13, జులై 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 72

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

72

HE it is, the innermost one, who
awakens my being with his deep hidden
touches.

He it is who puts his enchantment
upon these eyes and joyfully plays on
the chords of my heart in varied cadence
of pleasure and pain.

He it is who weaves the web of this
maya in evanescent hues of gold and
silver, blue and green, and lets peep out
through the folds his feet, at whose
touch I forget myself.

Days come and ages pass, and it is
ever he who moves my heart in many a
name, in many a guise, in many a
rapture of joy and of sorrow. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

అతఁడె నా యంతరాంతర మధివసించి
తన గభీరనిగూఢమౌ తాకుతోన
లీలగా నస్మదాత్మను మేలుకొల్పు ||

తన విచిత్రంపు గారడితనఁపు సొంపు
నేర్పుతో నాకనుంగవ నింపు నతఁడె,
నాదు సుఖదుఃఖ భిన్నభిన్నస్వరాల
హృదయతంత్రులు వేడ్క మ్రోయించు నతఁడె ||

బంగరువు వెండి రంగులఁ బసరు నీలి
వన్నెలన్ మాయవల యల్లువాఁ డతండె,
దానిలోనుండి సడలించి తనపదములు
ముడుచుకొని మెలమెల్లగా నిడు నతండె,
తా నొకించుక నన్ సోకి నేనె నన్ను
మరచు నట్టుల పరవశపరచు నతఁడె ||

దినము లరుదెంచు, యుగములు తిరిగిపోవు,
కాని బహునామరూపము లూని యెపుడు
మేలుకీడుల, మోదఖేదాల తడల
నోలలార్చుచు నామది నుండు నతఁడె ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి