శ్యామలీయం గారు ' అయెన్ ' సలక్షణమే కానీ శబ్దం కృతకమైనదంటూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు కానీ ' ఆయెన్ ' లేదా ' అయ్యెన్ ' తప్ప అయెన్ కు ఆ ప్రతిపత్తి లేదని నాకు తెలిసిన విషయం లోగడ ఈ వేదిక మీద చెప్పిన సంగతి . కాలక్రమేణా ఈ ' అయెన్ ' , లేదా ' అయె ' ఎలాగో ఛందస్సు కోసమో మరేలాగానో పద్యాలలోకి ప్రవేశించాయి , సూత్రం తెలిసిన తరువాత , నేటికాలానికి అనుగుణంగా అందరూ వాడుతున్నారు కాబట్టి మేము కూడా వాడుతాము అనడంలో తప్పేం లేదు అని నా భావన .
మంద పీతాంబర్ గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * శ్యామలీయం గారూ, పరమపదసోపానపటం అంతరార్థాన్ని చక్కగ వివరిస్తూ ఒక సుందరమైన ఖండికనే వ్రాసారు. చాలా బాగుంది. అభినందనలు. * డా. విష్ణునందన్ గారూ, ధన్యవాదాలు. * పండిత నేమాని వారూ, ప్రస్తావనగా ఆనందమయీ స్తోత్రం చెప్పి తరువాత పరమపదసోపానపటాన్ని చక్కగా విశ్లేషించారు. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. ‘జలజాక్షుని’ అనడంలో టైపాటు దొర్లినట్లుంది!
పండిత నేమాని వారూ,. మీ పద్యంలోని సందేశాన్ని గురూపదేశంగా భక్తిపూర్వకంగా స్వీకరిస్తున్నాను. ధన్యవాదాలు. * చంద్రశేఖర్ గారూ, ఉచ్చనీచదశలను గురించిన సూచన మీ పద్యంలో గోచరిస్తున్నది. చాలా మంచి పద్యం. అభినందనలు. * మధుసూదన్ గారూ, మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
శంకరయ్యగారూ, ఈ రోజు ఇక్కడ నేను వ్రాసిన పద్యాలు, వాటి ఆధారంగా అనుకోండి ఒక పాటా నా శ్యామలీయం బ్లాగులో ప్రచురించాను. చూడండి: http://syamaliyam.blogspot.in/2012/07/blog-post_6992.html
మాస్టారూ, ఈ మధ్య అబద్ధం అని ఒక సినిమా వచ్చింది. మీరు చూడకపోతే తప్పక చూడండి. నెట్ లో దొరుకుంది. బాలచందర్ అద్భుతంగా తీశాడు. వైకున్ఠపాళీ ప్రతిరూపంగా సినిమా చూపించాడు.
నిచ్చెన లల్పము, పాములు
రిప్లయితొలగించండిహెచ్చుగ నున్నట్టి బ్రతుకె యిటు క్రీడ యయెన్
మెచ్చైన యాటగాడవు
వచ్చితిఁ జొచ్చితి శరణము పాలింపు హరీ!
చూపితె బ్రతుకు పరమపద
సోపాన పట మ్మటంచుఁ జొక్కితి నేనీ
పాపపు పాములఁ జిక్కితిఁ
జూపుము నిచ్చెనలఁ బుణ్యశోభ చెలంగన్.
శంకరార్యా ! "మెచ్చైన యాటగాడి" ప్రయోగంతో చేసిన మీ పద్యములు చాలా బాగున్నవి.
రిప్లయితొలగించండిపదములు తడబడును,"పరమ
రిప్లయితొలగించండిపద సోపానపటము" పలు పాముల మయమై,
మదిలోశ్రీహరినమ్ముచు
ముదముననిచ్చెనలనెక్క ముక్తిలభించున్ !!!
నిచ్చెన లెక్కిన యప్పుడు
రిప్లయితొలగించండిమెచ్చని పాములె మనలను మెక్కిన యపుడున్
హెచ్చుగ నవ్వక నొవ్వక
రెచ్చుచు నాడంగ గెలుపు లిచ్చును హరియే.
శంకరయ్యగారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు రెండూ బాగున్నాయి.
'క్రీడ యయెన్' అన్నప్రయోగం సలక్షణమే కానీ కొంచెం కృతకంగా ఉన్నట్లుందండీ.
అరిషడ్వర్గము పాములు
రిప్లయితొలగించండినరుదగు నధ్యాత్మసాధనలు నిచ్చెనలున్
మరి వైరాగ్యము భక్తియు
సరిపడు పావులును నాట జరిగెడు నుర్విన్ ౧
నా పావులు మంచివయా
నాపైనను నాకు కలదు నమ్మకము హరీ
నీపై నాన పరమపద
సోపానపఠంబు మీద చూపెదప్రజ్ఞన్ ౨
ఈ నిచ్చెనలును పాములు
నే నెక్కుట దిగుట క్రొత్త యే పరమాత్మా
నా నిశ్ఛయమే పై బరి
లో నుండిన నిన్ను చేర్చు లోలాక్ష హరీ! ౩
నే నిను చేరుటయును మరి
నీ నిశ్చయమనుచు లోన నెరుగుదు గానన్
మానక పాముల నణచుచు
చేనందుచు నిచ్చెనలను చేరేదను హరీ! ౪
ఈ నిచ్చెనలును పాముల
తో నీ పటమెల్ల మాయ తొలగి నశించున్
గాన మహాత్మా చేరక
మానెదనే నిన్ను బుధ్ధిమంతుడ నగుచున్ ౫
శ్యామలీయం గారు ' అయెన్ ' సలక్షణమే కానీ శబ్దం కృతకమైనదంటూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు కానీ ' ఆయెన్ ' లేదా ' అయ్యెన్ ' తప్ప అయెన్ కు ఆ ప్రతిపత్తి లేదని నాకు తెలిసిన విషయం లోగడ ఈ వేదిక మీద చెప్పిన సంగతి . కాలక్రమేణా ఈ ' అయెన్ ' , లేదా ' అయె ' ఎలాగో ఛందస్సు కోసమో మరేలాగానో పద్యాలలోకి ప్రవేశించాయి , సూత్రం తెలిసిన తరువాత , నేటికాలానికి అనుగుణంగా అందరూ వాడుతున్నారు కాబట్టి మేము కూడా వాడుతాము అనడంలో తప్పేం లేదు అని నా భావన .
రిప్లయితొలగించండిపండిత నేమాని వారి పద్యములు....
రిప్లయితొలగించండినా రచన ఆనందమయి అను స్తోత్రము నుండి:
నిచ్చెనలు పాములుంగల
ముచ్చట లేవియును వద్దు బుద్ధిబలముతో
నిచ్చలు నిను సేవించెడు
నచ్చపు జీవితము నీయు మానందమయీ!
ఈనాటి పద్య రచన:
పరమపదంపు సోపానపటమ్మది
చూడ ముచ్చటగూర్చు చోద్యమయము
కలవందు నిచ్చెనల్ కలవెన్నొ పాములు
మజిలీ లనేకముల్ మార్గమందు
యోగ సాధకుల నత్యూహలలో దేల్చు
నిచ్చెనల్ మోదంబు నిచ్చుచుండు
భీకరాకరులౌ కాకోదరంబులు
కబళించుచుండి దుర్గతులనిచ్చు
ఆడుచుండి వారి యాటలో యోగంబు
బట్టి ముందు వెనుక పడుట యగును
భద్రములను గనుచు వైకుంఠ పాళిలో
పరమపదము చేరవచ్చు లెస్స.
ఈ ఆట మనకు తెలిపేదేమనగా:
రిప్లయితొలగించండిగెలుపును మఱి యోటమియును
గలిగిన జన్మమున మాయ కమ్మును నరుడా!
జలజాక్షును జేరు వరకు
నలుపెఱుగక నాడవలయునంచును దెలుపున్.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
శ్యామలీయం గారూ,
పరమపదసోపానపటం అంతరార్థాన్ని చక్కగ వివరిస్తూ ఒక సుందరమైన ఖండికనే వ్రాసారు. చాలా బాగుంది. అభినందనలు.
*
డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు.
*
పండిత నేమాని వారూ,
ప్రస్తావనగా ఆనందమయీ స్తోత్రం చెప్పి తరువాత పరమపదసోపానపటాన్ని చక్కగా విశ్లేషించారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
‘జలజాక్షుని’ అనడంలో టైపాటు దొర్లినట్లుంది!
శ్రీ శంకరయ్య గారూ! నమస్కృతులు.
రిప్లయితొలగించండిమీ పద్యము చూచాక నేనొక పద్యముతో సూచన చేద్దామనుకొనినాను.
పాపము పున్నెముల మరచి
దీపించెడు జ్ఞానయోగ తేజములోనన్
సోపానమ్ముల నెక్కుము
తాపముడిగి నీదు జన్మ ధన్యత గాంచున్
స్వస్తి.
రివ్వున గవ్వలు విసరుచు
రిప్లయితొలగించండిచివ్వున నిచ్చెనల నేరి చెలరేగుమురా,
దవ్వుల దాగిన పాములు
నెవ్వరి నెపుడైన కరచు హెచ్చరిక సుమా!
గుండు మధుసూదన్ గారి పద్యములు.....
రిప్లయితొలగించండికం.
నిముసమునఁ బాము దిను, మఱు
నిముసము నిచ్చెనల నెక్కు నిక్కపు నాటన్
శ్రమ పడి యాడుచు నుండఁ, బ
రమ పద సోపాన పటము రాగిలు చుండున్! (1)
కం.
సుమతులకు నాట యందున
సమ మగు నిశ్శ్రేణి తతులు, సర్ప కబళముల్!
గుమతులను బాము మ్రింగును:
గమనించఁగ నిచ్చెనలు 'న'కారమ్మె యగున్! (2)
తే.గీ.
ఇదియ 'వైకుంఠ పాళి' సహిష్ణుతఁ గని,
యాడ, వైకుంఠుఁ డెప్పుడు నైక్య మంద
నీయఁ డెంతయును ఘన పరీక్ష సేసి
పిదప నెగ్గించి, తన చెంత వేగఁ జేర్చు! (3)
ఆ.వె.
పిల్ల లాడు నాట, పెద్ద లాడెడి యాట,
నిచ్చెనలును బాము లిచ్చి పుచ్చు;
వారి వారి కర్మ పరిపాకమును బట్టి
ముందు వెనుకలుగను మోక్ష మొదవు! (4)
పండిత నేమాని వారూ,.
రిప్లయితొలగించండిమీ పద్యంలోని సందేశాన్ని గురూపదేశంగా భక్తిపూర్వకంగా స్వీకరిస్తున్నాను. ధన్యవాదాలు.
*
చంద్రశేఖర్ గారూ,
ఉచ్చనీచదశలను గురించిన సూచన మీ పద్యంలో గోచరిస్తున్నది. చాలా మంచి పద్యం. అభినందనలు.
*
మధుసూదన్ గారూ,
మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
శంకరయ్యగారూ,
రిప్లయితొలగించండిఈ రోజు ఇక్కడ నేను వ్రాసిన పద్యాలు, వాటి ఆధారంగా అనుకోండి ఒక పాటా నా శ్యామలీయం బ్లాగులో ప్రచురించాను.
చూడండి:
http://syamaliyam.blogspot.in/2012/07/blog-post_6992.html
శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు. మీ పద్యము బాగున్నది.
స్వస్తి.
శ్రీ గుండు మధుసూదన్ గారు మరియు శ్రీ శ్యామల రావు గారు మంచి ఖండికలు వ్రాసి బ్లాగుకి వన్నె తెచ్చిరి. శుభాభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండిమాస్టారూ,
రిప్లయితొలగించండిఈ మధ్య అబద్ధం అని ఒక సినిమా వచ్చింది. మీరు చూడకపోతే తప్పక చూడండి. నెట్ లో దొరుకుంది. బాలచందర్ అద్భుతంగా తీశాడు. వైకున్ఠపాళీ ప్రతిరూపంగా సినిమా చూపించాడు.
గలగల నవ్వులు రువ్వుచు
రిప్లయితొలగించండికిలకిల గడిముందు జేరి కాంతా మణులే
కులుకుచు నిచ్చెన లెక్కుచు
పలుకుల చిలుకల వలె పాముల నోటన్ !
గురువు గారు,
రిప్లయితొలగించండితప్పును సూచించినందుకు ధన్యవాదాలండి.