4, జులై 2012, బుధవారం

సమస్యాపూరణం - 753 (పితరుని వధించి తినునట్టి)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పితరుని వధించి తినునట్టి సుతుఁడె హితుఁడు!


కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యంతో...

కన్నడంలో సమస్య...

ತಂದೆಯನೇ ಕೊಂದು ತಿಂಬ ಸುತನತಿ ರಮ್ಯಂ

దీనిని పంపిన చంద్రమౌళి గారికి ధన్యవాదాలు.

కవిమిత్రుల పూరణలు

౧. సుబ్బారావు
    కొమరు డెక్కడుండును జూడ కువలయమున
    పితరుని వధించి తిను నట్టి, సుతుడె హితుడు
    సత్ప్రవర్తన గలుగుచు సౌమ్యుడైన
    వాని జన్మము సఫలము వసుధ లోన .
*     *     *     *     *     *
౨. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    కన్నవారిని పనివారిగా దలంచి
    దూషణంబులు చేయుచు దుష్టుడగుచు
    బాధపెట్టుచు నుండెడివాని కన్న
    పితరుని వధించి తినునట్టి సుతుడె హితుడు.
*     *     *     *     *     *
౩. కందుల వరప్రసాద్
    (నేటి వార్త : మద్యము సేవించుటకు డబ్బులివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు)
    మత్తులో మునిగి దిరుగు మాన హీను
    లకు, పరులను హింసించెడి రాక్షసులకు,
    కలియుగపు ఖలులకు నేటి కౌరవులకు
    పితరుని వధించి తినినట్టి సుతుడె హితుడు.
*     *     *     *     *     *
౪. కంది శంకరయ్య
    (సూటిపోటి మాటలతో, తిట్లతో తల్లిదండ్రులను మానసికంగా చంపే కొడుకులను ఎందర్ని చూడడం లేదు. వాళ్లకు తిండి పెట్టడానికి ఏడుస్తారు కాని తాము మాత్రం సుఖభోజనం చేస్తుంటారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకొని.....)
    నరకమునఁ ద్రోయఁబడును మానసికముగను
    పితరుని వధించి తినునట్టి సుతుఁడె; హితుఁడు
    గా మెలంగి వృద్ధాప్యపు కష్టములను
    తొలఁగఁ జేసిన స్వర్గమ్ము దొరుకుఁ గాదె!
*     *     *     *     *     *
౫. గుండు మధుసూదన్ గారి పూరణ.....
    వేఁట నెపమున వని కేఁగి వెంట సుతుని
    నిడుకొనియు నొక్క కిటిఁ జూచి “కొడుక! దానిఁ
    జంపి మాంసమ్ముఁ దిను” మన, సమ్మతించి
    పితరుని; వధించి తినునట్టి సుతుఁడె హితుఁడు.

*     *     *     *     *     *
౬. పండిత నేమాని
    పితరు డొక కవి, యాతని సుతుడు పద్య
    రచన నూనుచును “సమస్యల నిడు” డనుచు
    నడుగ విసుగొంది యా తండ్రి యనియె నిట్లు
    “పితరుని వధించి తినునట్టి సుతుడె హితుడు”
*     *     *     *     *     *
౭. రాజేశ్వరి నేదునూరి
    కన్ను మిన్ను గానక తిరుగాడుచుండి
    కన్న వారిని మరచిన కఠిను డగుచు
    గుండె రంపపు కోతను కోయు కంటె
    పితరుని వధించి తినునట్టి సుతుఁ డె హితుఁ డు !

*     *     *     *     *     *
౮. సహదేవుడు
రక్తదాహమ్ము మరిగిన రాక్షసులగు
దంపతులుగన్నహితుడైన తనయుడెవరు?
చిరుత పులిఁజీల్చి తాను రుధిరముఁద్రాపి
పితరులకు, వధించి తినునట్టిసుతుడె హితుడు!

*     *     *     *     *     *
౯. చంద్రమౌళి
    పంచభూతోద్భవము జూడ పదిలముగ
    అమల సూక్తి ‘అగ్నేరాప’ యన్వయింప
    జలము నిప్పును హతమార్చు జనకుడైన
    పితరుని వధించి తినునట్టి సుతుఁడె; హితుఁడు.
    కన్నడసమస్యకు నా పూరణం
    ಸಂದಿಹು ’ದಗ್ನೇರಾಪಃ’
    ಮೆಂದಾದಿಮನುಡಿ, ತದಗ್ನಿ ಪಿತನಾಗಲ್, ನೀರ್
    ಕೊಂದಾರಿಪುದೈ ಬೆಂಕಿಯ
    ತಂದೆಯನೇ ಕೊಂದು ತಿಂಬಸುತನತಿರಮ್ಯಂ

24 కామెంట్‌లు:

  1. కొమరు డెక్కడ యుండడు కువల యమున
    పితరునివ ధించి తిను నట్టి, సుతు డె హితుడు
    సత్ప్రవర్తన గలుగుచు సౌమ్యుడైన
    వాని జన్మము సఫలము వసుధ లోన .

    రిప్లయితొలగించండి
  2. కన్నవారిని పనివారిగా దలంచి
    దూషణంబులు చేయుచు దుష్టుడగుచు
    బాధపెట్టుచు నుండెడివాని కన్న
    పితరుని వధించి తినునట్టి సుతుడె హితుడు.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ పండిత నేమాని గారికి ,గురువు గారికి ధన్యవాదములు

    డా. ఏల్చూరి వారి కవితాంబుధిలో తడిసి తనువు పులకరించె , మీ వంటి వారు ఈ బ్లాగులో ప్రతి నిత్యము పూరణ జేసి మాకు మార్గనిర్దేశ్యము జేయ ప్రార్థన . మీకు,కవిపుంగవులందరికి పాదాభివందనము జేయుచూ

    ---------

    నేటి వార్త : మద్యము సేవించుటకు డబ్బులివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు

    మత్తులో మునిగి దిరుగు మాన హీను

    లకు , పరులను హింసించెడి రాక్షసులకు ,

    కలియుగపు ఖలులకు నేటి కౌరవులకు

    పితరుని వధించి తినినట్టి సుతుడె హితుడు .

    రిప్లయితొలగించండి
  4. శ్రీ పండిత నేమాని గారికి ,గురువు గారికి ధన్యవాదములు

    డా. ఏల్చూరి వారి కవితాంబుధిలో తడిసి తనువు పులకరించె , మీ వంటి వారు ఈ బ్లాగులో ప్రతి నిత్యము పూరణ జేసి మాకు మార్గనిర్దేశ్యము జేయ ప్రార్థన . మీకు,కవిపుంగవులందరికి పాదాభివందనము జేయుచూ

    ---------

    నేటి వార్త : మద్యము సేవించుటకు డబ్బులివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు

    మత్తులో మునిగి దిరుగు మాన హీను

    లకు , పరులను హింసించెడి రాక్షసులకు ,

    కలియుగపు ఖలులకు నేటి కౌరవులకు

    పితరుని వధించి తినినట్టి సుతుడె హితుడు .

    రిప్లయితొలగించండి
  5. కవిమిత్రులకు నమస్సులు!
    ఈనాటి సమస్య ఇబ్బందికరంగానే ఉంది.
    దీనిని పంపిన చంద్రమౌళి గారు “రోజూ సులభమైన సమస్యలనే ఇస్తున్నారు. ఈసారి క్లిష్టమైన సమస్య ఇచ్చిచూద్దాం” అన్నారు. ముందు వెనుకలు ఆలోచించకుండా సమస్యను ప్రకటించాను. పూరిద్దామని ఎన్ని రకాలుగా ఆలోచించినా ఏ ఆధారమూ దొరకడం లేదు. ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే పూరణలను పంపారు. చూద్దాం... సాయంత్రం వరకు!

    రిప్లయితొలగించండి
  6. (సూటిపోటి మాటలతో, తిట్లతో తల్లిదండ్రులను మానసికంగా చంపే కొడుకులను ఎందర్ని చూడడం లేదు. వాళ్లకు తిండి పెట్టడానికి ఏడుస్తారు కాని తాము మాత్రం సుఖభోజనం చేస్తుంటారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకొని.....)

    నరకమునఁ ద్రోయఁబడును మానసికముగను
    పితరుని వధించి తినునట్టి సుతుఁడు; హితుఁడు
    గా మెలంగి వృద్ధాప్యపు కష్టములను
    తొలఁగఁ జేసిన స్వర్గమ్ము దొరుకుఁ గాదె!

    రిప్లయితొలగించండి
  7. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    వేఁట నెపమున వని కేఁగి వెంట సుతుని
    నిడుకొనియు నొక్క కిటిఁ జూచి “కొడుక! దానిఁ
    జంపి మాంసమ్ముఁ దిను” మన, సమ్మతించి
    పితరుని; వధించి తినునట్టి సుతుఁడె హితుఁడు.

    రిప్లయితొలగించండి
  8. మాస్టారూ, ఈ రోజు సమస్యని కన్నడం నుంచి క్రింది రకంగా అనువదిస్తే బాగుండేదేమో. చంపుకు తినటం అనే నానుడికి తగ్గట్లుగా పూరించే వీలుకలిగేది. “వధించి తినునట్టి “ కొంత ఇబ్బంది కరంగానే అనిపిస్తోంది.
    . తండ్రిఁ చంపుకు తినువాఁడె తనయుడౌర

    రిప్లయితొలగించండి
  9. చంద్రశేఖర్ గారూ,
    నిజమే! నాకా కన్నడం రాదు. చంద్రమౌళి గారు అనువదించిన విధంగానే ఇవ్వడం జరిగింది. వారేమో తమకు తెలుగు అంతగా రాదనే అన్నారు. ‘కాననివాని నూఁత గొని కాననివాఁడు విశిష్టవస్తువుల్ గానని భంగి’ అయింది.
    మీరు చెప్పింది చాలా బాగుంది. ఇదే ఇచ్చి ఉంటే ఈసమయానికి పది కంటే ఎక్కువ పూరనలు వచ్చి ఉండేవి. కానీ ఇప్పుడేం చేయగలం.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. పోన్లెండి, మాస్టారూ. గతం గత: మీకు భవిష్యత్తులో కన్నడం నుంచి తెలుగుకి అనువాదం కావాలంటే నావంతు సహాయం చేయగలవాడను.

    రిప్లయితొలగించండి
  11. పితరు డొక కవి యాతని సుతుడు పద్య
    రచన నూనుచును సమస్యలనిడు డనుచు
    నడుగ విసుగొంది యా తండ్రి యనియె నిట్లు
    పితరుని వధించి తినునట్టి సుతుడె హితుడు

    రిప్లయితొలగించండి
  12. కన్ను గానక దిరుగుచు మిన్ను పైన
    కన్న వారిని మరచిన కఠిను డగుచు
    గుండె రంపపు కోతను కోయు కంటె
    పితరుని వధించి తినునట్టి సుతుఁ డె హితుఁ డు !

    రిప్లయితొలగించండి
  13. సుబ్బారావు గారూ,
    క్లిష్టమైన సమస్యకు చాలా వేగంగా చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    ‘నేటి కౌరవుల’ గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    తండ్రి ఆజ్ఞపై మాంసం తిన్న సుతుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీలో ఇంతటి హాస్యధోరణి చూడడం ఇదే ప్రథమం. హాయిగా తృప్తిగా నవ్వుకున్నాను మీ పూరణ చూసి. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి పాదం కొద్దిగా మార్చాను.

    రిప్లయితొలగించండి
  14. రక్త దాహులైనరాక్షస వృద్ధదం
    పతుల యోగ్యుడైనసుతుడెవరన?
    జంతుజాలములను గొంతు జీల్చిత్రాపి
    పితరులకు, వధించి తినునట్టి సుతుడె హితుడు!

    రిప్లయితొలగించండి
  15. సహదేవుడు గారూ,
    మన్నించాలి!
    సమస్య తేటగీతిలో ఉంటే మీరు మొదటి, రెండవ పాదాలను ఆటవెలది వ్రాసారు. ఇక అన్వయం కుదరడం లేదు. సవరించి పంపండి.

    రిప్లయితొలగించండి
  16. పంచభూతోత్ప త్తినిజూడ పదిలముగ
    అగ్నేరాపః యను సూక్తి యన్వయింప
    జలము నిప్పును హతమార్చు జనకుడైన
    పితరుని వధించి తినునట్టి సుతుఁడె; హితుఁడు
    కన్నడసమస్యకు నా పూరణం

    ಸಂದಿಹು ’ದಗ್ನೇರಾಪಃ’
    ಮೆಂದಾದಿಮನುಡಿ, ತದಗ್ನಿ ಪಿತನಾಗಲ್, ನೀರ್
    ಕೊಂದಾರಿಪುದೈ ಬೆಂಕಿಯ
    ತಂದೆಯನೇ ಕೊಂದು ತಿಂಬಸುತನತಿರಮ್ಯಂ

    పదిసంవత్సరాలకూ వెనుక, జోస్యం సదానంద శాస్త్రుల కన్నడ అవధానంలో విద్వన్మణి శ్రీ రంగనాథశర్మగారు ఇచ్చిన సమస్య, ఈ సమస్యకు ఆధారం. పంచభూతముల ఆధారమైన ఈ పూరణానికి స్ఫూర్తి విద్వాన్ శ్రీ రంగనాథ శర్మవారి పూరణం. సదానంద శాస్త్రులు, బ్రహ్మశిరోఘాతముజేసిన శివునికి బొలిచి పూరణంచేశారు. శతావధాని శ్రీ గణేశ్ గారు వేరేవిధాముగ చెప్పిన పూరణసూచన ఇది : మనస్సున బుట్టిన మన్మథుడు మనస్సునే చంపి తింటాడుగా !

    రిప్లయితొలగించండి
  17. చంద్రమౌళి గారూ,
    సవివరంగా, సమర్థవంతంగా వివరణ ఇచ్చి చక్కని పూరణ చేశారు. అభినందనలు. మీరు ఉభయభాషాకవిమిత్రులు.
    మొదటి పాదంలో ‘భూతోత్పత్తి’, రెండవ పాదంలో ‘అగ్నేరాపః’ అన్నచోట్ల గణదోషం. ‘పంచభూతోద్భవము జూడ’ అనీ, ‘అలఘుసూక్తి అగ్నేరాపః యన్వయించి’ అని సవరిద్దామా?

    రిప్లయితొలగించండి
  18. శంకరయ్యగారు,

    ధన్యవాదాలు. సవరణకు మీకు సర్వహక్కులూ ఉన్నాయి.

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  19. శంకరయ్య గారూ,

    ఈ సమస్యలాగే ఉన్న ఇంకొటిని ఇప్పుడే మీ అవగాహనకు పంపించాను.

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  20. శ్రిగురుభ్యోనమః
    సవరించిన పద్యం

    రక్తదాహమ్ము మరిగిన రాక్షసుడగు

    తండ్రి గన్నట్టి హితుడైన తనయుడెవరు?

    జంతు జాల రక్తమ్ముతో శాంత పఱచి

    పితరుని, వధించి తినునట్టిసుతుడె హితుడు!

    రిప్లయితొలగించండి