22, జులై 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 81

ON many an idle day have I grieved
over lost time. But it is never lost, my
lord. Thou hast taken every moment
of my life in thine own hands.

Hidden in the heart of things thou
art nourishing seeds into sprouts, buds
into blossoms, and ripening flowers into
fruitfulness.

I was tired and sleeping on my idle
bed and imagined all work had ceased.

In the morning I woke up and found
my garden full with wonders of flowers.


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....


వ్యర్థముగ నష్టమై పోయినట్టి నాళ్లు
తలఁచి పలుమారు లేను చింతింలుచు నుందు,
గాని యవి నష్టమౌట యెక్కడిది స్వామి?
నా బ్రదుకున నొక్కొక్క క్షణమ్ము నీవు
నీదు హస్తంబునం దాల్చి నిల్చియుండ ||

ప్రతి పదార్థము లోన గుప్తముగ నుండి
యరసి పోషించు నంతర్నియంత వీవ,
బీజములనుండి మొలక దెప్పింతు వీవ,
చిట్టి మొగ్గలఁ బువ్వులు చేతు వీవ,
విరులు ఫలములుగా మార్చి వేతు వీవ,
ఫలములం *గర్భబీజాలు నిలిపె దీవ ||

బడలి పవళింప నలసతఁ బాన్పు జేరి
“ఆగిపోయె సమస్త కార్యము” లటంచు
మదినిఁ దలఁచుచుఁ దలఁచుచు నిదురపోతిఁ,
గాని మేల్కాంచి యయ్యుషఃకాల మందె
నేను చూతును గదా! మదుద్యాన మెల్ల
నబ్బురము గొల్పు పూలు నిండారఁ బూచె ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి