత కూతఘనంబౌ
  తీరుగ నున్నది గను, మా
  వీరక్కకు చిన్నచేయి విస్తరి ఘనమౌ.

  రిప్లయితొలగించండి
 7. వీరెల్లరు సుగుణాఢ్యలు
  పేరొందిరి విద్యలందు పెన్నిధులనుచున్
  వీరక్క యనగ నొప్పెడు
  వీరక్కకు చిన్న చేయి విస్తర ఘనమౌ

  రిప్లయితొలగించండి
 8. చారుమతి వెడలె విందుకు
  నోరూరగ తినగ నెంచి నూతన రుచులన్ !
  తీరా వడ్డన జేయగ
  వీరక్కకు చిన్న చేయి విస్తరి ఘనమౌ !

  రిప్లయితొలగించండి
 9. కొండమూరి లక్ష్మీనరసింహం గారి పూరణ....

  వారికి వచ్చెడి సారెలు
  భారీగా దీసుకొనును, వధువుకు నివ్వన్
  బేరాలాడు పడతి యా
  వీరక్కకు చేయి చిన్న విస్తరి ఘనమౌ.

  రిప్లయితొలగించండి
 10. కవిమిత్రులకు మనవి...
  ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులవల్ల ఉదయం నుండి ఇప్పటివరకు బ్లాగు చూడడంం వీలుపడలేదు. తీరా ఇప్పుడు చూస్టే... నాచూపు మందగించిందో మానిటర్ లోపమో కాని వ్యాఖ్యలుగ ఉన్న మీ పూఅణ పద్యాలు ముద్దముద్దగా అలుక్కుపోయినట్లు కనిఒపిస్తున్నాయి. నేను టైపుచేసున్న అక్షరాలు కూడ సరిగా కనిపిమ్చటం లేదు. మీ పద్యాలను వ్యాఖ్యానించే అవకాశం లేఉ. దయచేసి మిత్రులు ఈాటి పూరణలను పద్యాలను పరస్పరం సమీక్షించుకోన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 11. పూటకూళ్ళ వీరమ్మ:

  కూరిమితో వడ్డించెడి
  వీరక్కకు చిన్నచేయి; విస్తరి ఘనమౌ
  కూరలు నారలు లేవుర
  చారే నేలను బిరబిర జారును జుర్రుర్!

  రిప్లయితొలగించండి
 12. పూటకూళ్ళ వీరక్క:

  కూరిమితో వడ్డించెడి
  వీరక్కకు చిన్నచేయి; విస్తరి ఘనమౌ
  కూరలు నారలు లేవుర!
  నోరూరగ నావకాయ నొల్లుచు తినరా!

  రిప్లయితొలగించండి