10, జులై 2012, మంగళవారం

పద్య రచన - 46


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.


కవిమిత్రుల పద్యములు

౧. మిస్సన్న
    రూపాయీ! భరతాంబకు
    పాపాయీ! లుబ్ధు కంటిపాపా! చోరుం
    జూపా! దాచెడు వారికి
    తీపా ! మరి లేని వారి తిప్పల కుప్పా!

*     *     *     *     *
౨. లక్ష్మీదేవి
    ధనమది యెంతగ వచ్చిన
    జనులకు తక్కువగఁ దోచు; సంపాదనయే
    మన జీవిత లక్ష్యమనుచు
    దినదినమును తిరుగుచుంద్రు, దెసదెసలందున్.
*     *     *     *     *
౩. పండిత నేమాని
    మనమారన్ దలతున్ శుభంకరి! మహామాయా స్వరూపాంచితా!
    ధనలక్ష్మీ! సకలార్థ దాయిని! నినున్ ధ్యానింతు నిత్యమ్ము న
    ర్చనలన్ సల్పుదు సర్వ విశ్వమునకున్ సామ్రాజ్ఞివీవే కృపా
    వనరాశీ! ధనమే ప్రధానమగు సర్వం విత్త సాధ్యం జగత్!

*     *     *     *     *
౪. గుండు మధుసూదన్
    పైస లోన నుండు పరమాత్ముఁ డిల లోన;
    ధనమె మూల మయ్యె ధరణి లోన;
    డబ్బు లేని వాఁడు డుబ్బుకుఁ గొఱ గాఁడు!
    కాన, గూడఁబెట్టఁ గలుగు సుఖము!!

    కులము గొప్పదైన; గోత్రోత్తముండైన;
    విద్య యున్న; సద్వివేకమున్న;
    ధనము గల్గు వాని దాసునిగా మాఱి,
    సతము సేవఁ జేయు నతఁడు, నిజము!

    రూపాయియె పరమార్థము;
    పాపములను జేసి యైనఁ బైసను బెంచన్
    దాపత్రయ పడుచుందురు;
    రూపాయీ, నీకు నతులు! ప్రోవుము నన్నున్!

*     *     *     *     *
౫. సుబ్బారావు
    రూపాయి కిలో బియ్యము
    నీ పాలన నున్న వరకు నిత్తురు కానీ
    నీ పథకము చివరి వరకు
    నాపాదితమగునె నిచట నార్ధిక మంత్రీ!
*     *     *     *     *
౬. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
    రూప్యమున కిక బియ్య మప్రాప్య మనిరి
    రూప్యమునకు పాలుపెరు గప్రాప్యము సరి
    రూప్యమున కిన్ని నీళ్ళైన నాప్య మనఁగ
    లేము, రూప్యమా! చాలిక లేచి పొమ్ము!

*     *     *     *     *
౭. హరి వేంకట సత్యనారాయణ మూర్తి

    రూపాయి

    జగముల కీవే మూలము
    నిగమంబుల పాఠనంబు నిత్యార్చనముల్
    భగవత్సేవలు నీకొర
    కగణితసుఖకామ్యదాత వగు రూపాయీ! (1)

    పరమానందము నిత్తువు
    కరుణాత్మకుడన్న పేరు కఠినున కిలలో
    నిరతము గూర్తువు, మహిమను
    కరమొసగెడుదాన వీవు గద! రూపాయీ! (2)

    విద్యాహీనునకైనను
    సద్యోజ్ఞానంబు నొసగి సంఘమునందున్
    హృద్యంబగు గౌరవ మెపు
    డద్యతన సుఖంబులిత్తు వట! రూపాయీ!(3)

    అందము లేని కురూపికి
    సుందరరూపునకు నుండు శోభలు, మరియున్
    నిందితులకు సజ్జనయశ
    మందింతువు శక్తియుక్తవగు రూపాయీ! (4)

    నీవెవ్వనిఁ గరుణింతువొ
    సేవింతురు వాని జనులు శ్రీపతి యనుచున్
    భూవిభుడవు నీవేయని
    యేవేళను బల్కుచుందు రిక రూపాయీ! (5)

    ఎవరెవరో బంధువులని
    సవినయముగ వచ్చి చేరి సహచరులగుచున్
    నివసించుట నీ మహిమయె
    యవిరళసంతోషదాయి వగు రూపాయీ! (6)

    ఒక్కడు ధరణీపతియై
    యొక్కడు దాస్యంబు చేయుచుండుట కవురా
    నిక్కము నీవే కారణ
    మిక్కుంభినిలోన జూడ నిక రూపాయీ! (7)

    నిరుపేదకు రాజరికము
    ధరనేలెడు వానికేమొ దారిద్ర్యంబుల్
    ధరణిని గలుగుటకున్ నీ
    కరుణయె కారణ మటండ్రు గద! రూపాయీ! (8)

    నీవుండిన సుఖముండును
    నీవమరిన ధైర్యమబ్బు నిఖిలజగాలన్
    నీ వత్యవసరమనదగు
    నేవేళను దయనుఁ జూపు మిక రూపాయీ! (9)

    స్మరియించిన నమరెదవో?
    నిరతము సద్భక్తితోడ నినుఁ బూజింపన్
    నరులకుఁ గూడెదవో? మరి
    వరముల నిచ్చెదవొ? చెప్పవలె రూపాయీ! (10)

*     *     *     *     *
౮. కమనీయం
    విచ్చ రూపాయిలో తులము వెండి కలిగి
    వెలుగు వెలిగిన నాణెమా విలువ తగ్గి
    వీథి బిచ్చగాడైనను విసరి కొట్టు
    కర్మ పట్టెను నీకిపుడు కాలమహిమ.

*     *     *     *     *
౯. రాజేశ్వరి నేదునూరి
    ధనమే జగతికి మూలము
    జను లన్నము దినుటకైన చతురున కైనన్ !
    కనుగొనె రూప్యము నెవ్వడొ
    మనుజుని ప్రాణమున కైన మనుగడ కైనన్ !

    డాలరు బడాయి పోకడ
    చాలదు కొలువంగ నిలను చక్రికి నైనన్ !
    రాలును రూప్యపు విలువకు
    మేలగు సంస్కృతి మనదని మెప్పులు ధరలో !



 

24 కామెంట్‌లు:

  1. రూపాయీ! భరతాంబకు
    పాపాయీ! లుబ్ధు కంటిపాపా! చోరుం
    జూపా! దాచెడు వారికి
    తీపా ! మరి లేని వారి తిప్పల కుప్పా!

    రిప్లయితొలగించండి
  2. ధనమది యెంత వచ్చిన
    జనులకు తక్కువగఁ దోచు; సంపాదననే
    మన జీవిత లక్ష్యమనుచు
    దినదినమును తిరుగుచుంద్రు, దెసదెసలందున్.

    రిప్లయితొలగించండి
  3. మనమారన్ దలతున్ శుభంకరి! మహామాయా స్వరూపాంచితా!
    ధనలక్ష్మీ! సకలార్థ దాయిని! నినున్ ధ్యానింతు నిత్యమ్ము న
    ర్చనలన్ సల్పుదు సర్వ విశ్వమునకున్ సామ్రాజ్ఞివీవే కృపా
    వనరాశీ! ధనమే ప్రధానమగు సర్వం విత్త సాధ్యం జగత్

    రిప్లయితొలగించండి
  4. అమ్మా లక్ష్మీ దేవీ గారు & శ్రీ మిస్సన్న గారూ!
    మీ ఆనందమే నా ఆనందము - శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పద్యములు....
    ఆ.వె.
    పైస లోన నుండు పరమాత్ముఁ డిల లోన;
    ధనమె మూల మయ్యె ధరణి లోన;
    డబ్బు లేని వాఁడు డుబ్బుకుఁ గొఱ గాఁడు!
    కాన, గూడఁబెట్టఁ గలుగు సుఖము!!

    ఆ.వె.
    కులము గొప్పదైన; గోత్రోత్తముండైన;
    విద్య యున్న; సద్వివేకమున్న;
    ధనము గల్గు వాని దాసునిగా మాఱి,
    సతము సేవఁ జేయు నతఁడు, నిజము!

    కం.
    రూపాయియె పరమార్థము;
    పాపములను జేసి యైనఁ బైసను బెంచన్
    దాపత్రయ పడుచుందురు;
    రూపాయీ, నీకు నతులు! ప్రోవుము నన్నున్!

    రిప్లయితొలగించండి
  6. రూపాయి కిలో బియ్యము
    నీ పాలన నున్న వరకు నిత్తురు కానీ
    నీ ప్లాను చివరి వరకును
    నాపాదితమగునె నిచట నార్ధిక మంత్రీ!

    రిప్లయితొలగించండి
  7. రూప్యమునకిక బియ్య మప్రాప్య మనిరి
    రూప్యమునకు పాలుపెరుగ ప్రాప్యము సరి
    రూప్యమున కిన్ని నీళ్ళైన నాప్య మనఁగ
    లేము, రూప్యమా! చాలిక లేచి పొమ్ము!

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    అంత్యానుప్రాసతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. సవరించాను
    *
    పండిత నేమాని వారూ,
    అద్భుతమైన పద్యం చెప్పారు. అభినందనలు.
    మీ పద్యాన్ని చదివితే నాకు ‘పెద్దమనుషులు’ చిత్రంలోని ‘మదిని నిన్ను నెర నమ్మి కొలిచెదను మాతా దయగొను ధనలక్ష్మీ’ పాట గుర్తుకు వచ్చింది.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ మూడు పద్యాలూ చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో ప్రాస తప్పింది. సవరించాను. చూడండి.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గురువు గారు,
    ధన్యవాదాలండి. కట్ అండ్ పేస్ట్ సమస్యలివి.

    రిప్లయితొలగించండి
  10. రూపాయి

    జగముల కీవే మూలము
    నిగమంబుల పాఠనంబు నిత్యార్చనముల్
    భగవత్సేవలు నీకొర
    కగణితసుఖకామ్యదాత వగు రూపాయీ! 1.

    పరమానందము నిత్తువు
    కరుణాత్మకుడన్న పేరు కఠినున కిలలో
    నిరతము గూర్తువు, మహిమను
    కరమొసగెడుదాన వీవు గద! రూపాయీ! 2.

    విద్యాహీనునకైనను
    సద్యోజ్ఞానంబు నొసగి సంఘమునందున్
    హృద్యంబగు గౌరవ మెపు
    డద్యతన సుఖంబులిత్తు వట! రూపాయీ! 3.

    అందము లేని కురూపికి
    సుందరరూపునకు నుండు శోభలు, మరియున్
    నిందితులకు సజ్జనయశ
    మందింతువు శక్తియుక్తవగు రూపాయీ! 4.

    నీవెవ్వనిఁ గరుణింతువొ
    సేవింతురు వాని జనులు శ్రీపతి యనుచున్
    భూవిభుడవు నీవేనని
    యేవేళను బల్కుచుందు రిక రూపాయీ! 5.

    ఎవరెవరో బంధువులని
    సవినయముగ వచ్చి చేరి సహచరులగుచున్
    నివసించుట నీ మహిమయె
    యవిరళసంతోషదాయి వగు రూపాయీ! 6.

    ఒక్కడు ధరణీపతియై
    యొక్కడు దాస్యంబు చేయుచుండుట కవురా
    నిక్కము నీవే కారణ
    మిక్కుంభినిలోన జూడ నిక రూపాయీ! 7.

    నిరుపేదకు రాజరికము
    ధరనేలెడు వానికేమొ దారిద్ర్యంబుల్
    ధరణిని గలుగుటకున్ నీ
    కరుణయె కారణ మటండ్రు గద! రూపాయీ! 8.

    నీవుండిన సుఖముండును
    నీవమరిన ధైర్యమబ్బు నిఖిలజగాలన్
    నీ వత్యవసరమనదగు
    నేవేళను దయనుఁ జూపు మిక రూపాయీ! 9.

    స్మరియించిన నమరెదవో?
    నిరతము సద్భక్తితోడ నినుఁ బూజింపన్
    నరులకుఁ గూడెదవో? మరి
    వరముల నిచ్చెదవొ? చెప్పవలె రూపాయీ! 10.

    రిప్లయితొలగించండి
  11. హరివారికి ప్రియమైనది
    సిరియేకద దాని గూర్చి చెప్పెడు వేళన్
    పరవశమొందెదరు కదా
    పరువెత్తును వారి కలము బలె రూపాయీ!

    రిప్లయితొలగించండి
  12. హరి మూర్తి గారూ, మీ రూపాయి దశకం బాగుంది!

    రిప్లయితొలగించండి
  13. సత్యనారాయణ మూర్తి గారూ,
    శ్లేషతో నేమాని వారి ప్రశంసను పొందిన తరువాత వ్యాఖ్యానించడానికి నేనెంత? అద్భుతమైన పద్యాలు వ్రాసారు. అభినందనలు, ధన్యవాదాలు.
    మీ చేత ఇంత చక్కని ఖండికలు వ్రాయించి కవిమిత్రులను అలరింపచేయడానికి నిమిత్తమాత్రుడి నౌతున్నందుకు ఆనందంగా కించిత్తు గర్వంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  14. ఆర్యా!
    ధన్యోస్మి, నమస్కారములు.

    సిరిఁ గోరని వారొక్కరు
    నరయగ భువిపైన పండితార్యా! గలరా?
    పరమానందం బాశీ
    ర్భరితవచస్సులకు, మీకు ప్రణతులొనర్తున్.

    రిప్లయితొలగించండి
  15. "మనతెలుగు" శ్రీ చంద్రశేఖర్ గారూ!
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. గురుతుల్యులైన శ్రీ శంకరార్యా!
    నమస్కారములు, ధన్యవాదములు.
    తెలుగు భాష మచ్చునకైనా వినిపించని హిందీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వంవారి దయతో పిల్లలకు ప్రాథమిక తెలుగు భాషాబోధనను చేసుకుంటూ కాలం గడుపుతున్న నాకు "శంకరాభరణం" బ్లాగుతో పరిచయమేర్పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు శతాధిక ధన్యవాదాలు.
    ఆర్యా!
    వాత్సల్యము ప్రకటించుచు
    సత్సంగము గూర్చినారు శంకరవర్యా!
    ఉత్సాహము జనియించుచు
    సత్సౌఖ్యము లబ్బుచుండె చాలిక నాకున్.

    మరోమారు నమస్కారములతో
    విధేయుడు,
    మూర్తి.

    రిప్లయితొలగించండి
  17. విచ్చ రూపాయిలో తులము వెండి కలిగి
    వెలుగు వెలిగిన నాణెమా విలువ తగ్గి
    వీథి బిచ్చగాడైనను విసరి కొట్టు
    కర్మ పట్టెను నీకిపుడు కాలమహిమ.

    రిప్లయితొలగించండి
  18. కమనీయం గారూ,
    మంచి భావంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    1,4 పాదాలలో గణదోషం. ‘రూపాయిలో’ను ‘రూపాయికి’ అనీ, ‘నీకిపుడు’ను ‘నీకిప్డు’ అని సవరిస్తే సరి!

    రిప్లయితొలగించండి
  19. ధనమే జగతికి మూలము
    జను లన్నము దినుటకైన చతురిని కైనన్ !
    కనుగొనె రూప్యము నెవ్వడొ
    మనుజుని ప్రాణమున కైన మనుగడ కైనన్ !
    ---------------------------------------------------
    డాలరు బడాయి పోకడ
    చాలదు కొలువంగ నిలను చక్రికి నైనన్ !
    రాలును రూప్యపు విలువకు
    మేలగు సంస్కృతి మనదని మెప్పులు ధరలో !

    రిప్లయితొలగించండి
  20. గురువులకు ధన్య వాదములు.
    ఈ మధ్య రోజు తప్పులే వస్తున్నాయి . ఇక ఈ రోజుకుడా తప్పులు వస్తే , కొన్నాళ్ళు వ్రాయద్దనుకున్నాను . ఇకనేం ? మీకు పని చెప్ప కుడా వ్రాయ గలిగితే నా జన్మ ధన్యం .కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  21. కమనీయం గారూ మీ రూపాయి జీవిత చిత్రణ బాగుంది. (సవరణతో)
    "విచ్చ రూపాయికి తులము వెండి కలిగి"

    రిప్లయితొలగించండి
  22. శంకరయ్యగారు,లక్కరాజుగారు సూచించిన సవరణలకు ధన్యవాదములు.ఆ విధంగానే నా పద్యాన్ని చదువుకోమని మనవి.

    రిప్లయితొలగించండి