30, జులై 2012, సోమవారం

పద్య రచన - 66


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. సినిమారంగమునన్ విశేషముగ భాసించెన్ మహానాయకుం
    డన పోషించె ఘటోత్కచాదులగు దీవ్యత్ పాత్రలన్ శేముషిం
    గనె నోహో నటనాగ్రగణ్యుడని రంగారావు ధీశాలి యా
    తని కెవ్వారగు సాటి మేటి యతడే సత్యంబు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  2. మిత్రులారా! నా పద్యము 4వ పాదములో యతి స్థానములో "సత్యంబు నకు బదులుగా "తథ్యంబు" అని మార్చి చదువుకొనవలెను. ఇది యతికొరకై సవరణ. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. బానిసల కింత ఛీ! యహం భావమా! య
    నినొక దెబ్బన ఎన్టివోని తెగ వేసి
    పాండవ వనవాసమ్మందు ప్రతిభ చూపు
    రంగరావుకు సాటి లేరన్న లేరు!

    రిప్లయితొలగించండి
  4. నవరసమ్ములతొణికించునటనదెలిసి
    కరుణ,కర్కశత్వములెల్లగానపఱచి
    శునక హావభావంబులఁజూచినేర్చె
    నటన, యస్విరంగారావునటుడు తానె!

    రిప్లయితొలగించండి
  5. నవరసమ్ములతొణికించునటనదెలిసి
    కరుణ,కర్కశత్వములెల్లగానపఱచి
    శునక హావభావంబులఁజూచినేర్చె
    నటన, యస్విరంగారావునటుడు తానె!

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా!

    సమాసములందు దోషములు:

    సమాసములను చేయునపుడు కొన్ని నియమములను పాటించుట మంచిది.

    (1) సమాసములలో అన్ని పదములు సంస్కృత పదములయి యుండవలెను; లేక
    (2) అన్ని పదములు తెలుగు పదములే అయి యుండవలెను; లేక
    (3) తొలి పదము తెలుగు పదము తరువాతి పదము సంస్కృతము ఉండవచ్చును; కాని
    (4) తొలి పదము సంస్కృతము తరువాతి పదము తెలుగు ఉండరాదు.

    మన మిత్రులు వ్రాసిన కొన్ని పద్యములలో అక్కడక్కడ దోషములు కనుపించు చున్నవి.
    ఉదా: హృదయ కోవెల
    హృదయ మందిరము అనవచ్చును లేక ఎదకోవెల అనవచ్చును. కాని హృదయ కోవెల అనరాదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. డింభకా యనిబిల్చి దిక్కులదరగొట్టు
    ధీటైన నటమౌళి ధాటిగలరె !
    చెల్లెలాయనితల చెయ్యేసినిమిరగా
    అమ్మలక్కల కళ్ళు చెమ్మగిలవె !
    వీరఘటోద్గజ ధీరపటాటోప
    మానాడుయీనాడు నవనిబొగడె !
    పాత్రోచితమ్మగు ప్రతిభతో రాణించి
    పరిణతి జూపించు ప్రజ్ఞ తనదె !

    చిత్ర సీమకు దొరికిన ఛత్రమతడు
    నవ రసాలను పండించు నటుడతండు
    మనసు దోచిన మాటల మాంత్రి కుండు
    తెలుగు నేలలో నారని వెలుగతండు!!!

    విక్రమోపేత నభినయ చక్రవర్తి
    విశ్వ విఖ్యాత నటముర్తి విమల కీర్తి
    మేటి ఎస్వి రంగారావు సాటి గలరె ?
    అతనికాతండె సాటియౌ నవనియందు !!!

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారు చెప్పినది వ్యాకరణం అనుమతించే వాటి గురించి.సమాసంలోమొదటిది తెలుగు రెండవది సంస్కృత పదం ఉన్న మిశ్రమ సమాసం దోషం కాదు కానీ శ్రవణ సుభగంగా లేక పోతే ఆ సమాసం చేయక పోవడమే మంచిది. గుండెమందిరము అన్న సమాసం వ్యాకరణ రీత్యా దోషం కాక పోవచ్చును కానీ విన సొంపుగా ఉండదు. గుండెఇల్లు అంటేనే హాయిగా ఉంటుంది.మంచికవిత్వానికి ఛందస్సూ వ్యాకరణమూ మాత్రమే కాదు. అంకు మించినదేదో కావలసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  9. సింగమును బోలు రూపమ్ము,సిం హబలుడు,
    కనకకశిపుండు,నా దశకంఠు వంటి
    పాత్రలసమాన రీతిని ప్రజలు మెచ్చ,
    నభినయింప సమర్థుడేకైక నటుడు.

    తామసరజో గుణాత్మపాత్రలనె గాక
    హృదయమును గరగించెడి మృదులభావ
    సాత్త్వికమ్మును, హాస్యమ్ము, చవులు మీర
    రంజనము సేయు నటరాజు రంగరావు.

    రిప్లయితొలగించండి
  10. రంగస్థల నటుడి మొదలు
    పొం గారెడు నటన మందు పొగడపు సరమై !
    బంగారు పాప వంటి
    జంగమ దేవర వరకును సార్వ భౌము డతండే !

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మిత్రులకు సమాసాల గురించిన చక్కని సలహాను ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘అని నొక’ అన్నచోట ‘అని యొక’ అనాలనుకుంటాను.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘శునక హావభావాలను’ అనుకరించిన విషయం నేనూ ఎప్పుడో చదివినట్లు గుర్తు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    రంగారావు గారి సమగ్ర వ్యక్తిత్వాన్ని స్పృశించిన మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు
    *
    పంతుల గోపాల కృష్ణారావు గారూ,
    ధన్యవాదాలు.
    *
    కమనీయం గారూ,
    చాలా బాగున్నాయి మీ పద్యాలు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    కొన్ని లోపాలు... రేపు ఉదయం సవరిస్తాను...

    రిప్లయితొలగించండి
  12. శ్రీ పండిత నేమాని గారికి నమస్కారములు మరియు ధన్యవాదములు . భాషపై ,వ్యాకరణం పై తగినపట్టు ,అవగాహన లేక తెలియకుండా దొర్లుతున్న తప్పులు . మీలాంటి పెద్దలసహాహకారంతో కొన్ని తెలుస్తున్నా తెలుసుకోవలసినవి చాల ఉంటున్నాయి .వ్రాయాలని ఉన్నఉత్సాహమే అప్పుడప్పుడు పద్యాలను వ్రాయిస్తుంది

    రిప్లయితొలగించండి
  13. శ్రీ మంద పీతాంబర్ గారి పద్యాలలో ఈ క్రిందివి సవరించాలి:

    (1) వీర ఘటోద్గజ(తప్పు) : వీర ఘటోత్కచ (ఒప్పు)

    (2) విక్రమోపేత నభినయ చక్రవర్తి : నభినయ అనుచోట నకారము రాదు. సవర్ణ దీర్ఘ సంధి చేయాలి. విక్రమోపేతాభినయ చక్రవర్తి అనాలి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. సరస పాత్రలకును సారంగ రావేను
    రాజ పాత్రకు కుదు రంగ రావు
    ఘోర పాత్రలకును ఘోరంగ రావేను
    రసము లన్నిట నవ రంగ రావు

    రిప్లయితొలగించండి
  15. హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ‘నవరంగరావు’ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. సవరణలను సూచించిన పూజ్యులు శ్రీ పండితనేమాని గారికి ధన్యవాదాలు .

    నా పద్యాల్లో "ఘటోద్గజ"కు బదులు "ఘటోత్కచ" గా ,"విక్రమోపేత నభినయ చక్రవర్తి " కి బదులు 'సార మెఱిగిన '*సామర్ల చక్రవర్తి " గా సవరణలు చేస్తున్నాను .( *సామర్ల వెంకట రంగారావు)

    రిప్లయితొలగించండి