5, జులై 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 64

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

64

ON the slope of the desolate river among
tall grasses I asked her, " Maiden, where
do you go shading your lamp with your
mantle? My house is all dark and
lonesome lend me your light!" She
raised her dark eyes for a moment and
looked at my face through the dusk.
"I have come to the river," she said,
" to float my lamp on the stream when
the daylight wanes in the west." I
stood alone among tall grasses and
watched the timid flame of her lamp
uselessly drifting in the tide.

In the silence of gathering night I
asked her, "Maiden, your lights are all
lit then where do you go with your
lamp ? My house is all dark and lone-
some, lend me your light" She raised
her dark eyes on my face and stood for
a moment doubtful. " I have come,"
she said at last, " to dedicate my lamp
to the sky." I stood and watched her
light uselessly burning in the void.

In the moonless gloom of midnight I
asked her, " Maiden, what is your quest
holding the lamp near your heart ? My
house is all dark and lonesome, lend
me your light." She stopped for a
minute and thought and gazed at my
face in the dark. " I have brought my
light," she said, "to join the carnival of
lamps." I stood and watched her little
lamp uselessly lost among lights. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....


పెరిగి పొడవుగ రెల్లు క్రిక్కిరిసి యున్న
యెవ్వరున్ లేని యయ్యేటి యేటవాలు
బాటలో నాపెతో నిటు పల్కినాఁడ,
“కొంగుతోఁ గప్పి దీపము గొంచు నెచటి
కేగుచుంటివి? బాలికా! యేకతంపు
నా గుడిసెలోనఁ జీకటి మూఁగి వచ్చె,
నిమ్ము నాకిప్పు డీ ప్రదీప” మ్మటంచు,
మసకలో నా మొగమ్మున మగువ యొక్క
క్షణము కాటుకకనులను జొనిపి పలికె
“సందె వెలుతురు జార నిర్ఝరిణిధార
దీని వదలఁగ వచ్చితి నే” నఁటంచు,
నురక యే నట్లె చూచుచు నుంటి నచట,
ఆ పొలఁతి మిన్కుమిన్కను దీపశిఖయు
తరఁగలం దేలి రిత్తగ నరుగుచుండె ||

సాంధ్యతిమిరము గ్రమ్ము నిశ్శబ్దవేళ
నవ్వెలందిని బిల్చి యిట్లడిగినాఁడ
“బాల! మీ యింట నెల్ల దీపాలు వెల్గె,
నింక నీ దివ్వె గైకొని యెటకుఁ జనెదు?
చిమ్మచీఁకటి నా కుటీరమ్ముఁ గ్రమ్మె,
నిమ్ము నా కిప్పు డీప్రదీప” మ్మటంచు,
కలికి నాపయిఁ గాటుకకనులు నెరపి
క్షణము సందియపడి యిటు లనియెఁ దుదకు
“ఇద్ది యాకాశదీపమై యెగయునట్లు
నింగి కర్పింప వచ్చితి నే” నఁటంచు
నట్లె చూచుచు నిలిచితి నచట నేను,
ఆ పొలంతుక తెచ్చిన దీపకళిక
నిష్ఫలముగ వెలుంగుచు నింగిఁ బ్రాకె ||

కడకు నమవసచీకఁటి నడికిరేయి
నప్పడంతిని గని యిటు లడిగినాఁడ,
“ఎదకడం దీపమిడుకొని యెవరి వెదకఁ
బోయెదవు చెప్పు మిప్పుడు ముద్దరాల?
యిమ్ము నాకిది, నా కుటీరమ్ము నిండఁ
గటికచీఁకటి తప్పలు గప్పె” నంచు,
నిముస మాపె తటాలున నిలిచి, యేదొ
తలఁచి, చీఁకటిలోపలఁ దనదునీలి
కనులు నాదెసఁ బరపుచు ననియె నిట్లు,
చారుదీపావళీ మహోత్సవమునందుఁ
జేర్చుకొరకని దీని దెచ్చితి” నఁటంచు,
నట్లె చూచుచు నిలిచితి నచట నేను,
వ్యర్థముగ నొకలక్ష దీపాలలోన
నా నెలంతుక చిరుదివ్వె లీన మయ్యె ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి