27, జులై 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 86

DEATH, thy servant, is at my door.
He has crossed the unknown sea and
brought thy call to my home.

The night is dark and my heart is
fearful yet I will take up the lamp,
open my gates and bow to him my
welcome. It is thy messenger who
stands at my door.

I will worship him with folded hands,
and with tears. I will worship him
placing at his feet the treasure of my
heart.

He will go back with his errand done,
leaving a dark shadow on my morning ;
and in my desolate home only my
forlorn self will remain as my last
offering to thee.


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

నీదు సందేశముం గొని నేడు రేడ!
పరిచితముగాని మేటి సాగరము దాటి
చేరఁ బారెను మిత్తి నా ద్వారమునకు ||

చిమ్మచీఁకటి యీరేయిఁ గ్రమ్ముకొనియె,
మెండుకొనియె భయమ్ము నాగుండె నిండ,
నైనఁ గానిమ్ము, దీపము బూని తలుపు
దెరచి స్వాగత మిచ్చెద శిరసువంచి
వచ్చె నీమృత్యుదూత నాద్వారమునకు ||

కేళ్లమోడుపుతోడఁ గన్నీళ్లతోడ
పూజ గావింతు, తత్పాదమూలమందు
ప్రాణభండారమున్ సమర్పణ మొనర్తు ||

నా యుషసుమీద చీఁకటిచాయ దించి
తనపని ముగించి నీదూత తరలిపోవు,
వట్టి మాయింట మిగిలియున్నట్టి నన్ను
నేన తుదికాన్కగాగ నీకిచ్చుకొందు ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి