24, జులై 2012, మంగళవారం

సమస్యాపూరణం - 772 (మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

  1. అధిక భోజనమున కాయాస పడుచున్న
    విఘ్నపతిని గాంచి విధుడు నవ్వె
    నంత కుపితయైన యద్రిజ చందమా
    మగని దూలనాడి మాన్య యయ్యె

    రిప్లయితొలగించండి
  2. అతులవిక్రమాఢ్య యతివ ఝాన్సీరాణి
    యాంగ్లజనుల దౌష్ట్య మవనిలోన
    దేశరక్షణమున దీక్షితయై యాయ
    మ గని దూలనాడి మాన్యయయ్యె.

    రిప్లయితొలగించండి
  3. ఖడ్గతిక్కన సతి 'కదన రంగము నుండి
    పారి వచ్చినావు పడతి వీవ?
    స్నానమాడు పసుపు నలది నీవ'నుచును
    మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.

    రిప్లయితొలగించండి
  4. సమరరంగమందు శౌర్యమ్ముఁ జూపక
    పగరచేత నోడి పారివచ్చి
    కంటఁబడినఁ గినిసి ఖడ్గ తిక్కన భార్య
    మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.

    రిప్లయితొలగించండి
  5. భార్య సొగసుఁ గాంచి బాలచంద్రుఁడు మోహ
    పరవశుఁ డయె; యనికి నరిగి మేటి
    పౌరుషమ్ముఁ జూపవలె నంచు మాంచాల
    మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.

    రిప్లయితొలగించండి
  6. బాధ నొందె నబ ల బహు విధంబు లుగను
    మగని దూల నాడి, మాన్య యయ్యె
    భర్త కను గుణము గ బాద పూజలు సేసి
    భువిని పతుల సేవ భూష ణంబు

    రిప్లయితొలగించండి
  7. ఈనాటి సమస్యా పూరణం చేసేప్పుడు , " చందమామ గని తూలనాడి , ఆయమ కని తూలనాడి , మేనమామ గని తూలనాడి , తస్లిమ గని తూలనాడి " అనే వ్రాయాల్సి వుంటుంది .

    కని (చూచి అనే అర్థంలో ) అనేది అసమాపక క్రియ మరియు ద్రుతాంతము కాదు కాబట్టి - " గని దూలనాడి " అనే రూపం సిద్ధించదు .

    ఆలెక్కన , మగనిన్ + తూలనాడి = మగని దూలనాడి అని "మగని" అనే పదాన్ని మగడు అని స్వార్థంలో తీసుకున్న పద్ధతిలో మాత్రమే సమస్యాపూరణార్హం.

    మరే ఇతర రూపాలు సిద్ధించవని నా భావన ! ( అలా సిద్ధించాలంటే సమస్య " మగని తూలనాడి " అని వుండాలేమో !)

    శ్రీ శంకరయ్య గారే సందేహం తీర్చాలి !

    రిప్లయితొలగించండి
  8. భార్య గావలేని భర్త పౌరుషమేల?
    కాననములకేను కదలివత్తు
    ననుమతింపుడనుచు నతివ యా సీతమ్మ
    మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.

    రిప్లయితొలగించండి
  9. విష్ణునందనుల వారు ఒక సమస్యాపాదాన్ని ఎంత చక్కగా పరిశీలించారో తెలియజేశారు. ధన్యవాదాలు.
    పరిశీలించి తగువిధంగా ( గని తూ , గనిఁదూ) మార్చవలె. మరి అర్ధానుస్వారమును తీసివేసి, లేదా చేర్చి పూరణలు చేయడం అనుమతింపబడిందా? ఇప్పుడు నేను చేసిన పూరణలో తీసినట్టే అర్థం వస్తున్నది కదా , అందుకే సందేహము.

    రిప్లయితొలగించండి
  10. మరొక పూరణ.

    ఆది సతిని తండ్రి యవమానపఱచెనే,
    మగనిఁ దూలనాడి; మాన్యయయ్యె
    నగ్నియందు దుమికి యామె దగ్ధమగుచు
    బుద్ధి గఱపె నచటి బుధవరులకు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీమతి లక్ష్మీదేవిగారూ , ఒకసారి సమస్యనిచ్చాక , పూరణకు తగినట్టు దానిని మార్చడమన్నది తగని పని. అవధానాల్లో అయితే సమస్యను చదివేటప్పుడే ,సమస్యా పృచ్చకుని ఒకటికి రెండుసార్లు అడిగి , యడాగమ , నుగాగమాలను శ్రద్ధగా నిర్ధారణ చేసుకుంటారు. ఒకసారి పూరణ చేశాక ఇలాంటి ఇబ్బందులు ఎదురవకూడదనే వుద్దేశ్యంతో .

    అర్థబిందువన్నది చదువరి సౌలభ్యం కోసమై వుద్దేశింపబడినది -అర్థబిందువు వున్నా , లేకున్నా - ' తూలనాడి ' అని వున్నదా / ' దూలనాడి ' అని వున్నదా అన్నది ముఖ్యము . దాన్ని బట్టి పూరణ చేయవలసి వుంటుంది .

    ఈనాటి సమస్యలో "మగని దూలనాడి " అని వున్నది కాబట్టి " మగనిన్ " అనే విరుపుతో వచ్చే పూరణనెన్నుకొనవలసి వుంటుంది .

    రిప్లయితొలగించండి
  12. పాఠమొసగనెంచి పంచఁ జేర్చినటించి
    కాసు లొలిచి తీర కడకు రంకు
    మగనిఁ దూలనాడి మాన్య యయ్యెనల చిం
    తామణి సరి తా మురారిఁ జేరి.
    తీర=పూర్తిగా;; చింతామణిలో అ కారానికి మురారి లో అ కారానికి యతి వేశాను.

    రిప్లయితొలగించండి
  13. డా. విష్ణునందనులకు ధన్యవాదాలు. రెండవ పూరణ చదవగానే నాకూ అదే సందేహం కలిగింది. అడగకుండానే మీ వివరణ సందేహనివృత్తి చేసింది.

    రిప్లయితొలగించండి
  14. గుండు మధుసూదన్ గారి పూరణ....

    విష్ణు వక్షమందు భృగువు తన్నంగనె
    కాలి కెంత నొప్పి కలిగె నంచుఁ
    గాలి నొత్త; లక్ష్మి కలఁత చెందియుఁ దాను
    మగనిఁ దూలనాడి, మాన్య యయ్యె!

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు నమస్కృతులు,
    ఈనాటి సమస్య ఒక ఆసక్తికరమైన చర్చకు కారణమయింది. కొందరి సందేహాలూ తీరాయి. సంతోషం.
    డా. విష్ణువందన్ గారు సహేతుకంగా వివరణ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు.
    పృచ్ఛకుడు ఇచ్చిన సమస్యలోని అక్షరాలను ఎట్టి పరిస్థితిలోను మార్చటానికి అవధానికిగాని, పూరకులకు గాని అవకాశం లేదు. కాకుంటే పదాలలోని అక్షరాలను ముందు వెనుకలు జరుపుకునె అవకాశం ఉంది. ఈనాటి సమస్య ‘మగని తూలనాడి’ అని ఉంటే ‘మ - గని తూలనాడె’ అని పూరణ చేయవచ్చు. కాని ‘మగనిన్ + తూలనాడె’ అనేది ద్రుతకార్యం జరిగి ‘మగనిఁ దూలనాడె’ అయింది. అందులోని అర్ధానుస్వారాన్ని ఉపేక్షించడానికి వీలులేదు.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! డా. విష్ణునందన్ గారి వాక్యాలలో "వున్నది" అనే పదము చాల చోట్ల గోచరించినది. ఇది వ్యాకరణ విరుద్ధము అనుకొనుచున్నాను. "నుగాగమము" మరియు "యడాగగములు" ఉన్నవి కాని మరి "వున్నది" ఏ కోవకు చెందుతుంది?

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! నమస్కృతులు. ఈ నాటి సమస్యలోని చర్చనీయాంశము గురించి శ్రీ విష్ణునందన్ గారు మంచి సూచన చేసిరి. వారికి ధన్యవాదములు. నేను కూడా గమనించి యుండవలసినది. గతం గతః. మన బ్లాగు ఔత్సాహికులైన కవులకు ప్రోత్సాహమును ఇచ్చుచున్నది కాబట్టి ఇటువంటి పాఠములు అప్పుడప్పుడు ఉత్పన్నమగుట మంచిదే. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. పండిత నేమాని వారూ,
    డా. విష్ణు నందన్ గారి వ్యాఖ్య వ్యావహారిక భాషలో ఉంది. వ్యావహారికంలో ‘వున్నది, వూరు’ మొదలైన రూపాలు సర్వసాధారణం. అదే ఏదైనా పద్యం వ్రాసినప్పుడు అటువంటి ప్రయోగం ఆక్షేపణీయం అవుతుంది.

    రిప్లయితొలగించండి
  19. పుడమిఁ ద్రవ్వి ఖనిజములఁ దీసి పండెడి
    భూములన్ని బీడు వోవఁ జేసి
    కర్షకులకుఁ గీడుఁ గల్గించునట్టి త
    మ గనిఁ దూలనాడి మాన్య యయ్యె.

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని వారూ,
    ఈనాటి సమస్యలో ఆ ద్రుతకార్య ప్రసక్తి లేనట్టయితే మీ పూరణ అత్యుత్తమ పూరణ అయి ఉందేది.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మంచి భావంతో పూరణ చేసినా మీరూ అరసున్నాను ఉపేక్షించారు.
    *
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    నిజం చెప్పమంటారా? ఉదయం తొందరగా పూరణ చెప్పాలని ‘ఖడ్గతిక్కన భార్య మాంచాల’ అనే భావంతో పూరణ పోస్ట్ చేసాను. అప్పటి కెవరూ గమనించినట్లు లేదు. అది ఇది....
    సమరరంగమందు శౌర్యమ్ము జూపక
    పగరచేత నోడి పారి వచ్చి
    నట్టివానిఁ జూచి నట్టింట మాంచాల
    మగనిఁ దూలనాడి మాన్యయయ్యె.
    మీ పూరణ చూసిన తర్వాత నా పొరపాటు తెలిసికొని వెంటనే ఆ పూరణను తొలగించి ఖడ్గతిక్కన పరంగా, మాంచాల పరంగా వేరు వేరు పూరణలు చేసాను. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    ‘మగని తూలనాడి’ అని సమస్య ఉంటే మీ పూరణ చాలా బాగుండేది. అభినందనలు.
    *
    డా. విష్ణు నందన్ గారూ,
    మీ విశ్లేషణా, పూరణా చాలా బాగున్నవి. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ మొదటి పూరణను నేను చూడకముందే తొలగించారు. సరి!
    మీ రెండవ పూరణ సతీదేవి ప్రస్తావనతో చాలా బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    రంకు మగని తూలనాడిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని చివరి పాదంలో యతి మీరన్నట్టుగా కుదరదు. (చింతామణి = చింత + ఆమని కాదు కదా)
    *
    గుండు మధుసూదన్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీగురుభ్యోనమః
    నా మొదటి పూరణను తొలగించాను.
    మరొక పూరణ :
    భీమసేనునితోపాంచాలి యన్నట్లు :

    నాదు వలువ లూడ్చి నన్నవమానించ
    కౌరవ సభ యందు మీ రలుండి
    చేష్ట లుడిగి చూడసిగ్గని పాంచాలి
    మగని దూల నాడిమాన్య యయ్యె!

    రిప్లయితొలగించండి
  22. విలువ దెలియ కుండ వెలదుల వెంబడి
    ఇల్లు గుల్ల జేసి హింస బెట్టు
    పతికి నచ్చజెప్పి బ్రతుకు దెరువు జూప
    మగని దూల నాడి మాన్య యయ్యె !

    రిప్లయితొలగించండి
  23. విష్ణునందనుల వారు ఒక సమస్యాపాదాన్ని ఎంత చక్కగా పరిశీలించారో తెలియజేశారు. ధన్యవాదాలు.

    నాయొక్క పై వ్యాఖ్యలో " పరిశీలించాలో " అని వ్రాశాననుకుంటూ పరిశీలించారో అని వ్రాశాను. పెద్దలందరూ నన్ను మన్నించమని వేడుకుంటున్నాను. ఒక్క అక్షరం పొరపాటు గా వ్రాస్తే మొత్తం అర్థం మారిపోయింది. నా ఉద్దేశ్యం వారెలా పరిశీలించారో అనికాదు. ఎలా పరిశీలించాలో నేర్పారని.

    గురువు గారు, ధన్యవాదాలు. మొదటి పూరణలో మేనమామ గని అని పూరణ చేశాను.

    రిప్లయితొలగించండి
  24. మంచి మాట జెప్పి మగువ మండోదరి
    మగని దూల నాడి మాన్య యయ్యె
    వినని రావ ణుండు వెలది సీతనుదెచ్చి
    రణమున హతు డయ్యె రాము చేత !

    రిప్లయితొలగించండి
  25. సహదేవుడు గారూ,
    మీ లేటేస్ట్ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ గురించి ఇప్పటి వరకూ చెప్పని ఒకమాట చెప్పనా?
    అన్ని విధాల అద్భుతంగా ఉంది. ఒట్టు.. నిజం! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. హమ్మయ్య ! ఇన్నాళ్ళు నన్ను ప్రోత్స హిం చడానికే అనుకున్నాను . ఇప్పుడు ఖచ్చితం గా నమ్ముతున్నాను . అయితే బోలెడు ధన్య వాదాలు.

    రిప్లయితొలగించండి
  27. కంప్యూటర్ లో ఇబ్బందులవలన,ఈ పూరణను,త్యాగరాజు మీద పద్యాన్ని రాసి కూడా పోస్టు చెయ్యలేకపోయాను.ఆలస్యంగా 28-7-12 న పోస్టు చేస్తున్నాను.

    నేటి మహిళ భర్త నీతిబాహ్యుండయి
    త్రాగుబోతు,తులువ ,ధర్మదూరు
    డప్రయోజకుండు నైన యూర్కొనబోదు
    ' మగని దూలనాడి మాన్య యయ్యె .'

    భృగు మహర్షి స్వీయ పూజ్యనివాసమ్ము
    తన్నినను మురారి మిన్నకుండ
    అవకృతిని భరింపకా పంకజాసన
    ' మగని దూలనాడి మాన్య యయ్యె .'

    రిప్లయితొలగించండి
  28. కమనీయం గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి