పండిత నేమాని వారూ, ఆటవెలది సమస్యకు మీ తెటగీతి పూరణ బాగుంది. అభినందనలు. * సంపతి కుమార్ శాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, ఆటవెలది సమస్యను కందంలో ఇమిడ్చి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * లక్ష్మీ నరసింహం గారూ, ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పూరణ బాగుంది. అభినందనలు. మూడవ పాదంలో యతిదోషం. ‘మనసు దలచె భయము గొని భ్రాంతితో నెవరి’ అని నా సవరణ... * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీరు మొదటి పూరణలో అజాస్తనాన్ని కోసారు. బాగుంది పూరణ. రెండవ పూరణ సరసంగా ఉంది. అభినందనలు. * సహదేవుడు గారూ, మంచి విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా మనోహరంగా ఉంది. అభినందనలు. * చంద్రమౌళి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘కొఱకు యన్న’ను ‘కొఱ కటన్న’ అంటే సరి. మూడవపాదంలో ‘ఎన్ని పరిహారాలు’ అన్నచోట గణదోషం. ‘ఎన్ని పూరణములో’ అందామా? * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘వేసవి యందు’ అనాలి. అక్కడ ‘వేసవి యిది’ అందామా?
కమ్మనగు రుచిగూర్చును నిమ్మరసము
రిప్లయితొలగించండికనుక తేవలె వడి నిమ్మకాయ యనెడు
భార్య మాటలు విని చెట్టుపైని గల లి
కుచము గోసె మగడు కూర కొరకు బళిర!
పర్వదినమునాడు భక్తిభావముతోడ
రిప్లయితొలగించండినర్చనాదికముల నాచరించి,
సతికి వంటయందు సాయంబు చేయ ల
కుచము గోసె మగడు కూరకొఱకు.
లకుచము = గజనిమ్మకాయ
గుండు మధుసూదన్ గారి పూరణ....
రిప్లయితొలగించండిస్వక రుచ్యము రసమౌటన్,
సకలముఁ దా సిద్ధ పఱచి, సంతోషమునన్
లికుచముఁ గోసె మగఁడు, కూ
ర కొఱకుఁ గాకను, స్వకేష్ట రసముం జేయన్!
లక్ష్మీ నరసింహం గారి పూరణ....
రిప్లయితొలగించండికరమునందు యున్న ఎరువు దుంపను చూసి
వేలు బుగ్గనుంచి వెర్రిమగువ
మనసు దలచె భయము భ్రాంతితోడ ఎవరి
కుచము గోసె మగడు కూరకోరకు?
మేత వేసి పెంచి మేక నొక్కటి నాడు
రిప్లయితొలగించండిపండు గనుచు దెచ్చి భార్య కెదుట
కత్తి బట్టి నొక్కి కంఠమ్ము ముందుగా
కుచము గోసె మగడు కూర కొరకు
ఒక భార్యా భర్త తమ తోట లో కాచిన దోస కాయల పరిమాణమును సరసముగా వర్ణిస్తూన్న భావన ...
రిప్లయితొలగించండిదోర వయసు జంట దోస తోటను జేరె
తాటి కాయ లనియె తరుణి జూచి
నీదు కుచము లనుచు నిగ నిగ దోసను
కుచము గోసె మగడు కూర కొరకు.
అరటి తోటఁజేరి నాలిమగనిగూడి
రిప్లయితొలగించండికాయఁగోయ తాను కరము లెత్త
పైట జారి కుచము బయటపడగఁగప్పి
కుచముఁ, గోసె మగడు కూర కొఱకు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి“కుచము గోసె మగడు కూరకొఱకు”యన్న
రిప్లయితొలగించండిలికుచ మొక్కపదమె సుకవులకును
ఉన్నదొక్కపదము ఎన్నిపరిహారాలు
మొదట బట్ట వారె మహితులైరి
పెరటి లోన కలదు విరగ గాసిన చెట్టు
రిప్లయితొలగించండిమండు వేస వందు మనకు మేలు
పంచ దార కలిపి యెంచి వండుమని లి
కుచముఁ గోసె మగఁడు కూర కొఱకు !
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఆటవెలది సమస్యకు మీ తెటగీతి పూరణ బాగుంది. అభినందనలు.
*
సంపతి కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
ఆటవెలది సమస్యను కందంలో ఇమిడ్చి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీ నరసింహం గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో యతిదోషం. ‘మనసు దలచె భయము గొని భ్రాంతితో నెవరి’ అని నా సవరణ...
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీరు మొదటి పూరణలో అజాస్తనాన్ని కోసారు. బాగుంది పూరణ.
రెండవ పూరణ సరసంగా ఉంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మంచి విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా మనోహరంగా ఉంది. అభినందనలు.
*
చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘కొఱకు యన్న’ను ‘కొఱ కటన్న’ అంటే సరి. మూడవపాదంలో ‘ఎన్ని పరిహారాలు’ అన్నచోట గణదోషం. ‘ఎన్ని పూరణములో’ అందామా?
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘వేసవి యందు’ అనాలి. అక్కడ ‘వేసవి యిది’ అందామా?