3, జులై 2012, మంగళవారం

రవీంద్రుని గీతాంజలి - 62

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

62

WHEN I bring to you coloured toys,
my child, I understand why there is
such a play of colours on clouds, on
water, and why flowers are painted in
tints when I give coloured toys to
you, my child.

When I sing to make you dance I
truly know why there is music in leaves,
and why waves send their chorus of
voices to the heart of the listening
earth when I sing to make you dance.

When I bring sweet things to your
greedy hands I know why there is
honey in the cup of the flower and why
fruits are secretly filled with sweet juice
when I bring sweet things to your
greedy hands.

When I kiss your face to make you
smile, my darling, I surely understand
what the pleasure is that streams from
the sky in morning light, and what
delight that is which the summer breeze
brings to my body when I kiss you to
make you smile.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

చిన్ని నా పాప! నీ కేను వన్నె వన్నె
బొమ్మ లిచ్చిన యపుడె నిజమ్ము తెలిసె ||

పసిఁడి వన్నియ లేల ప్రభాతవేళ?
నాడుకొనుటేల రంగులతోడ మబ్బు?
లేటికో రంగువానలు నీటిమీద?
నేలనో రంగు లద్దుట పూలలోన?
చిన్ని నా పాప! నీ కేను వన్నె వన్నె
బొమ్మ లిచ్చిన యపుడె నిజమ్ము తెలిసె ||

పాడుచుం బాడుచుం జిట్టిపాప! నిన్ను
నేన యాడించునప్పు డీ నిజము తెలిసె ||

దళము దళమునఁ దరులతాతతులనిండ
నీలపాటల సొంపులు దేలుటేల?
పుడమి యానందమున గగుర్పొడుచునట్లు
జలతరంగాలు గానము సలుపు టేల?
పాడుచుం బాడుచుం జిట్టిపాప! నిన్ను
నేన యాడించునప్పు డీ నిజము తెలిసె ||

ఆసతో నీవు చాపిన హస్తమందుఁ
దీయని మిటాయి పెట్టినఁ దెలిసె నిద్ది ||

పూలగిన్నెల మకరంద మేలయుండె?
పండులం దీపి గుప్తమై నిండె నేల?
యాసతో నీవు చాపిన హస్తమందుఁ
దీయని మిటాయి పెట్టినఁ దెలిసె నిద్ది ||

చిట్టి! ని న్నేను నవ్వింపఁ జిన్ని మోము
ముద్దుగొనుతరి నిజముగ నిద్ది తెలిసె ||

నా ముఖముపయిఁ బ్రత్యుషోనభము నించు
వెలుఁగు ధారల నుల్లాస మొలుకు టేమొ?
అల వసంతఁపు మలయమందానిలమ్ము
పుడికినప్పుడు ముద మెదఁ బొదలు టేమొ?
చిట్టి! ని న్నేను నవ్వింపఁ జిన్నిమోము
ముద్దుగొనుతరి నిజముగ నిద్ది తెలిసె ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి