28, జులై 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 87

IN desperate hope I go and search for
her in all the corners of my room ; I
find her not.

My house is small and what once has
gone from it can never be regained.

But infinite is thy mansion, my lord,
and seeking her I have come to thy
door.

I stand under the golden canopy of
thine evening sky and I lift my eager
eyes to thy face.

I have come to the brink of eternity
from which nothing can vanish no
hope, no happiness, no vision of a face
seen through tears.

Oh, dip my emptied life into that
ocean, plunge it into the deepest full-
ness. Let me for once feel that lost
sweet touch in the allness of the uni-
verse.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఆస మాలిన మదితోన యరిగినాఁడ,
నింటిలో మూలమూల గాలించినాఁడ,
కాని యద్దాని నేనెందుఁ గాననైతి ||

ఇరుకు టిలు నాది, యేది పోయినను సరియె
తిరిగి యేనాటికైనను దొరుక దచట ||

కాని యో నాప్రభూ! తావకీనభవన
మది యపారము, వెదకుచు వెదకు చేను
చేరుకొంటిని జుమ్ము నీ ద్వారసీమ ||

స్వామి! భవదీయమైన సంధ్యామయంపుఁ
బసిడిపందిట నిల్చి పిపాసగొన్న
కన్ను లెత్తితి నీదు మొగమ్మువైపు ||

చేరితిన్ శాశ్వతత్వఁపు తీరమునకు,
నేది యేనియు నచట నశింప దెపుడు,
ఆశలని, సుఖ *దుఃఖము లనియు లేవు,
రిత్తలైన గొంతెమ్మ కోరికలతోడి
యశ్రుముఖములఁ జూచు దృశ్యములు లేవు ||

అహహ! నిత్యత్వ మనెడు నయ్యబ్ధిలోన
నీవ ముంచుము నాశూన్యజీవితమును,
ముంచుము గభీర పూర్ణతాంభోధిలోన,
నీ మహా సృష్టిలోపలి నిండుఁదనపుఁ
దీయనౌ తుది తాకిడి హాయి మఱల
నొక్కసారి నా యనుభూతి కెక్కనిమ్ము ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి