7, జులై 2012, శనివారం

పద్య రచన - 43


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.


కవిమిత్రుల పద్యములు

౧. పండిత నేమాని
    అమ్మా! మధురాపురమున
    నమ్మెద నే పాలు పెరుగు యాదవసతినై
    యమ్మాధవుతో నాడెద
    నమ్మా! దీవింపుమా మహానందనిధీ!
*     *     *     *     *     *
౨. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    బొట్టును కాటుక పెట్టిన
    చిట్టీ! నీ బోసినవ్వు సిరి పుట్టించున్
    అట్టే పెరగిన యందము
    లిట్టే మాయం బగునట యెటులో తల్లీ!
*     *     *     *     *     *
౩. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    ముసిముసి నగవులతో నీ
    పసిబిడ్డ వెలుంగు చుండె భాగ్యాంబుధియై
    వసుధన్ యశముల నందుచు
    వసియించి సుఖించు గాత! వత్సరశతముల్.
*     *     *     *     *     *
౪. ఫణి ప్రసన్న కుమార్
    ఎదుగుట కేలనె తొందర
    పదపదమున నిడుము లమ్మ బ్రతుకున జూడన్
    మధురము బాల్యము వదలక
    పదిలముగా నింపుకొమ్ము మదిలో బాలా!

*     *     *     *     *     *
౫. రవి
    నుదుట నల్లచుక్క నునుపైన ముంగొంగు
    బిలిబిలి కనుగుడ్లు కలికినగవు
    ముద్దులొల్కు ముక్కు బూరెల బుగ్గలు
    చిన్నికన్న! నిన్ను చేరి పిలుతు.

*     *     *     *     *     *
౬. సుబ్బారావు
    బోసి నవ్వుల నొ లికించు బుడత వీ వు
    బొట్టు కాటుక ముద్దుగ పెట్టి నావు
    బుల్లి బుగ్గలు నుండెను బూ ర్ల వలెను
    ముద్దు నీ యం గ గోరుదు మోహ నాం గి !
*     *     *     *     *     *
౭. మిస్సన్న
    హుష్షు! చెప్పకు మమ్మతో, నురుము గ్రుడ్ల,
    నమ్మ కొంగులో దాగుంటి హాయిగాను
    బువ్వ తినుమంచు చూపించు బూచి నామె
    బూచి పోయిన వత్తును బువ్వ తినను.

*     *     *     *     *     *
౮. రాజేశ్వరి నేదునూరి
    ముసిముసి నగవుల సొగసులు
    అసితోత్పల కనుల మెఱుపు నాశలు దీర్చన్ !
    మిసమిస బుగ్గల నిగనిగ
    దశదిశలకు వెలుగు నిచ్చు తన్మయ మొందన్ !
*     *     *     *     *     *
౯. లక్ష్మీదేవి
    లోకరీతులు తెలియక లోన ముదము
    నందు చిన్నవారల జూడ హర్షమొంది
    కవితలిచ్చట కురిసెను కానుకలుగ;
    నెల్లరకు నభినందనలివియె, గొనుఁడు.

17 కామెంట్‌లు:

 1. అమ్మా! మధురాపురమున
  నమ్మెద నే పాలు పెరుగు యాదవసతినై
  యమ్మాధవుతో నాడెద
  నమ్మా! దీవింపుమా మహానందనిధీ!

  రిప్లయితొలగించండి
 2. పండిత నేమాని వారూ,
  మదురాపురానికి వెళ్తానని మధురంగా చెప్పించారు పాపతో. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
  చివరి పాదంలో యతి తప్పింది. కందంలో ప్రాసయతి వాడరాదు కదా! సవరించండి.

  రిప్లయితొలగించండి
 3. మాస్టారూ, ధన్యవాదాలు. సవరణతో:
  బొట్టూకాటుక పెట్టిన
  చిట్టీ! నీబో సినవ్వు సిరి పుట్టించున్
  అట్టే పెరగకుమందము
  లిట్టే మాయంబగునట యెటులో తల్లీ!

  రిప్లయితొలగించండి
 4. ముసిముసి నగవులతో నీ
  పసిబిడ్డ వెలుంగు చుండె భాగ్యాంబుధియై
  వసుధన్ యశముల నందుచు
  వసియించి సుఖించు గాత! వత్సరశతముల్.

  రిప్లయితొలగించండి
 5. ఎదుగుటకేలనె తొందర
  పదపదముననిడుములమ్మ బ్రతుకున జూడన్
  మధురము బాల్యము వదలక
  పదిలముగా నింపుకొమ్ము మదిలో బాలా!

  రిప్లయితొలగించండి
 6. సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  ఫణి ప్రసన్న కుమార్ గారూ,
  ‘ఎదగడాని కెందుకురా తొందర
  ఎదర బ్రతుకంతా చిందర వందర’ అందాలరాముడు చిత్రంలోని పాటను గుర్తుకు తెచ్చిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. నుదుట నల్లచుక్క నునుపైన ముంగొంగు
  బిలిబిలి కనుగుడ్లు కలికినగవు
  ముద్దులొల్కు ముక్కు బూరెల బుగ్గలు
  చిన్నికన్న! నిన్ను చేరి పిలుతు.

  రిప్లయితొలగించండి
 8. రవి గారూ,
  ముద్దు ముద్దు మాటలతో ముచ్చటైన పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. బోసి నవ్వుల నొ లికించు బుడత వీ వు
  బొట్టు కాటుక ముద్దుగ పెట్టి నావు
  బుల్లి బుగ్గలు నుండెను బూ ర్ల వలెను
  ముద్దు నీ యం గ గోరుదు మోహ నాం గి !

  రిప్లయితొలగించండి
 10. అందమైన పాపలాగే సుందరంగా ఉన్నాయి అందరి పద్యాలు.

  హుష్షు! చెప్పకు మమ్మతో నురుము గ్రుడ్ల
  నమ్మ కొంగులో దాగుంటి హాయిగాను
  బువ్వ తినుమంచు చూపించు బూచి నామె
  బూచి పోయాక వత్తును బువ్వ తినను.

  రిప్లయితొలగించండి
 11. సుబ్బారావు గారూ,
  మీ పద్యం మోహనంగా ఉంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  ఎంత మనోహరమైన భావన. చక్కని పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. ముసి ముసి నగవుల సొగసులు
  అసితోత్పల కనుల మెఱుపు నాశలు దీర్చన్ !
  మిస మిస బుగ్గల నిగ నిగ
  దశ దిశలకు వెలుగు నిచ్చు తన్మయ మొంధన్ !

  రిప్లయితొలగించండి
 13. లోకరీతులు తెలియక లోన ముదము
  నందు చిన్నవారల జూడ హర్షమొంది
  కవితలిచ్చట కురిసెను కానుకలుగ;
  నెల్లరకు నభినందనలివియె, గొనుఁడు.

  రిప్లయితొలగించండి
 14. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  ఎల్లరకు అభినందలను తెలిపి హర్షమొందజేసిన మీ పద్యం హృద్యంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. అమ్మా రాజేశ్వరి గారూ! అభినందనలు.
  మీ పద్యములోఅసితోత్పల కనుల మెరపు అంటే సగము సంస్కృతము సగము తెలుగు సమాసము సాధువు కాదు. అసితోత్పల నయన కాంతులు అని సవరించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి