11, జులై 2012, బుధవారం

రవీంద్రుని గీతాంజలి - 70

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

70

Is it beyond thee to be glad with the
gladness of this rhythm ? to be tossed
and lost and broken in the whirl of this
fearful joy ?

All things rush on, they stop not,
they look not behind, no power can
hold them back, they rush on.

Keeping steps with that restless, rapid
music, seasons come dancing and pass
away colours, tunes, and perfumes
pour in endless cascades in the abound-
ing joy that scatters and gives up and
dies every moment. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఇది మహానంద వాహిని, యీ ప్రచండ
గమనవేగము నిన్ మించి కలదు, నీదు
ఛంద మిద్దాని లయగతి కందునొక్కొ?
దీని భీషణమౌ సుడిలోనె దొర్లె
దొకొ? లయమ్మయి ప్రవహిలుచుందు వొక్కొ?
విరిగిపడి నుగ్గు నుగ్గయి తిరిగె దొక్కొ? ||

(దిక్కు దిక్కున మిన్నెల్ల పిక్కటిల్లె,
*వినవె మృత్యువు మీటెడి వీణెమ్రోత,
చంద్ర భాస్కర తారకాచయము మండు
టగ్గి యానందకీలల నిగ్గు దేరి
మెరయు చిటునటు బిరబిర పరుగులెత్తు,
ఆ మహోన్మాదకారి గానానుగతుల
నేవి యెచటికిఁ బరచుట యెఱుఁగఁ డెవ్వఁ,)
డన్నిఁటం గనుపట్టు ననంతజవము,
తెరపి యెఱుఁగవు, వెనుకకుఁ దిరిగి కనవు,
వాని నాపెడి బల మెందుఁ గానరాదు,
పరు గదియె వాని కానందగరిమ గూర్చు ||

అ మ్మహాగానరయముతో నడుగు కల్పి
యారు ఋతువులు నాట్యము లాడు చెపుడు
పొలుపుమై వచ్చుచుండును బోవుచుండు,
వాని రాకన రంగులు, గానముల్, సు
వాసనల్ సెలయేళులభంగి నిచ్చ
పడుచు, విరియుచు, రూపు గోల్పడుచు, విలయ
మందు చుండుఁ దదానంద మందె మున్గి || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి