కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె!
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె!
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
దోపిడీలు జేసి దోచెను జనులను
రిప్లయితొలగించండిదొరక కుండ తిరుగు దొరయె వాడు
నన్ను మించ వలయు నా పుత్రు డనుచును
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె!
(ప్రహ్లాదుఁడు తల్లితో)
రిప్లయితొలగించండివిశ్వరూపుఁ డతఁడు శాశ్వతుఁడును సర్వ
లోకములకుఁ దండ్రియై తనర్చు
విష్ణుదేవు పూజ విడువవలె నటంచు
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె!
అఖిల లోకములకు నధినాథు డొక్కడే
రిప్లయితొలగించండిచక్రి యని వచించు చదువు చదువు
అతని యందు ద్వేష మధికంబుగా గొన్న
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె?
విశ్వమయుడు సర్వవిద్యాస్వరూపుండు
రిప్లయితొలగించండివిష్ణువొకడె, యన్యవిద్యలేల?
దైత్యరాజ! దేవదేవునిఁ గాదని
తండ్రి! నేర్పు విద్య తప్పుగాదె?
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా!
ఈనాటి సమస్యకు ఇప్పటి వరకు వచ్చిన 4 పూరణలలో 3 ఒకే భావముతో నున్నవి. సమస్యను బట్టి హిరణ్యకశిపుడు - ప్రహ్లాదుడు కథయే ఇక్కడ తత్క్షణము ఆలోచనలోకి వస్తుంది. అయితే ఇతర భావములతో కూడా సమస్యను మిత్రులు పూరించగలరని నమ్ముచున్నాను. స్వస్తి.
పరుల సొమ్ము వద్దు నరులకు లేదిల
రిప్లయితొలగించండివిద్య మించు ధనము వినుమనుచును
తండ్రి నేర్పు విద్య తప్పు గాదెవరికిన్
విజ్ఞు డగును సుతుడు విన్న నిద్ది.
తండ్రి నేర్ప బూనె తనయునకున్ జాల
రిప్లయితొలగించండిసంపదలను గూర్చు చదువు, కాని
కొడుకు బ్రహ్మ విద్య కోరె, యోచించగా
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె?
బ్రహ్మ క్షత్రియాది ధర్మము, మర్మ స్వ-
రిప్లయితొలగించండిధర్మమునకుపొంద ధరణిలోన
నన్వయింపలేక నర్ధముతెలియక
తండ్రినేర్పువిద్య తప్పుగాదె?
హరిని జేర్చెడి కులవిద్య నక్కునగొని
రిప్లయితొలగించండినిష్ఠగ తనయునకు తండ్రి నేర్పు విద్య,
తప్పు గాదెప్పుడు స్వబుద్ధిఁ తళుకులాడి
తండ్రిఁ మించి పేరొందిన తనయుడగుట
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినేమాని వారన్నట్లు ఈనాటి సమస్యను చూడగానే ఎవరికైనా ప్రహ్లాదుడే గుర్తుకు వస్తాడు. మొట్టమొదటి పూరణ ఆ ప్రస్తావనతోనే ఉంటుందనుకున్నాను. కాని వెంటనే స్పందిచి వైవిధ్యంగా పూరించారు. చాలా బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
సమస్యను మూడవ పాదంలో అమర్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
చంద్రమౌళి గారూ,
చక్కని భావంతో మంచి పూరణ చేసారు. అభినందనలు.
‘బ్రహ్మక్షత్రియాది’ అన్నప్పుడు ‘హ్మ’ గురువై గణదోషం ఏర్పడుతున్నది. ఆ పాదంలో యతి కూడా తప్పింది. సవరించండి.
*
చంద్రశేఖర్ గారూ,
సమస్యను తేటగీతిలో పూరించి, చక్కని విరుపుతో మంచి పూరణను వైవిధ్యంగా చెప్పారు. అభినందనలు.
మీరు అర్ధానుస్వారాల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ‘బుద్ధిఁ దళుకు’ అనాలి. ‘తండ్రి మించు’ అన్నప్పుడు అరసున్నా రాదు. అలాగే ‘తళుకులాడి’ అన్నప్పుడు అర్థవైపరీత్యానికి అవకాశం ఉంది.
‘.........స్వబుద్ధిఁ దళుకు మనఁగఁ
దండ్రినే మించి పేరొందు తనయుడగుట’ అని సవరిస్తే ఎలా ఉంటుంది?
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె యనుట
రిప్లయితొలగించండినిజము , తండ్రి మంచి నేర్పు నెపుడు
కొడుకు బాగు మదిని గోరుట లె స్స యె
తండ్రి కొడుకుల యను బంధ మదియె చూడ
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం.
చివరి పాదంలో గణదోషం ఉంది. సవరించండి.
బ్రహ్మ శూద్ర గుణ భేదము, మర్మ స్వ-
రిప్లయితొలగించండిధర్మమునకుపొంద ధరణిలోన
నన్వయింపలేక నర్ధముతెలియక
తండ్రినేర్పువిద్య తప్పుగాదె?
గురువు గారికి, శ్రీ పండిత నేమాని గారికి ధన్యవాదములు,
రిప్లయితొలగించండిపాదాభివందనము జేయుచూ
హాస్యము గా
------
తల్లి నేర్పు విద్య తప్పుగా వచ్చు గా
ని, దన హితులు జెప్పు నీతు లెల్ల
నిజము కాదు గాని, నిగమము బాటించు
దండ్రి నేర్పు విద్య తప్పు గాదె
దుష్టవర్తనంబు దోపిడీతత్వంబు
రిప్లయితొలగించండిచోరుడనుచు మిగుల పేరునొంది
జీవితమున పెక్కు ఛీత్కారములుగన్న
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె?
వృత్తి విద్య నేర్చుకోని ఒక బాలునికి పెద్దలు బుద్ధిగఱపుట.
రిప్లయితొలగించండివృత్తి విద్యనెపుడు విడువకుండగఁ జేయు
తండ్రి , నేర్పు విద్య. తప్పు గాదె
సుతుడు నేర్వకున్న? సొత్తుగా భావనఁ
జేసి నేర్చినంతఁ జేరు సిరులు.
మాస్టారూ, చక్కటి సవరణ చేసినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిహరిని జేర్చెడి కులవిద్య నక్కునగొని
నిష్ఠగ తనయునకు తండ్రి నేర్పు విద్య,
తప్పు గాదెప్పుడు స్వబుద్ధిఁ దళుకుమనఁగఁ
దండ్రినే మించి పేరొందు తనయుడగుట
చంద్రమౌళి గారూ,
రిప్లయితొలగించండిమార్మికమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
సవరించిన తరువాత కూడా మొదటిపాదంలో యతి కుదరలేదు.
*
వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘వచ్చుగాని + తన’ ఇక్కడ సరళాదేశం రాదు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ చక్కని విరుపుతో ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
నా సవరణ నచ్చినందుకు సంతోషం!
భిన్నవర్గవర్ణ భేదము మర్మ స్వ-
రిప్లయితొలగించండిధర్మమునకుపొంద ధరణిలోన
నన్వయింపలేక నర్ధముతెలియక
తండ్రినేర్పువిద్య తప్పుగాదె?
తాత జ్ఞాని, తల్లి సాధ్వి, తండ్రియేమన
రిప్లయితొలగించండిరోతబట్టు చండాలుడు పూర్వ-వేమన
మూతబడ్డ తెలివికండ్లు తెరచి కొడుకుకున్
పాత తండ్రినేర్పువిద్య తప్పుగాదె! హో
మంచి మాట వినక మాయలం దునదేలి
రిప్లయితొలగించండిచేయి కాలి నంత చేత గాక
తండ్రి జెప్పి నపుడు పెడచెవి నిడకుండ
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె !
తనను మించి వేరె దైవంబు లేడంచు
రిప్లయితొలగించండిసకల లోకములకు స్వామినంచు
పంకజాక్షు పరమ భక్తుడౌ ప్రహ్లాదు
తండ్రి ,నేర్పు విద్య తప్పు గాదె !
చిన్నతనము నుండి చెడు యలవాట్లతో
దుష్ట మార్గవర్తి ,ద్రోహబుద్ధి
త్రాగుబోతు ,మరియు దస్కరుండైనట్టి
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె !
గుండు మధుసూదన్ గారి పూరణ.....
రిప్లయితొలగించండి(ప్రహ్లాదుని విష్ణుభక్తి పుష్ప సుగంధము లానుటచే ప్రభావితులైన రాక్షస
బాలకుల సంభాషణ)
సుగంధివృత్తము:
"ఖేద మంది యున్న వారి $ కేను ది" క్కటంచు నా
మోద మంది తేర్చు విష్ణు $ మూర్తి భక్తుఁ డైన ప్ర
హ్లాదు కా హిరణ్య కశ్య $ పాధిపుండునౌ నస
ద్వాది, తండ్రి, నేర్పు విద్య $ తప్పు గాదె సోదరా!
చంద్రమౌళి గారూ,
రిప్లయితొలగించండిమొదటి పూరణ సవరణతో బాగుంది.
రెండవ పూరణ ఛందస్సు ఏమిటి? దానిలోని తాత్త్వికతను అవగాహన చేసికోలేక పోయాను.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
మధుసూదన్ గారూ,
మీ పూరణ కవితా సుగంధాలను వెదజల్లింది. అభినందనలు.
శ్రీశంకరయ్యగారూ,
రిప్లయితొలగించండిఆ పద్యం త్రిశ్ర మాత్రాగణబద్ధమైన చౌపది. ప్రతి పాదములోనూ,ఆరు త్రిమాత్రాగణములూ ఒక్క గురువూ ఉంటాయి. (తకిట తకిట తకిట తకిట తకిట తకిట తా ) ఆదిప్రాసముకలదు. తాత్పరము: ఆ కుమారుని తాత జ్ఞాని, తల్లి సాధ్వి, తండ్రియో వేమన పూర్వాశ్రమం అంటే కామి, ఆశాపరుడు. ఆ తండ్రి, తన తప్పుతెలు దిద్దుకొన్న తర్వాత, తనయునకు తత్త్వములు బోధించిన సరిపోవునా అనే భావంతో, ఆటవెలదిని మాత్రాగణానికి మార్చి పూరణప్రయత్నంజేశాను. అది మీవంటివారికే స్పష్టంకాలేదు గనుక నా యత్నం సఫలంకాలేదుగా !
స్వస్తి
చంచ్రమౌళీ
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసీ . యాక్టరు గానెంచ, డాక్టరు జేయగ యంబిబియస్సుకు నంప నేల?
రిప్లయితొలగించండిటెండుల్కరునుమించి ఠీవిగా నాడగా క్రిక్కెట్టు గాక బీ టెక్కదేల ?
పాటగాడవ్వగా 'బాలు' ను మించినన్ విద్వాను చదువగన్ వెడల నేల?
యంతరిక్ష జ్ఞానమాపోసనము నెంచ సబ్మరైనుల గూర్చి చదువదేల?
ఆ.వె. యిష్ట పడిన చదువె కష్టమ్ము గాబోదు!
వత్తి డన్న దెట్లు నుత్త మమ్ము?
నదియు నిదియు గాక నప్రయోజకుడైన
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె?
చంద్రమౌళి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
సహదేవుడు గారూ,
మీ సీసపద్య పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘వత్తిడి + అన్న’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
శ్రిగురుభ్యోనమః
రిప్లయితొలగించండిగురువుగారికి ధన్యవాదములు.
తమరి సూచన మేరకు సవరణ:
సీ . యాక్టరు గానెంచ, డాక్టరు జేయగ యంబిబియస్సుకు నంప నేల?
టెండుల్కరునుమించి ఠీవిగా నాడగా క్రిక్కెట్టు గాక బీ టెక్కదేల ?
పాటగాడవ్వగా 'బాలు' ను మించినన్ విద్వాను చదువగన్ వెడల నేల?
యంతరిక్ష జ్ఞానమాపోసనము నెంచ సబ్మరైనుల గూర్చి చదువదేల?
ఆ.వె. యిష్ట పడిన చదువె కష్టమ్ము గాబోదు!
వత్తి డులను బెంచ నుత్త మమ్మె ?
నదియు నిదియు గాక నప్రయోజకుడైన
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె?