30, జులై 2012, సోమవారం

సమస్యాపూరణం - 778 (పాలు గాంచి పిల్లి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పాలు గాంచి పిల్లి పారిపోయె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

15 కామెంట్‌లు:

  1. నేటి ఈనాడు లో పాల కల్తీ "పాపాల పుట్ట" ను చూసి ఈ సమస్య ను ఇచ్సినట్లున్నారు..

    పాలు నీళ్ళ కల్తి పాత పధ్ధతి నేడు
    నీరు గారె పాల పేరు జూడ
    పాలు 'నిల్లు' గలుపు పాపాల పాల్గాని
    పాలు గాంచి పిల్లి పారిపోయె.

    రిప్లయితొలగించండి
  2. పాలు నీళ్ళు కలుపు పధ్ధతి పాతది
    నీరు గారె పాల పేరు నేడు
    పాలు 'నిల్లు' గలుపు పాపాల పాల్గాని
    పాలు గాంచి పిల్లి పారిపోయె.

    రిప్లయితొలగించండి
  3. ఎవరు చూడకుండ యింటిలో దూరుచు
    నంతలోన కుక్క అరచుట విని
    కుక్క నొకటి వెంట గొనితెచ్చు చున్న గో
    పాలు గాంచి పిల్లి పరిపోయె

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. ఒక్క యెలుక గాంచి గ్రక్కున దుమికెడు
    నంత లోన నాగె ముంత లోని
    పాలు గాంచి పిల్లి పారిపోయెను యెల్క
    బ్రతుకు జీవు డనుచు త్వరిత గతిని.

    రిప్లయితొలగించండి
  7. తెల్లనివవి పాలు నల్లనివవి నీర
    నెల్లవేళ తలచి తెల్లమొగము
    వేయుటన్న నిదియె వినుమచంద్రా! ఈత
    పాలు గాంచి పిల్లి పారిపోయె.

    రిప్లయితొలగించండి
  8. ఇంటిలోనిపిల్లియెలుకవేటమరువ
    వేడిపాలఁబెట్టవేట నేర్ప
    పాలుగాంచిపిల్లిపారిపోయెఁ!దిరిగి
    వేటలాడెనెలుకఁవిందుకొఱకు

    రిప్లయితొలగించండి
  9. కలుగు నుండి ఎలుక కలియ జూచుచువచ్చి
    చెలిమినొలక బోసి పిలిచె చెలిని
    ప్రణయచిత్త పరుగు పరుగునజన,మురి
    పాలు గాంచి పిల్లి పారిపోయె!!!

    రిప్లయితొలగించండి
  10. హాస్యచతురు డైన యా రామకృష్ణుండు
    వేడి వేడి పాలు పెట్ట,త్రాగి ,
    అయ్యొ ,మూతి కాల నరచుచు నటనుండి
    పాలు గాంచి పిల్లి పారిపోయె .

    రిప్లయితొలగించండి
  11. నీళ్ళ పాలు గనిన నీటుగా రాయంచ
    వేరు జేసి త్రాగు వేడ్క మీర
    విషము గలిపె నేని వేరుజేయ తరమే ?
    పాలు గాంచి పిల్లి పారి పోయె !

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    పాలు, పెరుఁగు, పెన్న భయము లేకను దిన,
    నింటి కాఁపు, పిల్లి యెంతయు భయ
    మందు విగ్గు స్వశిరమందుఁ దాల్చఁగ, జుల
    పాలు గాంచి, పిల్లి పాఱి పోయె!

    రిప్లయితొలగించండి
  13. కొండమూరి లక్ష్మీనరసింహం గారి పూరణ.....

    ప్రక్క యింటివారు మచ్చిక చేయగ
    తెచ్చినారు నల్ల మచ్చలున్న
    కుక్క నొకటి దాని కోరలను జుల
    పాల గాంచి పిల్లి పారిపోయె.

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    చక్కని విరుపుతో మీ పూరణ దాలా బాగుంది. అభినందనలు.
    ‘జీవుడ + అనుచు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ“జీవుడ యని’ అందాం.
    *
    చంద్రశేఖర్ గారూ,
    చమత్కారభరితమై మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    ఈ సమస్యను ఇస్తున్నంత సేపూ నాకు ఆ కథే మనసులో మెదిలింది. ఆ ప్రస్తావనతో ఎవరు పూరిస్తారా అని ఉత్కంఠతో ఎదురుచూసాను. ఎవరూ చెప్పకుంటే చివరికి నేను చెప్పాలనుకున్నాను.
    మీరు చెప్పారు. అదీ కమనీయంగా. ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీ నరసింహం గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
    మొదటి పాదంలో యతి తప్పింది. నిన్న కూడా ఇదే పొరపాటు జరిగింది. బహుశా మీరు ప-ఫ-బ-భ-మ లకు యతిమైత్రి ఉందనుకుంటున్నారేమో! మకారానికి మకారమే యతి చెల్లుతుంది. పు-ఫు-బు-భు-ము లకు, ంప-ంఫ-ంబ-ంభ లకు మాత్రమే యతి చెల్లుతుంది.
    మూడవపాదంలో ‘కోరలను జుల’ అన్నచోట గణదోషం. నా సవరణలతో మీ పద్యం....
    ప్రక్క యింటివారు యెక్కడినుండియో
    తెచ్చినారు నల్ల మచ్చలున్న
    కుక్క నొకటి దాని కోరలనున్ జుల
    పాల గాంచి పిల్లి పారిపోయె.

    రిప్లయితొలగించండి