13, జులై 2012, శుక్రవారం

పద్య రచన - 49


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. బాల్యమందు విద్యలు పట్టుబడునటంచు
    పెద్దలంద్రు; నేర్చుకొనిన వృత్తి విద్య
    కూడు పెట్టునదెన్నడు గొప్పదనుచు
    పలుకు పెద్దల మాటలు పడచు వారు

    చెవిని బెట్టక, నెల్లరు చిన్న వారి
    నంపుచుందురు బడులకు, హన్న! ఇష్ట
    మున్న లేకపోయిననైన నొప్పుకొనక
    తప్పదనుటయు న్యాయమె! తగదు తగదు.

    శ్రమను గలదదెల్ల శుభము, చక్కనైన
    స్వాస్థ్య దేహమ్ము, చుఱుకైన సహజ బుద్ధి
    వికసనమ్మిక, నొత్తిడి పిల్లవారల
    కెపుడు నుండదు; నమ్మిక హెచ్చునికను

    తమపయిన; నిపుణతకల్గు; దారి తెన్ను
    లేని విద్యలేల? చదువు లిచట చూడ
    నేఁడు గమ్యమెఱుగకుండ నేర్చు విధము
    వలన నేరికి మేలగు? ఫలము లేదు.

    చదువు పైన నిచ్ఛకలిగి చదువు వార
    లెల్ల చదువవలయు, లేని యెడల వలదు.
    ప్రజల కుపయోగ పడుచును, పనుల జేసి
    కొనిన జీవన పయనము గొప్పదగును.

    రిప్లయితొలగించండి
  2. బాల కార్మికు డా త డు బాడి గూ ని
    నినుప కడ్డిని బాద గ నింత లోన
    తండ్రి వారించె బాలక ! దరికి రాకు
    చదువు కొమ్మిక బుద్ధిగ చదువు లన్ని .

    రిప్లయితొలగించండి
  3. బాలక! వృత్తి విద్యలను బాగుగ నేర్చుట యెంతయేనియున్
    మేలొనగూర్చుచుండు, నిను మెచ్చుచునుందురు పాఠశాలలో
    చాల వివేకవంతునిగ చక్కగ విద్యలు నేర్చు చుండియున్
    వీలగు వేళలందిటుల వేడుక గూర్తువటంచు దండ్రికిన్

    రిప్లయితొలగించండి
  4. తండ్రి రూపమండ్రు తనయుండు జగతిలో
    శ్రద్ధబూను చుండి జనకవరుని
    గూడి యందమొప్ప కులవిద్యలనునేర్చు
    పుత్రు డెల్లవేళ పొందు యశము.

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పద్యములు....

    ఆ.వె.
    పేదఱికపు శాప మే దారిఁ బట్టెనో
    చూడఁ జూడ నదియుఁ జోద్య మాయె!
    చిన్న బిడ్డఁ డిట్టు లెన్నియుఁ బని సేయ;
    బాల కార్మికుఁ డన వలదె నేఁడు?

    తే.గీ.
    ఆకుటుంబ మందు నందఱుఁ బని సేయ
    గడచు దినము, మిగుల గడ్డు దినము!
    పిల్లవాండ్రుఁ గూడఁ బెద్ద పనులు సేయ
    వలసి రాఁగ, నదియు ప్రభుత తప్పు!

    కం.
    చదువఁగ వలసిన వయసున
    బ్రదుకఁగఁ బని సేయఁగాను వలసెను, కట్టా!
    యిది యేమి కాలమయ్యా?
    మది రోసెడి ప్రభుత తీరు మారఁగ వలయున్!

    ఆ.వె.
    కనుక, ప్రభుత ధనము ఖర్చు చేసితి మంచుఁ
    బ్రగతి లేక; మిగుల సుగతిఁ గనక;
    బాలకార్మికులను బడిఁ జేర్పఁగా లేక;
    ధనము ఖర్చు సేయ, ధర్మ మగునె?

    కం.
    ప్రతి యింటికి వలసిన పని
    సతతము నిడి బ్రతుకు బాటఁ జక్కఁగ వేయన్;
    గతి చక్కఁ బడును; పిల్లలు
    మితి లేకను జదువుకొండ్రు మీఱిన తమితో!

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్య పంచరత్నాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘బాడిగన్ + ఊని’ అన్నప్పుడు సంధిలేదు. ‘పట్టి సుత్తి..’ అందాం.
    *
    పండిత నేమాని వారూ,
    మీ వృత్తం బాగుంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మధుసూదన్ గారూ,
    మీ పద్యాలు ప్రశస్తంగా ఉన్నాయి,. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. ఎందుకు బాలక తిప్పలు
    ముందుకు బోవలె చురుకుగ ముత్తెపు దొరవై !
    పొందగ సుఖములు మెండుగ
    అందముగా చదువు కొనుచు హాయిగ నుండన్ !

    రిప్లయితొలగించండి
  8. బాలుని స్వగతం/చెప్పదలచి చెప్పలేకపోయిన గతం


    పలకా బలపమ్ముల నిడి
    పలుకులతలి ఒడికి,బడికిఁ బంపక నన్నే
    ములుకుల మాటలనాడి ప
    నిలోనఁబెట్టెదవ నాన్న? నీకిది మేలే?


    పోషింప లేని జనకుల
    దూషించినచోఁ సుతుడు దుష్టుడు కానీ
    శోషించెడి సంతానముఁ
    బోషింప నొకని బలిగొన పుడమిని ఒప్పౌ.


    నామిత్రులెల్లరును నగు
    మోములతోఁ జదువుకొనగఁ బోవుచు నుండన్
    గోమున్ గోరెడి వయసున
    నేమీ నాకీ గతి?నిజమెరెగిన దేవా?

    సుమసదృశ హస్తములకును సుత్తినిడగ
    మనసదెట్లొప్పెనోకదా మానవాధ
    ములకు చెప్పుమయ్యానాకు భూమినాధ!
    తరుగునెట్లు బుద్ధి వయసు పెరుగు చుండ?


    అమ్మా! కందిన చేతులు
    నమ్ముము నయమౌను, బో, కనదలచినావే?
    సమ్మెట క్రిందన నలిగెడి
    కమ్మని బాల్యమును కనుము, కంటే, కంటే.


    అబ్బబ్బా బొబ్బలకే?
    మబ్బును నాకున్ను చదువు లంపుము బడికిం
    కబ్బురపు కొలువైన దినము
    తబ్బిబ్బులు గాకపోవు తండ్రీ నీవే!




    ఉచితమ్ము బడికి బోవుట
    ఉచితమ్మౌ భోజనమట నుచితము విద్యే!
    కుచితమ్మౌ యోచన మా
    ని చక్కగ నను బడినందు నీవే విడుమా!

    వ. అట్లు గాక

    దారిన బోవునెవండో
    ఔరౌరా! ఘోరమనుచు నంతట జనియే
    నేరము నీపై మోపిన
    చేరెదరు దొరయున్ను నీవు, చెరలో తండ్రీ!

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. బలము లేనివాడ పాల బుగ్గల వాడ
    పలకదేది చేత బలపమేది
    సుత్తి గొట్ట కనకు సుత్తిని గొట్టకు
    పనిని విడచి వెడలు బడికి చిన్న.

    రిప్లయితొలగించండి
  10. పూర్వ కాలాన కులవృత్తి పొసగుచుండె
    తండ్రి నుండి నేర్చెడి వాడు తనయుడెపుడు
    బాల్యదశ నుండి నేర్చె నుపాధి కొరకు
    అదియె తగు విద్య వేరేల యనవసరము.

    బాలకార్మిక వ్యవస్థ పాలకులు ని
    షిద్ధ మొనరించి నందున చెల్లబోదు
    పాఠశాలకు బోవలె బాలబాలి
    కలు విధిగ ,శాసనమ్ము ప్రకార మిపుడు.

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    సుతిమెత్తని చేతుల్లో సుత్తిని చూడగానే కలిగిన ఆవేదనలో కవితావేశం పెల్లుబికినట్లుంది మీలో. చక్కని పద్యాలు రాసారు. అభినందనలు.
    రెండవ పద్యం రెండవ పాదంలో గణదోషం. ‘సుతుడు’ను ‘సుతుండు’ అంటే సరి!
    చివరి పద్యం చివరి పాదంలో గణదోషం. ‘చేరెద రిక దొరయు నీవు..’ అంటే సరి!
    *
    హనుమచ్చాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పలక + అది’ అన్నప్పుడు సంధి లేదు. ‘పలక యేది చేత...’ అందాం.
    *
    కమనీయం గారూ,
    సార్థకనామధేయులై కమనీయమైన పద్యాలు వ్రాసారు. అభినందనలు.
    రెండవ పద్యం మొదటి పాదంలో ‘కార్మికవ్యవస్థ’ అన్నపుడు గణదోషం. ‘కార్మికపు వ్యవస్థ’ అందాం.

    రిప్లయితొలగించండి