తెల్లవారల పాలన తెల్లవారి చంద్ర కాంతులు విరియగ చంద్ర బోసు భరత జాతిని నడిపించె పరుగులెత్తి మాయమాయెను తుదకు నేమాయెనేమొ?
భారతమాత దాస్యమును భావితరమ్ములు చూడరాదనెన్వీరత జూపి నిల్చెనట వీరుల రమ్మని పిల్చెనాతడేధీర సుభాషు చంద్రుడయి దేశపు ద్రోహుల ధిక్కరించెనేగౌరవమందె నెల్లరకు గర్జన యన్ననిదేయని జూపుచున్.
దేశమాతకై ప్రభువుల ధిక్కరించి ఛద్మవేషమ్ముతో విదేశాల కరిగి భరత జాతీయసేన గూర్పంగ జేసి అసువులనుగోలుపోయన యమరుడతడు. భారతమాత దాస్యమును బాపి ,స్వరాజ్యముదెచ్చి ,లోకమన్ దారయ బూర్వవైభవము నందగజేయ బ్రతిజ్ఞ బూని శన్ ఖారవమొత్తె ,విప్లవవిభాత సహస్రమయూఖు డైన యా వీరవరుండు ; బోసు ,అరివీర భయంకర తేజు డాతడున్.
చంద్ర బింబము బోలిన చంద్ర బోస !దేశ స్వారాజ్య మార్జించు ధీ ర జనుడ !యెందు కేగితి వీ వయ్య ! యుందు వెచట ?వందనంబులు నీ కివె వంద లాది .
ఆజాద్ హింద్ ఫౌజ్ ను నెలకొల్పి స్వతంత్ర్యం కోసం సాయుధపోరాటం చేసిన సుభాష్ చంద్రబోస్ గురించి చక్కని పద్యాలు వ్రాసినగోలి హనుమచ్ఛాస్త్రి గారికి, లక్ష్మీదేవి గారికి, కమనీయం గారికి, సుబ్బారావు గారికిఅభినందనలు, ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మధుసూదన్ గారూ, నేతాజీ గురించిన సమగ్ర పద్యచిత్రాన్ని ఖండకృతిగా అందించారు. పద్యాలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
గుండు మధుసూదన్ గారి పద్యములు..... కం. ఓయీ నేతాజీ! విను మోయీ, యీ భరతజాతి పొంద స్వతంత్రం బా యురుతర సంగ్రామం బాయుధుఁడై సేసితయ్య!వందనమయ్యా!! తే.గీ. "హింస హింసచేఁ దనియు నహింసచేతఁ గాదు; తెల్లవారల గెల్వఁ 'గన్' 'తుపాకిఁ' జేతఁ బట్టిన లభియించు స్వేచ్ఛ మనకు! రండు భారత వీరులార! యని సేయ!" ఆ.వె. అనుచుఁ బిలిచి, తాను "నాజాదు హిందు ఫౌ" జనెడి "సైన్య పటలి" సాయుధుఁ డయి; చేర్చుకొనఁగ జనులఁ జిరకాల వాంఛిత స్వేచ్ఛ కొఱకు దురము ద్విగుణ మాయె! ఉ. భారతమాత దాస్యమునుఁ బాపఁగ నెంచి, సుభాష చంద్రుఁడే వీర జవానుఁడై దొరల భీతిలఁ జేయఁగ సైన్య యుక్తుఁడై దారుణమైన యుద్ధము స్వతంత్రతకై కొనసాఁగఁ జేయుచున్ బోరియు వాయు యానమున భూమిని వీడియుఁ జేరె స్వర్గమున్! మాలినీ వృత్తము: భరత వర భటాఢ్యా! భవ్య సన్మానితార్యా! ఖరకర సమ తేజా! గమ్య దాతృత్వ బీజా! మరణ రణ వినోదా! మాతృ దాస్యాపనోదా! సరవి నిడుదు జేజే! జాతి నేతాజి జేజే!
తెల్లవారల పాలన తెల్లవారి
రిప్లయితొలగించండిచంద్ర కాంతులు విరియగ చంద్ర బోసు
భరత జాతిని నడిపించె పరుగులెత్తి
మాయమాయెను తుదకు నేమాయెనేమొ?
భారతమాత దాస్యమును భావితరమ్ములు చూడరాదనెన్
రిప్లయితొలగించండివీరత జూపి నిల్చెనట వీరుల రమ్మని పిల్చెనాతడే
ధీర సుభాషు చంద్రుడయి దేశపు ద్రోహుల ధిక్కరించెనే
గౌరవమందె నెల్లరకు గర్జన యన్ననిదేయని జూపుచున్.
దేశమాతకై ప్రభువుల ధిక్కరించి
రిప్లయితొలగించండిఛద్మవేషమ్ముతో విదేశాల కరిగి
భరత జాతీయసేన గూర్పంగ జేసి
అసువులనుగోలుపోయన యమరుడతడు.
భారతమాత దాస్యమును బాపి ,స్వరాజ్యముదెచ్చి ,లోకమన్
దారయ బూర్వవైభవము నందగజేయ బ్రతిజ్ఞ బూని శన్
ఖారవమొత్తె ,విప్లవవిభాత సహస్రమయూఖు డైన యా
వీరవరుండు ; బోసు ,అరివీర భయంకర తేజు డాతడున్.
చంద్ర బింబము బోలిన చంద్ర బోస !
రిప్లయితొలగించండిదేశ స్వారాజ్య మార్జించు ధీ ర జనుడ !
యెందు కేగితి వీ వయ్య ! యుందు వెచట ?
వందనంబులు నీ కివె వంద లాది .
ఆజాద్ హింద్ ఫౌజ్ ను నెలకొల్పి స్వతంత్ర్యం కోసం సాయుధపోరాటం చేసిన సుభాష్ చంద్రబోస్ గురించి చక్కని పద్యాలు వ్రాసిన
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
కమనీయం గారికి,
సుబ్బారావు గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండినేతాజీ గురించిన సమగ్ర పద్యచిత్రాన్ని ఖండకృతిగా అందించారు. పద్యాలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
గుండు మధుసూదన్ గారి పద్యములు.....
రిప్లయితొలగించండికం.
ఓయీ నేతాజీ! విను
మోయీ, యీ భరతజాతి పొంద స్వతంత్రం
బా యురుతర సంగ్రామం
బాయుధుఁడై సేసితయ్య!వందనమయ్యా!!
తే.గీ.
"హింస హింసచేఁ దనియు నహింసచేతఁ
గాదు; తెల్లవారల గెల్వఁ 'గన్' 'తుపాకిఁ'
జేతఁ బట్టిన లభియించు స్వేచ్ఛ మనకు!
రండు భారత వీరులార! యని సేయ!"
ఆ.వె.
అనుచుఁ బిలిచి, తాను "నాజాదు హిందు ఫౌ"
జనెడి "సైన్య పటలి" సాయుధుఁ డయి;
చేర్చుకొనఁగ జనులఁ జిరకాల వాంఛిత
స్వేచ్ఛ కొఱకు దురము ద్విగుణ మాయె!
ఉ.
భారతమాత దాస్యమునుఁ బాపఁగ నెంచి, సుభాష చంద్రుఁడే
వీర జవానుఁడై దొరల భీతిలఁ జేయఁగ సైన్య యుక్తుఁడై
దారుణమైన యుద్ధము స్వతంత్రతకై కొనసాఁగఁ జేయుచున్
బోరియు వాయు యానమున భూమిని వీడియుఁ జేరె స్వర్గమున్!
మాలినీ వృత్తము:
భరత వర భటాఢ్యా! భవ్య సన్మానితార్యా!
ఖరకర సమ తేజా! గమ్య దాతృత్వ బీజా!
మరణ రణ వినోదా! మాతృ దాస్యాపనోదా!
సరవి నిడుదు జేజే! జాతి నేతాజి జేజే!