2, జులై 2012, సోమవారం

రవీంద్రుని గీతాంజలి - 61

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

61

THE sleep that flits on baby's eyes
does anybody know from where it
comes? Yes, there is a rumour that
it has its dwelling where, in the fairy
village among shadows of the forest
dimly lit with glow-worms, there hang
two timid buds of enchantment. From
there it comes to kiss baby's eyes.

The smile that flickers on baby's lips
when he sleeps does anybody know
where it was born ? Yes, there is a
rumour that a young pale beam of a
crescent moon touched the edge of a
vanishing autumn cloud, and there the
smile was first born in the dream of a
dew- washed morning the smile that
flickers on baby's lips when he sleeps.

The sweet, soft freshness that blooms
on baby's limbs does anybody know
where it was hidden so long ? Yes,
when the mother was a young girl it
lay pervading her heart in tender and
silent mystery of love the sweet, soft
freshness that has bloomed on baby's
limbs.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

హాయిగాఁ బసిపాప కందోయిఁ గ్రమ్ము
నిదుర యేమిటొ? యెచటనుండి దిగివచ్చి
వాలెనో? దీనిఁ దెలిసినవారు కలరె? ||

ఔను! వినుకలి కలదు, దూరాన నేదొ
మిణుఁగురుం బురువులు మిన్కుమిన్కు మనెడి
యడవి క్రీనీడ మసకలో నందమైన
నచ్చరలపల్లె కలదఁట, యచట మంత్ర
మోహనములైన చిన్నారిమొగ్గ లేవొ
రెండు మెలమెల్లఁ గదలుచునుండునంట,
వానినుండియె సుఖనిద్ర వచ్చునంట
చిట్టి కన్రెప్పలన్ ముద్దుబెట్టుకొనఁగ ||

నిదురవోయెడి *పసిపాప పదవిమీదఁ
బొలుచు చిరునవ్వు లెచ్చటఁ బొటమరిల్లి
వచ్చెనో? దీనిఁ దెలిసినవారు కలరె? ||

వినికిడియె కల, దౌనౌను, విదియచంద్రు
కెలని తెలివన్నె లేలేత కిరణ మొక్క
సారి *శారదజలధరాంచలముతోడ
దాకినపుడు తుషారధౌత ప్రభాత
శీతలస్వప్నమందునఁ జిన్నినవ్వు
మొట్టమొదలుగ నచటనె పుట్టెనంట,
నిదురవోయెడి పసిపాప పెదవిమీది
కదియె దిగివచ్చి తా నాట లాడునంట ||

పాప మెత్తని మేనఁ గ్రొందీపి మోసు
లెత్తు నవనవలాట తా నిన్నినాళ్ళు
లెచట దాగెనొ? తెలిసిరె యెవ్వరేని? ||

తొల్లి యొకనాడు పసిపాప తల్లికూడ
నవ్యయౌవనధన్యకన్యామతల్లి,
యపుడె యా యమ్మ మృదుహృదయమ్ము నిండ
*నీరవప్రేమభావనాస్నిగ్ధమైన
యొక రహస్యఁపుఁ దీపి చుట్టుకొనె నంట,
యట్టి తీపియె నేడు విప్పారి చిట్టి
యవయవమ్ముల నిగనిగలాడునంట ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి