17, జులై 2012, మంగళవారం

సురవర తెలుగు కీబోర్డ్

సురవర తెలుగు కీబోర్డ్

          ప్రస్తుతం నేను సురవర తెలుగు కీబోర్డుతో టైపు చేస్తున్నాను. అన్ని విధాల సౌకర్యంగా ఉంది. దాని వివరాలు....

          తెలుగులో కంప్యూటర్లో పని చేయడమంటే అదేదో బ్రహ్మ విద్యనో లేకపోతే కేవలం కొందరు సాంకేతిక విజ్ఞానం కలవారికి మాత్రమే సొంతం అన్నది నిన్నటి మాట.
          సురవర కీబోర్డ్‌తో మనం వేరే ఏ సాఫ్టువేర్ల అవసరం లేకుండానే, చాలా సులువుగా తెలుగులో టైప్ చెయ్యవచ్చు.
suravara telugu keyboard


ఈ కీబోర్డ్…

    కంప్యూటర్లు, ల్యాప్టాప్‌లపై పని చేస్తుంది.
    మైక్రోసాఫ్ట్ విండోస్ 7, ఎక్స్పీ, విస్టా, లినక్స్, అను ఫాంట్స్‌పై పని చేస్తుంది.
    ఇంగ్లిష్, తెలుగు రెండూ సపోర్ట్ చేస్తుంది.
    ఇన్‌స్క్రిప్ట్ స్టాండర్డ్ నిమిషాల్లో నేర్పిస్తుంది.
    యూనికోడ్ తెలుగును మన మునివేళ్ళపై ఉంచుతుంది.
    మన కంప్యూటరుకు తెలుగు రుచి చూపిస్తుంది.


ఈ కీబోర్డ్ తో మనం....

    అతిసులభంగా తెలుగులో టైప్ చేయవచ్చు.
    తెలుగులో ఈ-మెయిల్స్ పంపించవచ్చు.
    తెలుగులో చాటింగ్ చేయవచ్చు.
    తెలుగులో కథలు, నవలలు రాయవచ్చు.
    తెలుగులో డాక్యుమెంట్లు ప్రింట్ చేయవచ్చు.
    తెలుగులో వెబ్సైట్లు నడపవచ్చు.
    ఆంగ్ల భాషకు లభించే అన్ని సౌలభ్యాలు తెలుగుకు కూడా దగ్గర చేయవచ్చు.


ఈ కీబోర్డును ఎలా కొనాలి?

ఈ కీబోర్డ్ ను కొనటం చాలా సులభం. కొనే విధానాలకోసం suravara.com ను చూడండి.

ఈ కీబోర్డ్ గరిష్ఠ అమ్మకపు ధర 1500/- రూపాయలు మాత్రమే.
ప్రత్యేకమయిన 33.4% తగ్గింపు తరువాత ఇప్పుడు మీరు కేవలం 999/- రూపాయలకే ఈ కీబోర్డ్‌ను సొంతం చేసుకోవచ్చు.


3 కామెంట్‌లు:

 1. ఒక keyboard కొనటం కొరకు 999 రూపాయలు వెచ్చించాలంటే కష్టం.

  రిప్లయితొలగించండి
 2. గురువు గారికి ధన్యవాదములు,
  సురవర కీ బోర్డ్ కొనుటకై ప్రయత్నము జేసెదను .

  రిప్లయితొలగించండి
 3. శ్యామలీయం గారూ,
  దీనిని కామర్స్ అంటారో, ఎకనామిక్స్ అంటారో నాకు తెలియదు... ఒక వస్తువు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. ఉత్పత్తి ఎక్కువయినప్పుడు యూనిట్ విలువ తగ్గుతుంది. అప్పుడు ఆ వస్తువు ధర తగ్గుతుంది. ఇప్పటికీ ఈ కీబోర్డును లాభాపేక్ష లేకుండా ఉత్పత్తి ధరకే అందిస్తున్నారు. ఏమో... డిమాండ్ పెరిగి ఉత్పత్తి పెరిగితే ఇది 500 రూ.లకే లభించవచ్చు.
  *
  వరప్రసాద్ గారూ,
  సంతోషం!

  రిప్లయితొలగించండి