12, జులై 2012, గురువారం

దత్తపది - 22 (కరము - తరము - వరము - హరము)

కవిమిత్రులారా,

‘కరము - తరము - వరము - హరము’

పై పదాలను ఉపయోగించి

రాయబారానికి పోనున్న కృష్ణునిముందు ద్రౌపది ఆవేదనను గూర్చి

మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

18 కామెంట్‌లు:

 1. కలుష హర ముకుంద గమనించు నన్నిటు
  దుస్ససేను చర్య దుఃఖ కరము
  తరము గాదు నాకు దానిని మరువగా
  వరము నిమ్ము నాకు వాని చావు.

  రిప్లయితొలగించండి
 2. కరమవమాన మొందితిని కౌరవ నేతల చేత కండకా
  వరమును డుల్చి యుద్ధమున వారిని గూల్చుట యొప్పు, నిల్వగా
  తరమొకొ వార్కి నీ యెదుర తద్దయు నా హృది నగ్ని నార్పుమా
  హరముఖ దేవవంద్య! వలదయ్య మురాంతక! సంధి సూత్రముల్

  రిప్లయితొలగించండి
 3. తనకు యుద్ధమే సమ్మతమని కోరుతున్నట్లుగా...........

  కరములు మ్రోడ్చిమ్రొక్కెదను కాదనకయ్య మదీయ కోరికల్,
  వరములొసంగి కాచుమనివార్యము యుద్ధము, నాదుదేవ, యం
  తరము గ్రహింపుమోయి,నిశితంబగు బాణ పరంపరాగ్నిచే
  హర! మురళీధరా! హతమునందగజేయుము కౌరవాదులన్.

  రిప్లయితొలగించండి
 4. కరము త్వదీయవత్సలతఁ గాంచితి, పాండవపత్నినౌచు సుం
  దరతరమైన ధర్మమును దాల్చిన నాకు ముకుంద! కండకా
  వరమున దుస్ససేనుడు సభాసదులందరు చూడ కంససం
  హర! మునివంద్య! చేసిన మహాపకృతిన్ స్మరియించు మాతఱిన్(మచ్చటన్)

  రిప్లయితొలగించండి
 5. కరములనాతని చీల్చగ
  తరమా! అయిన నిపుడే కదనమున కేగు
  స్వరమున బల్కుము రక్తకు
  హర మంతయు నుడుకుచున్న దన్నా కృష్ణా!

  రిప్లయితొలగించండి
 6. దుస్స సేనుని చేష్టలు దుఃఖ కరము
  వాని గడ తేర్చి కాపాడు వాని నుండి
  హర ! ముకుంద !వరమది చేయంగ నిపుడు
  నీ క తరములె కావగ నిజము గాను

  రిప్లయితొలగించండి
 7. కరములు మోడ్చి వేడెదను కాళియ మర్దనుడైన కృష్ణ! నా
  తరమును గాదు, నేను మఱి ధాత్రినె? యోపగలేను, కండకా
  వరమును జూపు దుష్టతము బాలిట శాపమునౌదు, శోకమున్
  హరమును జేయు భర్తల సహాయము జేయగ రావె మాధవా!

  రిప్లయితొలగించండి
 8. తరమే కన్నయ్య నీకు
  కరము మోడ్చి వేడు కొంటి కారుణ్యమునన్ !
  వరమీయుము దీనను గని
  హరియిం చగ కలుషముల నంబు జనాభా !

  రిప్లయితొలగించండి
 9. నాపైమోపిన కరములు
  కోపంబునభీముఁజేతఁగూలు వివరముల్
  నాపతరముగాదనుచున్
  భూపతులప్రాణహరముముందేజెపుమా!

  రిప్లయితొలగించండి
 10. బంధకిని జేసినను నంధరాజుని ముందు | మానహరమును బాపి మానమొసగి
  జీవమునెబోసితివి, జీవింప తరమౌనె | భీషణ ప్రతినలను భీము మరచె
  తొడలు జూపినవాని యొడలు విరుగక, బ్రతుక |దుష్కరము దుఃఖమును దూరదోల
  వరమొ శాపమొ సంధి వాసుదేవ వినుము | నాపుత్రులే జాలు నన్నుగావ

  రిప్లయితొలగించండి
 11. గుండు మధుసూదన్ గారి పూరణ....

  కర మురు వేణి వట్టి, కడు $ గర్వముతోడుత వల్వ లూడ్చె ని
  ర్భరమున; సత్సభాంతరము $ భగ్గన, సిగ్గఱి కౌరవుల్ రమా
  వర! మురహంత! నాకుఁ దల $ వంపులు సేసిరి; వారి నొంచు మో
  హరమును బన్ని, సంధిఁ బరి $ హార్యము సేయుము; యుద్ధమే తగున్!

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులందరికి వందనాలు.
  నిన్న ఉదయం దత్తపది, పద్యరచనలను పోస్ట్ చేసి అత్యవసరంగా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. రోజంతా ఎక్కడా బ్లాగు చేసే అవకాశం దొరకలేదు. మళ్ళీ ఇల్లు చేరేసరికి రాత్రి 2 గం. అయింది. ప్రయాణపు టలసట వల్ల మీమీ పూరణలను, పద్యాలను చూడలేక పోయాను. ఈరోజు సాయంత్రం లోగా వాటిని పరిశీలించి నా వ్యాఖ్యలను పెడతాను. ఆలస్యానికి మన్నించండి.

  రిప్లయితొలగించండి
 13. వరమున బుట్టి పాండు నృప వంశము మెట్టిన నన్ను నేరికిన్
  తరమయె బ్రోవగా సభను తాతలు తండ్రులు జూడ మానమున్
  హరమొనరింపగా దలుప నక్కట నీకును గాక నయ్యెడన్
  కరము తలంపు మిద్ద్ది మది కంస నిషూదన సంధి జేయుచో.

  రిప్లయితొలగించండి
 14. వరమున నగ్నికుండమున వాసిగ బుట్టిన నాదు కేశముల్
  కరమున బట్టి యీడ్చె సభ,ఖర్వుడు ,దుష్టుడు ,దుస్ససేనుడున్
  తరమగునే భరింపగను దాలిమితో నవమాన మింక సం
  గరమున వాని జంపిననె గా హరమౌ మది నిండు క్రోధమున్ .

  రిప్లయితొలగించండి