15, జులై 2012, ఆదివారం

సమస్యాపూరణం -763 (కోటి కంటె యొకటి)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

కోటికంటె నొకటి మేటి గాదె!

16 కామెంట్‌లు:

 1. శుష్కమైన యట్టి శోభలేని పలుకు
  కోటి కంటె యొకటి మేటి గాదె
  చేసినట్టి మేలు, చిన్నవారలకెల్ల
  విలువలనిక నేర్పు వేగిరముగ.

  రిప్లయితొలగించండి
 2. చేయ యాగ తతులు చిరు బురు లాడుచు
  కోటి కంటె, యొకటి మేటి గాదె
  సత్య భాష ణం బు సతతము విడువక
  సత్య మేవ జయతి సకలమునకు

  రిప్లయితొలగించండి
 3. ఒకటి నాని యేడు నొట్టి సున్నాలున్న
  కోటి యౌను విలువ మేటి గాను
  ఒకటి లేని కోటి యొట్టి సున్నే యైన
  కోటి కంటె యొకటి మేటి గాదె !

  రిప్లయితొలగించండి
 4. పద్య విద్య యొక్క ప్రాభవమ్మును దెల్పి
  యుత్సుకతను బెంచు నొక్క బ్లాగు
  చూడ సరకు లేని సొగసైన బ్లాగులు
  కోటి కంటె యొకటి మేటి గాదె!

  రిప్లయితొలగించండి
 5. చెడుతలంపులెపుడు చిత్తంబునన్ కల్గు
  దుష్టజనులచయము కష్టమిడును,
  సుజనుడైనవాడు చూడనొక్కడు చాలు
  కోటి కంటె యొకటి మేటి గాదె.

  రిప్లయితొలగించండి
 6. ఆహా, మిస్సన్న గారు,
  చప్పట్లండి, మీకు. ఏంచెప్పారు ఒక్క ముక్కలో మన బ్లాగ్ గొప్పతనం గురించి. భలే!!!!

  రిప్లయితొలగించండి
 7. Missanna gaaru mee padyam chaala baagundi. Nenu ee bloguku kotha. aangla padalanu padya puranalo vadacho ledo ane chinna sandeham vunnindi. Endukante angla padalanu ichina kuda avadhanulu vaatini telugu padalalo imidinchi padyanni purinchadam manamu chusthuntamu. Vudaharanaku oka avadhaniki(naaku avadhani peru sariga gnapakam ledu) stop listen and proceed ani nalugu padalu isthe aayana ishtapurthi(stop ane padanni imidincharu) ... ani padyam prarambinchi anni padalanu telugu padalalone imidinchi purthi chesaru. Naaku konni aangla padalanu alage vadese anukulatha vunte elago ala(ee anukulatha vunnappatikini naaku koncham kashtame ayinappatikini ani) padya purana cheyagalanane bhavana kaluguthindi. Ippudu meeru blogu ane aangla padaanni vaadi naa sandehaanni nivrutthi chesaru. Abhinandanalu.

  రిప్లయితొలగించండి
 8. ఆస్తి కోట్లులేదు - ఆరోగ్య వంతుడు
  ఆశలేన్నొగాని, యాత్మబలిమి
  శంకలేక యున్న, యంకీల జంకేల
  కోటి కంటె యొకటి మేటి గాదె

  రిప్లయితొలగించండి
 9. లక్ష్మీ దేవి గారూ ధన్యవాదాలు.
  అజ్ఞాత గారూ చాలా సంతోషం పద్యం నచ్చినందులకు.
  నిజానికి ఆంగ్ల పదాలను గురువు గారు, నేమాని పండితార్యుల వంటి పెద్దలు అనుమతించరు. మంచి తెలుగు పద సంపద లేని నా బోంట్లు గతి లేని పరిస్థితుల్లో ఆంగ్లపదాలను వాడుతూంటాం.
  మీకు ఆసక్తి ఉన్నది కనుక తప్పక పూరణలు ప్రయత్నం చెయ్యండి.
  తప్పులు దిద్దటానికి గురువులు, మార్గ దర్శనం చెయ్యడానికి పెద్దలు
  ఉండనే ఉన్నారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. ఔర! కౌరవులకు యాదవుల్ పదివేవు
  రైరి పాండవులకు హరి యొకండె
  సాయ మహహ ఘోర సంగరమున నట్టి
  కోటి కంటె యొకటి మేటి గాదె

  రిప్లయితొలగించండి
 11. రామ రామ యనుచు రాత్రైన పగలైన
  వ్రాసి వ్రాసి తుదకు రోసి పోవ
  చిత్త మందు భక్తి చెదర కుండిన చాలు
  కోటి కంటె నొకటి మేటి గాదె ?

  రిప్లయితొలగించండి
 12. గుండు మధుసూదన్ గారి పూరణ....

  ఒకటఁ గోటి సైన్య; మొకట శ్రీకృష్ణుండు;
  'మాట' సాయమ! 'యని' మాట సున్న!
  భండనమున గెలుపు పార్థసారథి యిడఁ
  గోటి కంటె నొకటి మేటి గాదె?

  రిప్లయితొలగించండి
 13. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  ప్రశస్తమైన భావంతో పూరణ చేసారు. అభినందనలు.
  కాకుంటే ‘ఒట్టి’ అనే గ్రామ్యపదాన్ని ప్రయోగించారు.
  *
  మిస్సన్న గారూ,
  మీకు సవినయంగా నమస్కారం చేయడం కంటే ఇంకేమీ వ్యాఖ్యానించలేను. అంతా మీ అభిమానం, ఉత్సాహం.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  అజ్ఞాత గారూ,
  చాలా సంతోషం! చమత్కారంగా, హాస్యోక్తిగా పద్యాలు వ్రాసినప్పుడు ఆంగ్లపదాలను వాడిన కవులు ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో తప్పదు. మీరు ప్రస్తావించిన అవధాన విశేషం ఆసక్తికరంగా ఉంది. మీరూ పద్య రచనకు ప్రయత్నించండి.
  మీరు ప్రస్తావించినట్లే ‘వెయిట్ - లిజెన్ - లుక్ - గో’ పదాలను ప్రయోగిస్తూ రామాయణార్థంలో నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయమని ‘దత్తపది’ని ఇస్తాను.
  ధన్యవాదాలు.
  *
  చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  కోటి కొక్కడు ఆంటూ కృష్ణుని ప్రస్తావించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  రామకోటిని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీరూ నేమాని వారివలె కృష్ణుని ఆశ్రయించారు. చక్కని పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. పరుని బాధ దీర్చి ప్రాణదానము సేయు
  నంతకన్న యనఘ మైన దేది?
  పూని క్రుంకులిడిన పుణ్యతీర్థమ్ములు
  కోటికంటె నొకటి మేటి కాదె?

  స్వార్థబుద్ధి తోడ స్వంత కార్యము దీర్ప
  కల్లబొల్లి కబురు లల్లి చెప్ప
  నెన్ని యైననేమి హితవచ నమె మేలు
  కోటి కంటె ,నొకటి మేటి కాదె ?

  రిప్లయితొలగించండి
 15. ఊరు, వాడలేగి వేరందరఁ గలిసి
  అంటి, ముట్టి క్రిములనందు బదులు
  ఇంటిపట్టు నుండి ఇల్లాలి ఇడ విను,
  కోటి కంటె నొకటి మేటి కాదె?

  రిప్లయితొలగించండి