కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.
కవిమిత్రుల పద్యములు
౧. గోలి హనుమచ్ఛాస్త్రి
తాటక నిలువుము నిను బం
తాటగ నే నాడుకొందు ధైర్యము గలదా?
తాటను దీసెద నటుపై
తాటాకును గాల్చినట్లు తగులంబెడుదున్!
* * * * *
౨. హరి సత్యనారాయణ మూర్తి
లోకహితమును గోరుచు నేకదీక్ష
యజ్ఞయాగాది క్రతువుల ననవరతము
చేయు చుండెడి సన్మునిశ్రేష్ఠులకును
విఘ్నములు గూర్తు రసురులు వివిధగతుల.
దుష్టులను గూల్చి యణగించి దుర్మతులను
ధర్మరక్షణ చేయుచు ధైర్యమొసగి
సాధుజనులను గాచుట క్షత్రియులకు
విహితధర్మంబు చూడగ విశ్వమందు.
గాధినందను డొనరించు క్రతువు నపుడు
భంగ మొనరింప బూనిన పరమనీచు
లైన రక్కసిమూకను యముని పురికి
రామ చంద్రుండు పంపించె రయము మీర.
అతివనైనను దుర్మతి యగుచు మీరి
సజ్జనాళిని బాధించి సవనములకుఁ
గీడు కలిగింపఁ బూనిన నాడు దానిఁ
జంప దగునిందు లేదింత సందియంబు.
* * * * *
౩. పండిత నేమాని
రామచంద్రుండును లక్ష్మణుడును తండ్రి
యానతి తలదాల్చి మౌనివర్యు
డైన విశ్వామిత్రు యజ్ఞరక్షణకునై
శస్త్రపాణులగుచు జనుచునుండ
తాటకావనమున దైత్యాంగన మహాభ
యాకృతితో నిల్చి యభ్రమందు
రామచంద్రునిపైకి లంఘించు తరుణాన
ముని యానతి ప్రకారముగ శరమ్ము
నామెపై వేయ నతుల భయంకరముగ
నామె వక్షస్థలము జీల్చె నా శరమ్ము
ఘోరముగ రొప్పుచును దైత్య కూలెనంత
హర్షమున ముని శ్రీరాము నభినుతించె
తీరెను శాపమామెకు క్షితిన్ రఘురాముని దర్శనమ్ముతో
పేరు ముదమ్ము తోడ రఘువీరుని పాదములంటి మ్రొక్కి యా
సారసనేత్ర పొందె తన చక్కని యక్షిణి రూపమంతటన్
జేరి నిలింప బృందములు శ్రీరఘురాము నుతించి రాదృతిన్.
* * * * *
౪. లక్ష్మీదేవి
రాముని శౌర్యమెల్లెడల రాజిల జేసిన ఘట్టమియ్యదే!
కోమలుడైన బాలుడిట ఘోరత రక్కసి జంపెజూడుడీ!
శ్యామలదేహుడవ్వనిని జన్నము గావగ వచ్చె దానహో!
మైమరపించు దృశ్యమది, మంగళముల్ గొను రాఘవా! సదా!
* * * * *
౫. సుబ్బారావు
తాటకి నాబడు రక్కసి
దీ టు గ నాకసము నుండి దిగువకు జూడన్
పో టు గ రాముం డ య్యె డ
నాటెను శరమొకటి దైత్య నాయిక యెదపై.
* * * * *
౬. రాజేశ్వరి నేదునూరి
గాదేయు డడిగె రాముని
బాధించెడి తాటకిఁ జంపఁ బంపు మటంచున్ !
వేధించు సంశయమునను
బాధగ పంపెను తనయుని పసివా డనుచున్ !
* * * * *
౭. కమనీయం
(1)
వనిత దీనిని జంపగా వలవదనుచు
సందియమునొందు యారామచంద్రు తోడ
తాటకాఖ్య రాక్షసి యిది తగదు జాగు
అనుచు బోధించె కౌశికుండాత్రముగను.
(2)
ధ్వంసమొనరించె జనావాస పదములెన్నొ
దుష్ట చిత్త,భీకరరూప ,దురితచరిత,
దీని నుపేక్షింపగ రాదు స్త్రీ యటంచు
సత్వరము ప్రయోగింపుము శస్త్రములను.
తాటక నిలువుము నిను బం
తాటగ నే నాడుకొందు ధైర్యము గలదా?
తాటను దీసెద నటుపై
తాటాకును గాల్చినట్లు తగులంబెడుదున్!
* * * * *
౨. హరి సత్యనారాయణ మూర్తి
లోకహితమును గోరుచు నేకదీక్ష
యజ్ఞయాగాది క్రతువుల ననవరతము
చేయు చుండెడి సన్మునిశ్రేష్ఠులకును
విఘ్నములు గూర్తు రసురులు వివిధగతుల.
దుష్టులను గూల్చి యణగించి దుర్మతులను
ధర్మరక్షణ చేయుచు ధైర్యమొసగి
సాధుజనులను గాచుట క్షత్రియులకు
విహితధర్మంబు చూడగ విశ్వమందు.
గాధినందను డొనరించు క్రతువు నపుడు
భంగ మొనరింప బూనిన పరమనీచు
లైన రక్కసిమూకను యముని పురికి
రామ చంద్రుండు పంపించె రయము మీర.
అతివనైనను దుర్మతి యగుచు మీరి
సజ్జనాళిని బాధించి సవనములకుఁ
గీడు కలిగింపఁ బూనిన నాడు దానిఁ
జంప దగునిందు లేదింత సందియంబు.
* * * * *
౩. పండిత నేమాని
రామచంద్రుండును లక్ష్మణుడును తండ్రి
యానతి తలదాల్చి మౌనివర్యు
డైన విశ్వామిత్రు యజ్ఞరక్షణకునై
శస్త్రపాణులగుచు జనుచునుండ
తాటకావనమున దైత్యాంగన మహాభ
యాకృతితో నిల్చి యభ్రమందు
రామచంద్రునిపైకి లంఘించు తరుణాన
ముని యానతి ప్రకారముగ శరమ్ము
నామెపై వేయ నతుల భయంకరముగ
నామె వక్షస్థలము జీల్చె నా శరమ్ము
ఘోరముగ రొప్పుచును దైత్య కూలెనంత
హర్షమున ముని శ్రీరాము నభినుతించె
తీరెను శాపమామెకు క్షితిన్ రఘురాముని దర్శనమ్ముతో
పేరు ముదమ్ము తోడ రఘువీరుని పాదములంటి మ్రొక్కి యా
సారసనేత్ర పొందె తన చక్కని యక్షిణి రూపమంతటన్
జేరి నిలింప బృందములు శ్రీరఘురాము నుతించి రాదృతిన్.
* * * * *
౪. లక్ష్మీదేవి
రాముని శౌర్యమెల్లెడల రాజిల జేసిన ఘట్టమియ్యదే!
కోమలుడైన బాలుడిట ఘోరత రక్కసి జంపెజూడుడీ!
శ్యామలదేహుడవ్వనిని జన్నము గావగ వచ్చె దానహో!
మైమరపించు దృశ్యమది, మంగళముల్ గొను రాఘవా! సదా!
* * * * *
౫. సుబ్బారావు
తాటకి నాబడు రక్కసి
దీ టు గ నాకసము నుండి దిగువకు జూడన్
పో టు గ రాముం డ య్యె డ
నాటెను శరమొకటి దైత్య నాయిక యెదపై.
* * * * *
౬. రాజేశ్వరి నేదునూరి
గాదేయు డడిగె రాముని
బాధించెడి తాటకిఁ జంపఁ బంపు మటంచున్ !
వేధించు సంశయమునను
బాధగ పంపెను తనయుని పసివా డనుచున్ !
* * * * *
౭. కమనీయం
(1)
వనిత దీనిని జంపగా వలవదనుచు
సందియమునొందు యారామచంద్రు తోడ
తాటకాఖ్య రాక్షసి యిది తగదు జాగు
అనుచు బోధించె కౌశికుండాత్రముగను.
(2)
ధ్వంసమొనరించె జనావాస పదములెన్నొ
దుష్ట చిత్త,భీకరరూప ,దురితచరిత,
దీని నుపేక్షింపగ రాదు స్త్రీ యటంచు
సత్వరము ప్రయోగింపుము శస్త్రములను.
రామ బాణము గురి కాగ రక్ష దోయి
రిప్లయితొలగించండిమృత్యు వొడి లోని కేగుచు మాయ మై రి
యాగ రక్షణ గావిం చె యటు లన పు డు
రామ చంద్రుడు న ర రూప వామ నుండు .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితాటక నిలువుము నిను బం
రిప్లయితొలగించండితాటగ నే నాడుకొందు ధైర్యము గలదా?
తాటను దీసెద నటుపై
తాటాకును గాల్చినట్లు తగులంబెడుదున్!
లోకహితమును గోరుచు నేకదీక్ష
రిప్లయితొలగించండియజ్ఞయాగాది క్రతువుల ననవరతము
చేయు చుండెడి సన్మునిశ్రేష్ఠులకును
విఘ్నములు గూర్తు రసురులు వివిధగతుల.
దుష్టులను గూల్చి యణగించి దుర్మతులను
ధర్మరక్షణ చేయుచు ధైర్యమొసగి
సాధుజనులను గాచుట క్షత్రియులకు
విహితధర్మంబు చూడగ విశ్వమందు.
గాధినందను డొనరించు క్రతువు నపుడు
భంగ మొనరింప బూనిన పరమనీచు
లైన రక్కసిమూకను యముని పురికి
రామ చంద్రుండు పంపించె రయము మీర.
అతివనైనను దుర్మతి యగుచు మీరి
సజ్జనాళిని బాధించి సవనములకుఁ
గీడు కలిగింపఁ బూనిన నాడు దానిఁ
జంప దగునిందు లేదింత సందియంబు.
రామచంద్రుండును లక్ష్మణుడును తండ్రి
రిప్లయితొలగించండియానతి తలదాల్చి మౌనివర్యు
డైన విశ్వామిత్రు యజ్ఞరక్షణకునై
శస్త్రపాణులగుచు జనుచునుండ
తాటకావనమున దైత్యాంగన మహాభ
యాకృతితో నిల్చి యభ్రమందు
రామచంద్రునిపైకి లంఘించు తరుణాన
ముని యానతి ప్రకారముగ శరమ్ము
నామెపై వేయ నతుల భయంకరముగ
నామె వక్షస్థలము జీల్చె నా శరమ్ము
ఘోరముగ రొప్పుచును దైత్య కూలెనంత
హర్షమున ముని శ్రీరాము నభినుతించె
తీరెను శాపమామెకు క్షితిన్ రఘురాముని దర్శనమ్ముతో
పేరు ముదమ్ము తోడ రఘువీరుని పాదములంటి మ్రొక్కి యా
సారసనేత్ర పొందె తన చక్కని యక్షిణి రూపమంతటన్
జేరి నిలింప బృందములు శ్రీరఘురాము నుతించి రాదృతిన్
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండివేగంగా స్పందించి పద్యం వ్రాసినందుకు అభినందనలు.
మొదటి రెండు పాదాల అన్వయం బోధపడడం లేదు. ‘రక్ష దోయ’...?
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
అద్భుతంగా ఉన్నాయి మీ పద్యాలు. అభినందనలు.
*
పందిత నేమాని వారూ,
మీ పద్యాలు ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
ఇందులో ఉన్నది తాటకయేనా?
రిప్లయితొలగించండిమిగిలిన వారి వేషధారణ చూసి రామలక్ష్మణులు, విశ్వామిత్రులవారు కాదేమో అనుకుని పద్యము వ్రాయలేదు. ఎవరో తెలియక ఊరుకున్నాను.
బహుశా ఉత్తర భారతం వాళ్ళు గీసి ఉంటారు. గర్భగుడిలో ఉండే ప్రధాన పూజారి అయినా సరే, అక్కడి చలి వాతావరణానికేమో పూర్తి వస్త్రధారణతోనే ఉంటారు.
రాముని శౌర్యమెల్లెడల రాజిల జేసిన ఘట్టమియ్యదే!
రిప్లయితొలగించండికోమలుడైన బాలుడిట ఘోరత రక్కసి జంపెజూడుడీ!
శ్యామలదేహుడవ్వనిని జన్నము గావగ వచ్చె దానహో!
మైమరపించు దృశ్యమది, మంగళముల్ గొను రాఘవా! సదా!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ "తాట" (కి) తో ఆట బాగుంది.
రిప్లయితొలగించండితాటక నిలువుము నిను బం
తాటగ నే నాడుకొందు ధైర్యము గలదా?
శ్రీ గురువులు ,శంకరయ్య గారికి నమస్కారముల తో వ్రాయునది
రిప్లయితొలగించండిపద్య రచనలో మారీ చుడు అనుకొని ఆ విధముగా పూరించాను .
రక్ష దోయి అనగా రాక్షస ద్వయము .మారీచ సుబాహులు .
శ్రీ నేమాని వారు తమ రామాయణములో రాక్షసుడు అను
అర్ధములో రక్ష అను పదము చదివి నట్లు గుర్తు .ఆ అర్ధము
కాక పోతే క్షం త వ్యు డ ను .
ఇట్లు
సుబ్బారావు
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీరన్నది నిజమే! అది ఔత్తరాహికులు గీచిన చిత్రమే. గూగుల్‌లో దొరికింది.
మీ ఉత్పలమాల చాలా బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
రక్షస్సు అంటే రాక్షసుడు. అయినా దానిని దోయి శబ్దంతో సమాసం చేయరాదు.
తాటకి నాబడు రక్కసి
రిప్లయితొలగించండిదీ టు గ నాకసము నుండి దిగువకు జూడన్
పో టు గ రాముం డ య్యె డ
గాటం బుగ శరము వదిలె తాటకి మీ దన్ .
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిచివరిపాదంలో యతిని సవరించండి. కందం కనుక ప్రాసయతి వేయకూడదు కదా!
అయ్యా! శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండిశ్రీ సుబ్బా రావు గారి పద్యము 4వ పాదముగా ఇలా వ్రాద్దాము:
"నాటెను శరమొకటి దైత్య నాయిక యెదపై" స్వస్తి.
శంకరార్యా! లక్కరాజు గారూ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగాదేయుడు పిలిచె రాముని
రిప్లయితొలగించండిబాధించు తాటకిని వధించ పాలితు డనుచున్ !
వేధించు శంశయ మునను
బాధగ పంపెను తనయుని పసివా డనుచున్ !
వనిత దీనిని జంపగా వలవదనుచు
రిప్లయితొలగించండిసందియమునొందు యారామచంద్రు తోడ
తాటకాఖ్య రాక్షసి యిది తగదు జాగు
అనుచు బోధించె కౌశికుండాత్రముగను.
ధ్వంసమొనరించె జనావాస పదములెన్నొ
దుష్ట చిత్త,భీకరరూప ,దురితచరిత,
దీని నుపేక్షింపగ రాదు స్త్రీ యటంచు
సత్వరము ప్రయోగింపుము శస్త్రములను.
వనిత దీనిని జంపగా వలవదనుచు
రిప్లయితొలగించండిసందియమునొందు యారామచంద్రు తోడ
తాటకాఖ్య రాక్షసి యిది తగదు జాగు
అనుచు బోధించె కౌశికుండాత్రముగను.
ధ్వంసమొనరించె జనావాస పదములెన్నొ
దుష్ట చిత్త,భీకరరూప ,దురితచరిత,
దీని నుపేక్షింపగ రాదు స్త్రీ యటంచు
సత్వరము ప్రయోగింపుము శస్త్రములను.