లక్ష్మీదేవి గారూ, ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వ్రాసిన మీ పూరణ పద్యం బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, చెడుతో మొదలిడి యన్నిఁటఁ జెడు నిలిపియు పూరణమ్ముఁ జేసియు మెప్పిం చెడు మీ నైపుణ్యము నెం చెడు వారలు మెచ్చి రిదె విశిష్టత మీకున్. * సుబ్బారావు గారూ, చక్కని విరుపుతో సమస్యను సమర్థంగా పూరించారు. అభినందనలు. కొన్ని లోపాలు... నా సవరణలతో మీ పద్యం....
ఎడముగ నుంచుట మంచిది చెడువానిం, గొలువ సిరులు చేకురు మనకున్ మృడునిం భక్తిని నిరత మ్మొడుదుడుకులు లేక యెపుడు నుండిన మేలౌ . * సహదేవుడు గారూ, వృత్యనుప్రాసాలంకారంతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు. * సత్యనారాయణ మూర్తి గారూ, మనోజ్ఞంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * మధుసూదన్ గారూ, మీ అచ్చతెనుగు పూరణ చాలా బాగుంది. అభినందనలు.
అడిగిన కోర్కెలు దీర్చుచు
రిప్లయితొలగించండిసడి సేయక దా పరుగున చనుదెంచు, సదా
పడగల వానిపై శయనిం
చెడువానిం గొలువ సిరులు చేకుఱు మనకున్.
చెడు తలపులు నిర్మూలిం
రిప్లయితొలగించండిచెడు వానిన్ సంతతమ్ము శ్రేయమ్ములు గూ
ర్చెడు వానిన్ భక్తుల బ్రో
చెడు వానిన్ గొలువ సిరులు చేకురు మనకున్
శ్రీ నేమాని గురువర్యులకు నమస్సులు.
రిప్లయితొలగించండిఒక్క "చెడు" కాదు, నాలుగు "చెడు"లు. భ్రహ్మాండం.
పడగల దొరపై శయనిం
రిప్లయితొలగించండిచెడు వానింగొలువ సిరులు జేకుఱు మనకున్
అని సవరణ.
అడిగిన వరముల నిచ్చుచు,
రిప్లయితొలగించండికడగండ్లను బాపి సుఖము కలుగన్ జేయున్,
వడివడిగన్ భక్తుల కా
చెడువానిన్ కొలువ సిరులు చేకుఱు మనకున్.
ఎడ ము గ నుంచుము నెప్పుడు
రిప్లయితొలగించండిచె డు వానిం, గొలువ సిరులు చేకురు మనకున్
మృ డు నిం భక్తి తొ నిరతము
ఒడు డుడుకులు లేక నెపుడు నుండిన మేలౌ .
శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు. నా పద్యములను నచ్చెడు వారికి, మెచ్చెడు వారికి కూడా కృతజ్ఞతలు. స్వస్తి.
రిప్లయితొలగించండిఅడుగడుగు దండముల వా
రిప్లయితొలగించండిడిడుగిడుగోయేడుకొండలేలెడిఱేడున్
వడివడిగబడుగులనుఁగా
చెడువానింగొలువ సిరులుచేకుఱుమనకున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉడుపతిని శిరముపైనిడి
రిప్లయితొలగించండిబడుగుల కడగండ్లు దీర్చ పరమాత్ముండై
పుడమికి సత్వర మేతెం
చెడువానిం గొలువ సిరులు చేకురు మనకున్.
భూదేవి ని కొలువ గిరులు చేకూరు మనకున్
రిప్లయితొలగించండిశ్రీ దేవేని కొలువ సిరులు చేకూరు మనకున్
భూ శ్రీ పతియై వైకుంట మున నివశిం
చెడువానింగొలువ సిరులు చేకూరు మనకున్!
చీర్స్
జిలేబి.
గుండు మధుసూదన్ గారి పూరణ....
రిప్లయితొలగించండిఉడురాజుం దన తలపై
నిడు వేలుపుఁ దొల్లి కాన్పు, నేనిక సిరసున్,
గడు నెమ్మిని వే మన్నిం
చెడు వానిం, గొలువ సిరులు చేకుఱు మనకున్!
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వ్రాసిన మీ పూరణ పద్యం బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
చెడుతో మొదలిడి యన్నిఁటఁ
జెడు నిలిపియు పూరణమ్ముఁ జేసియు మెప్పిం
చెడు మీ నైపుణ్యము నెం
చెడు వారలు మెచ్చి రిదె విశిష్టత మీకున్.
*
సుబ్బారావు గారూ,
చక్కని విరుపుతో సమస్యను సమర్థంగా పూరించారు. అభినందనలు.
కొన్ని లోపాలు... నా సవరణలతో మీ పద్యం....
ఎడముగ నుంచుట మంచిది
చెడువానిం, గొలువ సిరులు చేకురు మనకున్
మృడునిం భక్తిని నిరత
మ్మొడుదుడుకులు లేక యెపుడు నుండిన మేలౌ .
*
సహదేవుడు గారూ,
వృత్యనుప్రాసాలంకారంతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
మనోజ్ఞంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
మధుసూదన్ గారూ,
మీ అచ్చతెనుగు పూరణ చాలా బాగుంది. అభినందనలు.
బుడిబుడి యడుగుల నడచుచు ,
రిప్లయితొలగించండివడివడి పరుగిడుచు వెన్న,పాలను హరియిన్
చెడు బుడతనివలె నటియిన్
చెడు వానిన్ గొలువ సిరులు చేకురు మనకున్.
పిడికెడు భక్తిని గొలిచిన
రిప్లయితొలగించండికడివెడు వరమిచ్చి తుదకు కాపాడునుగా !
ముడుపులు కోరక కరుణిం
చెడువానిం గొలువ సిరులు చేకుఱు మనకున్ !
కమనీయం గారూ,
రిప్లయితొలగించండివృత్యనుప్రాసతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
చెడువాడు కంస ఖలునకు
రిప్లయితొలగించండిచెడువాడగు శకుని కెన్న శిశుపాలునకున్
చెడువాడు మగధ పతి కా
చెడు వానిన్ గొలువ సిరులు చేకురు మనకున్
పడి ముత్తూటు ఫినాన్సున
రిప్లయితొలగించండికడివెడు బంగారు నగలు కట్టగ మూటల్
వడివడిగా వాటిని పం
చెడువానిం గొలువ సిరులు చేకుఱు మనకున్
గడపల నెక్కుచు దిగుచున్
రిప్లయితొలగించండిగడబడ లేకుండ కోరి గంపల వోట్లన్
తడబడకుండ మదిర పం
చెడువానిం గొలువ సిరులు చేకుఱు మనకున్