చంద్రశేఖర్ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. మా మిత్రుని తల్లి ఉండేది. మార్కెట్‌కు వెళ్ళాలంటే వేంకటేశ్వరాలయం ముందునుంచి వెళ్ళాలి. ఆవిడ దూరమైనా సరే చుట్టూ తిరిగి వెళ్ళి వచ్చేది. తప్పని పరిస్థితుల్లో ఆగుడిముందు నుంచి వెళ్ళవలసి వస్తే కొంగుచాటు చేసుకొని ముఖం తిప్పుకొని వెళ్ళేది. మేం ఆమెను చూసి నవ్వుకునేవాళ్ళం.
గురువుగారూ. నేను మీకు అజ్ఞాత శిష్యుడ్ని. తెలుగు పద్యాలంటే చాలా ఇష్టం. మీ బ్లాగు ప్రతీరోజూ ఒక గంటైనా చూస్తాను. పండితులు కొందరు రాసే సమస్యాపూరణం పద్యాలు వాటిపై మీ వ్యాఖ్యలు సవరణలు చదువుతుంటాను. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. బ్లాగులో వ్యాఖ్య రాయటం మొదటి ప్రయత్నం. తప్పులుంటే మన్నించండి. నమస్కారం.... మీ శిష్యుడు... కట్టా సత్యనారాయణ రాజు.
కట్టా సత్యనారాయణ రాజు గారూ, మీ లేఖ నాకు ఆనందాన్ని కలిగించింది. మీరు కూడా పద్యాలు వ్రాయడానికి ప్రయత్నించండి. మీకు అన్ని విధాలా సహకరించడానికి నేనూ బ్లాగు మిత్రులు ఉన్నాం. అంతేకాకుండా మీకు నచ్చిన పూరణలను గురించి వ్యాఖ్యానించండి. కవులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మరి శ్రావణ భృగు వారము
రిప్లయితొలగించండిహరునర్ధాంగికి వ్రతములు నటులే చూడన్
సరి మంగళ వారమునను
వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.
స్థిరభక్తియు, శ్రద్ధ, మనః
రిప్లయితొలగించండిపరిపాకము ధర్మమందు పరమాదరమున్
మరచిన నాస్తిక జీవులు
వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.
పరమత విద్వేషమతులు
రిప్లయితొలగించండివరలక్ష్మీ వ్రతము ఝెయవలదంద్రు, బుధుల్
వర హృదయమ్మున నందురు
వరలక్ష్మీ వ్రతము భాగ్య వరదంబనుచున్
ధరలో నడమంత్రముచే
రిప్లయితొలగించండిసిరులను గోరుచును వేగ శ్రీ దేవి కృపన్
అరకొర భక్తిని మనమున
వరలక్ష్మీ! వ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.
వీరశైవ, లింగాయత స్త్రీ మనసులో మాటగా:
రిప్లయితొలగించండిపరమేశ్వర జంగమ కా
వర! లక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్
మరి నే మంగళగౌరీ
పర దేవతనే కొలుతును పాపవినాశా!
ధరణిన యోగ్యత లేకనె
రిప్లయితొలగించండివరముల బడయంగలేరు! వాక్కిది వినుమా!
వరములఁ బొంద నయోగ్యులు
వరలక్ష్మీవ్రతముఁజేయవలదంద్రు బుధుల్!
స్థిరనిష్ఠ నాచరింపుము
రిప్లయితొలగించండివరలక్ష్మీవ్రతముఁ; జేయవలదంద్ర్ర్రు బుధుల్
సురపాన మాంసభక్షణ
లరయఁగఁ బాపమ్ముఁ గూర్చు నట్టివటంచున్.
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘హరి యర్ధాంగికి’ అనబోయి ‘హరు నర్ధాంగికి’ అన్నారేమో అని సందేహం.
*
చంద్రమౌళి గారూ,
‘చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా’ అన్నట్టు మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
పందిత నేమాని వారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
శంకరార్యా ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రావణ మంగళ వారం గౌరీ వ్రతం, శుక్ర వారం వర లక్ష్మీ వ్రతం చేయుట సంప్రదాయం..అటుదిటు ఇటుదటు చేయ కూడదని బుధులంటారని నా అభిప్రాయం.
ధరలో నోములు పూజల
రిప్లయితొలగించండితరుణుల కింపైన వ్రతము తరియిం చంగన్ !
స్థిరమైన భక్తి మరచిన
వరలక్ష్మీ వ్రతముఁ జేయ వలదంద్రు బుధుల్ !
సరవిని విధవలును, స్వయం
రిప్లయితొలగించండివరము జరుగనట్టి పిన్న పడుచు, లుదక్యల్,
పురుటింటివా, రశౌచులు
వరలక్ష్మీ వ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.
సిరులిడుశ్రీదేవినెపుడు
రిప్లయితొలగించండివరలక్ష్మి వ్రతము జేయు వనితల కెల్లన్
త్వరపడి నాషాడంబున
వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్!!!
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినిజమే. నేనె పొరబడ్డాను. మన్నించండి.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
గురువుగారికి నమస్సులు, నా పూరణ మీద మీ వాఖ్య మరచారు. అదే నాకు టానిక్కు
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
రిప్లయితొలగించండినిజమే... మౌజ్ చక్రాన్ని పైకి కిందికీ తిప్పినప్పుడు తప్పిపోయింది.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
ధరణిన్ లేదా ధరణిని అంటే బాగుండేది.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
మా మిత్రుని తల్లి ఉండేది. మార్కెట్‌కు వెళ్ళాలంటే వేంకటేశ్వరాలయం ముందునుంచి వెళ్ళాలి. ఆవిడ దూరమైనా సరే చుట్టూ తిరిగి వెళ్ళి వచ్చేది. తప్పని పరిస్థితుల్లో ఆగుడిముందు నుంచి వెళ్ళవలసి వస్తే కొంగుచాటు చేసుకొని ముఖం తిప్పుకొని వెళ్ళేది. మేం ఆమెను చూసి నవ్వుకునేవాళ్ళం.
గురువుగారూ. నేను మీకు అజ్ఞాత శిష్యుడ్ని. తెలుగు పద్యాలంటే చాలా ఇష్టం. మీ బ్లాగు ప్రతీరోజూ ఒక గంటైనా చూస్తాను. పండితులు కొందరు రాసే సమస్యాపూరణం పద్యాలు వాటిపై మీ వ్యాఖ్యలు సవరణలు చదువుతుంటాను. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. బ్లాగులో వ్యాఖ్య రాయటం మొదటి ప్రయత్నం. తప్పులుంటే మన్నించండి. నమస్కారం.... మీ శిష్యుడు... కట్టా సత్యనారాయణ రాజు.
రిప్లయితొలగించండికట్టా సత్యనారాయణ రాజు గారూ,
తొలగించండిమీ లేఖ నాకు ఆనందాన్ని కలిగించింది. మీరు కూడా పద్యాలు వ్రాయడానికి ప్రయత్నించండి. మీకు అన్ని విధాలా సహకరించడానికి నేనూ బ్లాగు మిత్రులు ఉన్నాం. అంతేకాకుండా మీకు నచ్చిన పూరణలను గురించి వ్యాఖ్యానించండి. కవులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
దొరసాని వోలె గట్టిగ
రిప్లయితొలగించండినరచుచు మగడిని కసిరెడి నారీమణి నీ
విరసము దుర్భరమవగా
వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్
తిరుగుచు క్లబ్బుల వెంటను
రిప్లయితొలగించండిపరువులు బెట్టించి మగని పచ్చల కొరకై
కరచుచు నత్తయ్య నెపుడు
వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్