23, జులై 2012, సోమవారం

సమస్యాపూరణం - 771 (మునిని సంహరించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మునిని సంహరించె ననిలసుతుడు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

8 కామెంట్‌లు:

  1. మాయచేసి యాశ్రమమ్మును నిర్మించి
    బలిగొనంగ దలచి వాయుసుతుని
    కపట తపమొనర్చు కాలనేమ్యాహ్వయ
    మునిని సంహరించె ననిల సుతుడు

    రిప్లయితొలగించండి
  2. పాండవులకు సతియు, పరమ పతివ్రతా
    మణియునై యలరెడు మగువఁ గోరి,
    తప్పు మాటలాడ; దా కీచకుడనధ
    మునిని సంహరించె ననిల సుతుడు.

    రిప్లయితొలగించండి
  3. వాయు సుతుని నవల వధియించ దలచిన
    కాల నేమి మారె కపట మునిగ
    యాశ్ర మంబు యొ ద్ద యా కపటు డయిన
    మునిని సంహ రించె ననిల సుతుడు

    రిప్లయితొలగించండి
  4. తల్లిసీత జాడ తనబాధ్యతగనెంచి
    దక్షిణమున వెదకఁ దగిలె లంక
    యడ్డుకొనగ లంకిణచ్చోటఁ,దలచి రా
    మునిని,సంహరించె ననిలసుతుడు!

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పూరణ....

    రావణుండుఁ బనుప రాక్షస మాయచేఁ
    గాలనేమి మాఱెఁ గపట మునిగ;
    ధాన్యమాలి వలన ధౌర్త్యమ్ము గ్రహియించి,
    మునిని సంహరించె ననిల సుతుఁడు!

    రిప్లయితొలగించండి
  6. సీత యడవు లందు సేవించె వాల్మీకి
    మునిని; ; సంహరించె ననిల సుతుడు
    వేల సేనలనని వివరించె రామాయ
    ణోత్తర రణ కాండ కథకు డుచిత రీతి!

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మంచి భావనతో పూరణ చేసారు. అభినందనలు.
    ‘కీచకుడను + అధముడు - కీచకుడను నధముడు’ అవుతుంది కాని సంధి లేదు. అలాగే ‘అధముని లేదా అధమునిన్’ అనవలసిందే కాని ‘అధమునిని అనరాదు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘మునిగన్ + ఆశ్రమ’ మునిగ నాశ్రమ అవుతుంది. అలాగే ‘ఆశ్రమంబు నొద్ద’ అనాలి లేదా ‘ఆశ్రమంబు వద్ద’ అందాం.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘లంకిణి + అచ్చోట = లంకిణి యచ్చోట’ అవుతుంది. యడాగమం రాదు. అలాగే రాముని, రామునిన్ అనవలసిందే కాని రామునిని అనరాదు.
    *
    మధుసూదన్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    చక్కని విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. గురువు గారు,
    సరేనండి.
    మీరు తమలపాకు ఉపయోగాలు తెలిపినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి