మిస్సన్న గారూ, బ్రౌన్ ప్రస్తావనతో చక్కని పూరణ చేసారు. అభినందనలు. * హనుమచ్ఛాస్త్రి గారూ, రాయల మాటను వక్రీకరించే వారిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * జిలేబీ గారూ, మీ భావానికి నా పద్యరూపాన్ని చూడండి. * సత్యనారాయణ మూర్తి గారూ, చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, తిట్టడానికి పనికివచ్చే భాషగా ఆంగ్లాన్ని గుర్తిస్తూ మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు. * మధుసూదన్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * కమనీయం గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
కమ్మనైన భాష అమ్మ భాషే కదా
రిప్లయితొలగించండిఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల
మీరు మెచ్చి రనిన మేటి భాష తెనుంగు
నాకు నచ్చె ననెను నాడు బ్రౌను.
రాయలనియె నాడు రమ్యముగా తాను
రిప్లయితొలగించండిదేశ భాష లందు తెలుగు లెస్స
ఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల?ను నేడు
దేశ భాష లందు తెలుగు 'లెస్సు'
తుగ్లక్కులు రాజ్యమేల గాంధి ఏల?
రిప్లయితొలగించండిఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల ?
మేడముండ రాష్ట్రమున సీయెమ్ము ఏల?
ఏల ఏల అనిన సమాధానము ఇచ్చువారు ఏడ?
చీర్స్
జిలేబి.
తెలుగు దేశమందు దేదీప్యమానమై
రిప్లయితొలగించండియాంగ్లభాషయుండ, నాంధ్రమేల
దేశభాషలందు తిరముగా లెస్సయై
పూర్వవైభవంబు పొందగలుగు?
వివిధ రకము లుండు వేభాష లెందుకు ?
రిప్లయితొలగించండిఆంగ్ల భాష యుండ, నాంధ్ర మేల ?
యనుట సబవు కాదు నార్యు లనిరి కద!
దేశ భాష లందు తెలుగు లెస్స
అమెరి కన్లు బలుక నమ్మవంటి దినైన
రిప్లయితొలగించండిఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల ?
తెలుగు దేశ మందు తేనియ లూరెడు
నాంధ్ర భాష యుండ నాంగ్ల మేల?
వేస్టుజేయువాణ్ణి బాస్తర్డు యనవచ్చు
రిప్లయితొలగించండియిష్ట పడని వాణ్ణి ఈడియట్టు
కష్టపెట్టుటకును కలతరేపుటకును
ఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల ?
గుండు మధుసూదన్ గారి పూరణ....
రిప్లయితొలగించండిఅమృత తుల్యమైన యపురూప రచనమ్ము
కాంధ్ర భాష యుండ, నాంగ్ల మేల?
మృత సమమ్ము మమ్మి మేని రోఁతఁ బొగడ
నాంగ్ల భాష యుండ, నాంధ్ర మేల?
సర్వశాస్త్రములను జక్కగా నేర్వంగ
రిప్లయితొలగించండిఆంగ్లభాష యుండ నాంధ్రమేల
యనుట పాడి కాదు ,అమ్మను మించిన
దైవమిలను గలదె ,తలచి చూడ (ధరణి యందు) .
సర్వశాస్త్రములను జక్కగా నేర్వంగ
రిప్లయితొలగించండిఆంగ్లభాష యుండ నాంధ్రమేల
యనుట పాడి కాదు ,అమ్మను మించిన
దైవమిలను గలదె ,తలచి చూడ (ధరణి యందు) .
కూడు బెట్టు మనకు కోట్లకు పడగెత్త
రిప్లయితొలగించండిజనులు మెచ్చి తుదకు వనధి దాటి
తల్లి చెల్లి యనక తంటాలు పడియైన
ఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల ?
జిలేబీ గారి భావానికి పద్యరూపం....
రిప్లయితొలగించండిగాంధి యేల పిచ్చిగల తుగ్లకులు నుండ?
మేడ ముండగ సియ మేల మనల?
కాంగ్లభాష యుండ నాంధ్ర మేల యనెడి
ప్రశ్న కుత్తర మిడు వార లేడ?
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిబ్రౌన్ ప్రస్తావనతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.
*
హనుమచ్ఛాస్త్రి గారూ,
రాయల మాటను వక్రీకరించే వారిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపాన్ని చూడండి.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
తిట్టడానికి పనికివచ్చే భాషగా ఆంగ్లాన్ని గుర్తిస్తూ మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
*
మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
పట్టుచీర గట్టు పెట్టుడు తల్లిని
రిప్లయితొలగించండిసొంత తల్లి యనుట వింత గాదె
ఆంగ్లభాష యుండ నాంధ్ర మేలయనుట
తారతమ్యమెరుగ తరముగాక!
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.