WHEN the creation was new and all
the stars shone in their first splendour,
the gods held their assembly in the sky
and sang " Oh, the picture of perfec-
tion I the joy unalloyed ! "
But one cried of a sudden " It seems
that somewhere there is a break in the
chain of light and one of the stars has
been lost."
The golden string of their harp
snapped, their song stopped, and they
cried in dismay "Yes, that lost star
was the best, she was the glory of all
heavens ! "
From that day the search is un-
ceasing for her, and the cry goes on
from one to the other that in her the
world has lost its one joy !
Only in the deepest silence of night
the stars smile and whisper among
themselves " Vain is this seeking !
Unbroken perfection is over all ! "
the stars shone in their first splendour,
the gods held their assembly in the sky
and sang " Oh, the picture of perfec-
tion I the joy unalloyed ! "
But one cried of a sudden " It seems
that somewhere there is a break in the
chain of light and one of the stars has
been lost."
The golden string of their harp
snapped, their song stopped, and they
cried in dismay "Yes, that lost star
was the best, she was the glory of all
heavens ! "
From that day the search is un-
ceasing for her, and the cry goes on
from one to the other that in her the
world has lost its one joy !
Only in the deepest silence of night
the stars smile and whisper among
themselves " Vain is this seeking !
Unbroken perfection is over all ! "
చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....
జగతి నవనవ నిర్మితి నెగడి నపుడు,
తొలి వెలుంగుల చుక్కలు పొలుచు నపుడు,
గుంపులై మింట వేల్పులు కొలువు దీరి
గాన మొనరించి రిట్టులు *వీణపైన
“ఎంత నిండైన కళయిది యిచట నహహ!
యెంత నిర్మలమైన హాయి కల” దంచు ||
అంతలోనె హఠాత్తుగ నరచి రెవరొ
“అయయొ! తెగిపోయినది కాంతిహార, మరరె!
యేదొ యొక చుక్క దీనిలో లే” దఁటంచు ||
“అకట! పోయిన చుక్క రమ్యాతిరమ్య,
మది సకల నాకలోక శోభైక నిలయ,
మది మహా మహనీయ, మౌ, నౌ”నఁటంచు
నెల్ల సురలొక్క పెట్టున గొల్లు మనిరి ||
దేవతా వీణ బంగరుతీగ లపుడె
పళ్లు మని తెగె, పాటలు చల్లఁబడియె ||
నాటినుండి తదన్వేషణమ్మె తెగదు,
*(రేయి నిదుర లేదు, పగలు హాయి లేదు,)
మాటి కివ్వియె కేక లెచ్చోట విన్న
“ఒక్క యా చుక్క లేమిచే నక్కటకట!
జగము గోల్పడెఁ దన పెను సంబరంబు,
సృష్టికళ నిండుదనమె లోపించె” నంచు
మాటి కివ్వియె కేక లేనోట విన్న ||
కాని చుక్కలు గంభీర మౌన నిశల
మింట మిలమిలలాడు చొండొంటితోడ
“నిది వృధాశ్రమ, సృష్టికిఁ గొదువ లేదు,
నిండుదనమున నన్నియు నుండె” నంచు
ముసినగవు లొల్క గుసగుస ముచ్చటించు ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి