3, జులై 2012, మంగళవారం

సమస్యాపూరణం - 752 (గురుపత్నిని గోరువాఁడె)

గురుపూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు!

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

గురుపత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్. 

కవిమిత్రుల పూరణలు

౧. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    గురుసేవయె విద్యార్థికి
    పరమార్థముగాన గురుని భావనలేవో
    కరుణం దెల్పుడటంచును
    గురుపత్నిని గోరువాడె గుణవంతు డగున్.
*     *     *     *     *     *
౨. పండిత నేమాని
    “పొరపాటు జరిగెనమ్మా!
    పరితాపముతోడ నాదు ప్రార్థన మిదియే
    గురువునకు దెలుపుమా” యని
    గురుపత్నిని గోరువాడె గుణవంతుడగున్
*     *     *     *     *     *
౩. కంది శంకరయ్య
(1)
    చొరఁబడె నాశ్రమ మందున
    వరశార్దూలమ్ము, దాని బారిన్ బడకన్
    త్వరగా తలుపులు వేయఁగ
    గురుపత్నిని గోరువాడె గుణవంతుఁ డగున్.
(2)
    గురుదక్షిణ నిడఁ బోవఁగ
    గురు వేమొ తిరస్కరించెఁ, గోరుము నీ య
    క్కర యేమొ తీర్చెద ననుచు
    గురుపత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్.
*     *     *     *     *     *
౩. చంద్రమౌళి
(1)

    గురుదక్షిణ వలదని స-
    ద్గురు నిరసిల పట్టుబట్టి కోర, విముఖుడై
    సిరులన్ స్వీకృతిగొమ్మని
    గురుపత్నిని గోరువాడె గుణవంతుఁ డగున్.

(2)
    మరణించిన తన తల్లిని
    స్మరియించుచు మాతృపూజ సరణిగజేయన్
    సరియైన వేల్పు వీవని
    గురుపత్నిని గోరువాడె గుణవంతుఁ డగున్.
*     *     *     *     *     *
౪. గోలి హనుమచ్ఛాస్త్రి
    తిరుగక పార్టీలనుచును
    చిరు ప్రాయపు పిల్లల నిక చేకొని ముద్దుల్
    మురిపెము లిమ్మని పైకి నె
    గురు పత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్.

*     *     *     *     *     *
౫. గుండు మధుసూదన్
(1)
    గురువు దివి కేగె, శిష్యుం
    డురు గతి హరుఁ గోరి తపము  నుగ్రతఁ జేయన్,
    వరమిడ, దివికిని బొమ్మని
    గురుపత్నిని గోరు వాఁడె గుణవంతుఁ డగున్.
(2)
    ఇరువురు వేదాంతులు; ము
    గ్గురు సంగీత విదు; లైదుగురు విద్వాంసుల్;
    చిర మవివాహితులే పదు
    గురు; పత్నిని గోరు వాఁడె గుణవంతుఁ డగున్.

*     *     *     *     *     *
౬. సుబ్బారావు
    నరకము లోనికి బోవును
    గురు పత్నిని గోరువాడె, గుణవంతుడగున్
    నిరతము మంచిని జేసిన
    నరయంగా శివుని గొల్వ యబ్బును శుభముల్.
*     *     *     *     *     *
౭. కందుల వరప్రసాద్
    గురు దక్షిణగా నిచ్చిరి
    పరిపరి విధముల ఫలములు బసిడి బహుమతుల్
    పరివారము తోడుగ , నం
    దరి కంటె కడు విలువైన దక్షిణ కొరకై.

    సరియగు నుపాయ మిచ్చిన
    గురువుల ప్రియశిష్యు డగుదు కురువంశమునన్
    గురి తోడ దెలుపుమా యని
    గురుపత్నిని గోరువాడె గుణవంతుడగున్.

*     *     *     *     *     *     *
౮. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    (ఇటీవలికాలం దృష్ట్యా, వ్యంగ్యంగా)
    అరె సాఫ్టు వేరు పిల్లట
    మరి కాసుల వర్షమనుచు మాయనబడి చి
    ల్లరమల్లర చిట్టి -తలపొ
    గురు--పత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్.
*     *     *     *     *     *     *
౯. రాజేశ్వరి నేదునూరి
    గురువు నెడ భక్తి నిండుగ
    పరిచర్యలు సలుపుచుండి పరమప్రీతిన్ !
    సరియగు దక్షణ నీయగ
    గురుపత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్ !

*     *     *     *     *     *     *
౧౦. గుండా సహదేవుడు
    గురువేదైవంబని తా
    నిరతముసేవించివిద్యనేర్చెడువాడై
    సరిసేవ జేతు మీకని
    గురుపత్నినిఁగోరువాడు గుణవంతుడగున్.

*     *     *     *     *     *     *
౧౧. సహదేవుడు
    కురుసంగ్రామము జరిగినఁ
    జెఱు పని సుయోధనునకుఁ జెప్పుము తల్లీ!
    పరివారముఁ గావు మనుచున్
    గురుపత్నినిఁ గోరువాడు గుణవంతుడగున్.
    (కురుపత్ని=భానుమతి)
 

32 కామెంట్‌లు:

 1. గురుసేవయె విద్యార్థికి
  పరమార్థముగాన గురుని భావనలేవో
  కరుణం దెల్పుడటంచును
  గురుపత్నిని గోరువాడె గుణవంతు డగున్.

  రిప్లయితొలగించండి
 2. పొరపాటు జరిగెనమ్మా!
  పరితాపముతోడ నాదు ప్రార్థన మిదియే
  గురువునకు దెలుపుమాయని
  గురుపత్నిని గోరువాడె గుణవంతుడగున్

  రిప్లయితొలగించండి
 3. చొరఁబడె నాశ్రమ మందున
  వరశార్దూలమ్ము, దాని బారిన్ బడకన్
  త్వరగా తలుపులు వేయఁగ
  గురుపత్నిని గోరువాడె గుణవంతుఁ డగున్.

  రిప్లయితొలగించండి
 4. గురుదక్షిణ నిడఁ బోవఁగ
  గురు వేమొ తిరస్కరించెఁ, గోరుము నీ య
  క్కర యేమొ తీర్చెద ననుచు
  గురుపత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్.

  రిప్లయితొలగించండి
 5. గురుదక్షిణ వలదని స-
  ద్గురు నిరసిల పట్టుబట్టె వరవిముఖుండై
  సిరులన్ స్వీకృతిగొమ్మని
  గురుపత్నిని గోరువాడె గుణవంతుఁ డగున్.

  రిప్లయితొలగించండి
 6. తిరుగక పార్టీలనుచును
  చిరు ప్రాయపు పిల్లల నిక చేకొని ముద్దుల్
  మురిపెము లిమ్మని పైకినె
  గురు పత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్.

  రిప్లయితొలగించండి
 7. సత్యనారాయణ మూర్తి గారూ,
  గురువు గుణాలు తెలుసుకోవాలంటే గురుపత్నిని ఆశ్యయించడమే మేలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  తన తప్పులు మన్నించమని గురుపత్నితో ‘సిఫారసు’ చేయించడం బాగుంది. ఉత్తమమైన పూరణ. అభినందనలు.
  *
  చంద్రమౌళి గారూ,
  మనమిద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది. చిత్రం! మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో యతి తప్పింది. సవరించాను.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. గుండు మధుసూదన్ గారి పూరణలు....
  (1)
  గురువు దివి కేగె, శిష్యుం
  డురు గతిఁ దపము హరుఁ గోరి యుగ్రతఁ జేయన్,
  వరమిడ, దివికిని బొమ్మని
  గురుపత్నిని గోరు వాఁడె గుణవంతుఁ డగున్.

  (2)
  ఇరువురు వేదాంతులు; ము
  గ్గురు సంగీత విదు; లైదుగురు విద్వాంసుల్;
  చిర మవివాహితులే పదు
  గురు; పత్నిని గోరు వాఁడె గుణవంతుఁ డగున్.

  రిప్లయితొలగించండి
 9. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణలూ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. శంకరయ్య గారూ.

  మీరు సూచించినది రెండవపాదంకదా, ద్గురు నిరసిల పట్టుబట్టె వరవిముఖుండై.. ఇక్కడ గురు మరియు వర.. ప్రాసయతికాదా?

  రిప్లయితొలగించండి
 11. నరకము లోనికి బోవును
  గురు పత్నిని గోరు వా డె, గుణ వంతు డ గు న్
  నిరతము మంచిని జేసిన
  నర యం గా శివుని గొల్వ యబ్బును మంచిన్ .

  రిప్లయితొలగించండి
 12. మరణించిన తన తల్లికి
  స్మరణికగా మాతృపూజ సరణిగజేయన్
  సరియైనవేల్పుమీరని
  గురుపత్నిని గోరువాడె గుణవంతుఁ డగున్.

  రిప్లయితొలగించండి
 13. గురువు గారికి ధన్యవాదములు
  ------------
  గురు దక్షిణగా నిచ్చిరి
  పరిపరి విధముల ఫలములు బసిడి బహుమతుల్
  పరివారము తోడుగ , నం
  దరి కంటె నతివిలువైన దక్షిణ గొరకై
  సరియగు నుపాయ మిచ్చిన
  గురువుల ప్రియ శిష్యుడ గుదు కురువంశమునన్
  గురి తోడ దెలుపుమా యని
  గురు పత్నిని గోరు వాడె గుణవంతుడగున్

  రిప్లయితొలగించండి
 14. అయ్యా శ్రీ చంద్రమౌళి గారూ! శుభాశీస్సులు.
  "ప్రాసయతి" కందపద్యములో వాడరాదు. ప్రాసలేని పద్యములలో మాత్రమే ప్రాసయతిని వాడుకొనవచ్చును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. అయ్యా శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు. మీ పద్యములు బాగున్నవి.
  విలువ అనునది తెలుగు పదము. దానికి అతి అను సంస్కృత పదమును చేర్చి సమాసము చేయరాదు. కడు విలువైన అని వాడండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. పండిత నేమని గారూ,

  ప్రాసయతి నియమ మితులను తెలుపినందుకు ధన్యవాదం. మీకు గురుపూర్ణిమ నమస్సుమాంజలులు.

  రిప్లయితొలగించండి
 17. సుబ్బారావు గారూ,
  చక్కని విరుపుతో మంచి పూరన చెప్పారు. అభినందనలు.
  *
  చంద్రమౌళి గారూ,
  మంచి భావంతో అలరారుతున్నది మీ రెండవ పూరణ. అభినందనలు.
  ‘స్మరణిక’ అనే శబ్దం లేదు. ‘స్మరణి’ అంటే రుక్రాక్షమాల. అందువల్ల స్వల్పంగా మార్చాను.
  *
  వరప్రసాద్ గారూ,
  పండిత నేమాని మెచ్చుకోలు పొందినందుకు అభినందనలు.
  వారి సూచన మేరకు ‘కడు విలువైన’ అని సవరించాను.

  రిప్లయితొలగించండి
 18. గురుతుల్యులు పండిత, శం
  కరులుభయుల కావ్యసేవ కమనీయమహో
  చరణములకిదెయే మ్రొక్కులు
  గురుపూర్ణమి శుభమొసంగి కూర్చగ సుఖముల్

  రిప్లయితొలగించండి
 19. ఇటీవలికాలం దృష్ట్యా, వ్యంగ్యంగా:
  అరె సాఫ్టు వేరు పిల్లట
  మరి కాసుల వర్షమనుచు మాయనబడి చి
  ల్లరమల్లర చిట్టి -తలపొ
  గురు--పత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్

  రిప్లయితొలగించండి
 20. గురువు యెడ భక్తి నిం డుగ
  పరి చర్యలు సలుపు చుండి పరమ ప్రీతిన్ !
  సరియగు దక్షణ నీయగ
  గురు పత్నిని గోరువాఁ డె గుణ వంతుఁ డగున్ !

  రిప్లయితొలగించండి
 21. చంద్రమౌళి గారూ,
  ధన్యవాదములు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణలోని చమత్కారం అదిరింది. మనోరంజకమైన పూరణ. అభినందనలు.
  కానీ ‘తలపొగురు’ అనేది వ్యావహారికం కూడా కాదు. గ్రామ్యం. అయినా పూరణలో మీ చమత్కారం ముందు అంది గణనీయం కాదు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ అన్ని విధాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. గురువేదైవంబని తా
  నిరతముసేవించివిద్యనేర్చెడువాడై
  సరిసేవ మీకు జేతని
  గురుపత్నినిఁగోరువాడు గుణవంతుడగున్

  రిప్లయితొలగించండి
 23. మాస్టారూ, చమత్కారాన్ని ఆస్వాదించారు. అది చాలు. నిజమే, తలపొగురు అనే పదం ఒంగోలు, నెల్లూరు జిల్లాలలో తెగవాడతారు. అది గ్రాంధికం కాదని అనిపించినా హాస్యోక్తి కోసం వేసేశాను.

  రిప్లయితొలగించండి
 24. కురుసంగ్రామము జరిగినఁ
  జెఱుపనిసుయోధనునకుఁజెప్పుము తళ్ళీ!
  పరివారముఁగావుమనుచున్
  గురుపత్నినిఁగోరువాడుగుణవంతుడగున్
  (కురుపత్ని=భానుమతి)
  మము బ్రోవుమనిఁజెప్పవే..అనే మాదిరి

  రిప్లయితొలగించండి
 25. సహదేవుడు గారూ,
  నిన్న ఉదయం గుండు మధుసూదన్ గారితో ఫోన్‌లో మాట్లాడినప్పుడు ‘కురుపత్ని’ని స్వీకరించి మా యిద్దరిలో ఎవరో ఒకరం పూరణ చెప్పాలనుకున్నాం. కాని కారణాంతరాల వల్ల వీలుకాలేదు. అదొక అసంతృప్తిగా మిగిలిపోయింది.
  ఇప్పుడు మీ పూరణ చూసాక ఆ అసంతృప్తి తొలగిపోయింది. ధన్యవాదాలు.
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘తల్లీ’ని ‘తళ్ళీ’ అన్నారు. మూడవ పాదంలో గణదోషం. చివరి ద్రుతాన్ని తొలగిస్తే సరి!

  రిప్లయితొలగించండి
 26. అరవల సాంబరు చట్నీ
  పరిపరి విధముల రసమ్ము పడిపడి తినుచు
  న్నరవక పచ్చడి, చింతచి
  గురు, పత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారూ,
   అద్భుతమైన విరుపుతో చక్కని పూరణ నందించారు. బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 27. అరెవో! చేయవె పప్పును!
  పరుగిడి తెచ్చితిని చూడు పండుగటంచున్;...
  తరుగుట కిచ్చుచు చింతచి
  గురు;...పత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్ 😊

  రిప్లయితొలగించండి


 28. పరమాపచారపు పలుకు
  ల,రభసలన్ చేయ మీకు లాభంబేమీ ?
  అరరె! తమకు తెలియనిదా
  గురు! పత్నిని గోరువాఁడె గుణవంతుఁ డగున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి