రవీంద్రుని గీతాంజలి
తెనుఁగు సేత
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
67
THOU art the sky and thou art the nest
as well.
O thou beautiful, there in the nest it
is thy love that encloses the soul with
colours and sounds and odours.
There comes the morning with the
golden basket in her right hand bearing
the wreath of beauty, silently to crown
the earth.
And there comes the evening over
the lonely meadows deserted by herds,
through trackless paths, carrying cool
draughts of peace in her golden pitcher
from the western ocean of rest.
But there, where spreads the infinite
sky for the soul to take her flight in,
reigns the stainless white radiance.
There is no day nor night, nor form nor
colour, and never, never a word.
తెనుఁగు సేత
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
67
THOU art the sky and thou art the nest
as well.
O thou beautiful, there in the nest it
is thy love that encloses the soul with
colours and sounds and odours.
There comes the morning with the
golden basket in her right hand bearing
the wreath of beauty, silently to crown
the earth.
And there comes the evening over
the lonely meadows deserted by herds,
through trackless paths, carrying cool
draughts of peace in her golden pitcher
from the western ocean of rest.
But there, where spreads the infinite
sky for the soul to take her flight in,
reigns the stainless white radiance.
There is no day nor night, nor form nor
colour, and never, never a word.
చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....
నిఖిలమున కాశ్రయం బగు నింగి యీవ,
నింగిఁ గల పక్షిగూడును నీవ దేవ!
మేటి సౌందర్యమూర్తి! యా గూటిలోని
జీవునకు నీదు ప్రేమన యావరించు
వన్నెలుం బలుకులును సువాసనలును ||
ఉషసు, సౌందర్యమాలిక లుబుకు పసిఁడి
పూలబుట్టిని దన వలకేలఁ బట్టి
వచ్చుచుండు నీరవముగ, వసుధ మస్త
కమ్మునఁ దురాయి వెట్టి పట్టమ్ముగట్ట ||
పసులు తిరుగని పచ్చిక బయళులందుఁ,
గాలిజాడలు వడని యేకాంతపథము
లందు, విశ్రాంతిమయపశ్చిమాబ్ధినుండి
శాంతిశీతామృతమ్మున స్వర్ణఘటము
నింపుకొని తెచ్చు మలుసంజ నేలకడకు ||
కాని నీవు రాజిల్లెడి గగనమో య
పార, మది యాత్మకొరకు విప్పారియుండు,
నచ్చటం దాన సర్వమై మచ్చలేని
తెలివెలుంగది రాజ్యము సలుపుచుండు,
పవలు రేలని లేవు, *మానవులు లేరు,
ప్రాణు లెవ్వియు లేవు, రూపమ్ము లేదు,
*తావి చవులును లేవు, శబ్దమ్మయేని
యెప్పు డచ్చోటు సోక దొకించుకైన ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి